కరకాల కారణాలతో జుట్టు సమస్యలు అందరినీ వేధిస్తున్నాయి. స్త్రీ పురుషు బేధం లేకుండా అందరూ ఏదో ఒక జుట్టు సమస్యతో బాధ పడుతూనే ఉన్నారు. ఇందుకు కారణాలు అనేకం. కొందరి జుట్టు సమస్యలకు లైఫ్ స్టయిల్ కారణం అయితే కొందరికి ఒత్తిడి. మరి కొందరు ఫ్యాషన్ పేరుతో జుట్టును రకరకాలుగా అబ్యూజ్ చేస్తున్నారు. రంగులు వెయడం, తాత్కాలికంగా అందంగా కనిపించేందుకు రకరకాల రసాయన ట్రీట్మెంట్లు వెరసి జుట్టు రాలడమే కాదు అందవిహీనంగా కూడా మారుతోంది. తలమీది చర్మం పాడైపోయి జుట్టు తిరిగి పేరిగేందుకు కావల్సిన పోషణ అందడం లేదు. వీటన్నింటికి మంచి పరిష్కారాలు ఇక్కడ తెలుసుకుందాం.


అందమైన మెరుపులీనే జుట్టు కావాలని ఎవరికుండదు? అందరూ పొడవైన, సాఫ్ట్, సిల్కీ హెయిర్ గురించి కల కనే వారే. కానీ అలాంటి జట్టు ఎలా సొంతం చేసుకోవాలో అర్థం కాదు. ఒక రోజు హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టుకుంటే చాలు సగం జుట్టు రాలిపోతుంది. జుట్టుకు హైలైట్స్ వేసుకోవాలని ఆశ వేసుకుంటే జుట్టు ఫ్రీజిగా, రఫ్ గా మారి అందవిహీనమవుతుంది. మరి ఎలా? జుట్టును తిరిగి అందంగా మార్చుకునే దారేది అంటే ఉందనే అంటున్నారు హెయిర్ ఎక్స్ పర్ట్స్. అందమైన జుట్టు కోసం హెయిర్ కేర్ లో అరటి పండును భాగం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. అరటి పండు జుట్టును హైడ్రేట్ చేసి అందంగా ఆరోగ్యంగా కనిపించేలా చేస్తుంది.


జుట్టు పోషణలో అరటిపండును ఉపయోగించే కొన్ని రకాల హెయిర్ మాస్క్ ల గురించి తెలుసుకుందాం.


అరటి పండు కొబ్బరి నూనె మాస్క్


ఈ మాస్క్ తయారీకి రెండు అరటి పండ్లు పొట్టు తీసి ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె అవసరమవుతాయి. రెండింటిని కలిపి మెత్తగా రుబ్బి పేస్ట్ లాగా చేసి దాన్ని జుట్టు కుదళ్ల నుంచి వెంట్రుకల చివరి వరకు పట్టించాలి. గంట తర్వాత షాంపుతో కడిగేసుకోవాలి.


అరటి పండు, తేనె


తేనె, అరటి పండు మిశ్రమం తలమీద చర్మాన్ని కండిషనింగ్ చెయ్యడానికి తోడ్పడుతుంది. ఇది చాలా మంచి హెయిర్ మాస్క్, ఒక టెబుల్ స్పూన్ తెనె, రెండు బాగా పండిన అరటిపండ్లను కలిపి రుబ్బి మెత్తని పేస్ట్ గా చేసి దీన్ని తల నుంచి జుట్టు కొసల వరకు పట్టించి 30, 40 నిమిషాల తర్వాత షాంపుతో కడిగేసుకోవాలి. ఇది చుండ్రును నివారిస్తుంది. మెత్తని, సిల్కీ జుట్టు మీ సొంతమవుతుంది.


అరటి పండు, ఆర్గాన్ ఆయిల్ మాస్క్


అరటి పండు, ఆర్గాన్ ఆయిల్ రెండు కూడా మంచి పోషకాలు కలిగిన పదార్థాలు. రెండు అరటిపండ్లు, రెండు మూడు స్పూన్ల ఆర్గాన్ ఆయిల్ ఉపయోగించి ఈ మాస్క్ తయారు చేసుకోవచ్చు. ముందుగా రెండు అరటి పండ్లను తీసుకుని పొట్టుతీసి బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ అరటి పండ్ల పేస్ట్ కి  ఆర్గాన్ ఆయిల్ వేసి బాగా కలపాలి. విటమిన్ ఇ రిచ్ ఆర్గాన్ ఆయిల్ కలపడం వల్ల జుట్టకు మంచి పోషణ అందుతుంది. తల మీది చర్మం ఆరోగ్యవంతంగా ఉంటుంది.


Also Read: వేసవిలో ఐస్ యాపిల్స్ తింటే చాలా మంచిదట - ప్రయోజనాలివే!