Streamer’s Real Face Revealed After Filter Glitch : సోషల్ మీడియాలోని ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ ఎప్పటిలానే లైవ్-స్ట్రీమ్ చేసింది. అదే సమయంలో బ్యూటీ ఫిల్టర్ విఫలమవడంతో.. ఆమె అసలు ముఖం కాసేపు కనిపించింది. ఆమె ముఖాన్ని చూసిన ఫాలోవర్లు.. ఒక్కసారిగా ఆమెను అన్‌ఫాలో చేశారు. ప్రస్తుతం స్ట్రీమ్ నుంచి తీసిన ఒక చిన్న క్లిప్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇది ఫిల్టర్లు, ఆన్‌లైన్ అందాల ప్రమాణాలు, నిజాయితీ గురించిన చర్చకు దారితీసింది. కొందరు ఆమెను విమర్శించగా.. మరికొందరు ఆమెను సమర్థించారు. ఫిల్టర్ లేకుండానే బాగుందంటూ చెప్పారు. కానీ ఆలోపే ఆమె లక్షకు పైగా ఫాలోవర్లను కోల్పోయిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు వైరల్ అయ్యాయి.
లైవ్ స్ట్రీమ్‌లో బ్యూటీ ఫిల్టర్ ఫెయిల్ కావడంతో
ఈ వైరల్ క్లిప్ దాదాపు నాలుగు సెకన్ల నిడివితో ఉంది. ఒక చైనీస్ లైవ్-స్ట్రీమర్ తన బెడ్‌రూమ్ నుంచి స్ట్రీమ్ చేస్తోంది. ఆమె వెనుక మృదువైన లైటింగ్, పూల హెడ్‌బోర్డ్ ఉన్నాయి. అలాగే ఆమెకు పొడవాటి నల్లటి జుట్టు ఉంది. ఊదా రంగు స్ట్రాప్‌లెస్ టాప్ ధరించింది. బంగారు ఆభరణాలు కూడా ధరించింది.
స్ట్రీమ్ మధ్యలో బ్యూటీ ఫిల్టర్ కాసేపు పనిచేయడం ఆగిపోయింది. ఆమె ముఖం సహజ చర్మ ఆకృతి, చర్మపు రంగులో కనిపించింది. కొన్ని సెకన్ల తరువాత మళ్లీ ఫిల్టర్ వచ్చింది. ఆ ఫిల్టర్‌లో ఆమె లేత, మృదువైన, బొమ్మలాంటి రూపాన్ని ఇస్తుంది. పెద్ద కళ్లు, జా లైన్ అన్ని బాగా ఉన్నాయి. లోపం సమయంలో ఆమె తన జుట్టును సర్దుబాటు చేసి.. ఫిల్టర్ రాగానే కొద్దిగా నవ్వి ఎప్పటిలాగే స్ట్రీమ్‌ను కొనసాగించింది. అయితే ఆ స్ట్రీమర్ గురించి ఇంకా ఎవరికి తెలియదు.
ప్రస్తుతం ఈ వీడియో X, Instagramలో బాగా వైరల్ అయింది. ఫిల్టర్ విఫలమైన వెంటనే ఆమె దాదాపు 1.4 లక్షల మంది ఫాలోవర్లను కోల్పోయిందని పోస్ట్‌లు షేర్ చేశారు. ఈ వాదన ఆమె ధృవీకరించలేదు కానీ.. వినియోగదారుని కంటెంట్ బ్యూటీపై మాత్రమే ఆధారపడి ఉందనే చర్చకు తీసుకువచ్చింది.
లైవ్ స్ట్రీమింగ్ చైనాలో ఒక ప్రధాన పరిశ్రమ. ముఖ్యంగా టిక్‌టాక్ చైనా వెర్షన్ అని తరచుగా వర్ణించే డోయిన్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో.. స్ట్రీమర్‌లు గంటల తరబడి లైవ్ చేస్తారు. వీక్షకులతో చాట్ చేస్తారు. పాటలు పాడతారు. డ్యాన్స్ చేస్తారు. అలాగే ప్రొడెక్ట్స్ అమ్ముతారు. ఆదాయం ప్రధానంగా అభిమానులు పంపే వర్చువల్ బహుమతుల నుంచి వస్తుంది. వీటిని నిజమైన డబ్బుతో కొనుగోలు చేస్తారు. వ్యూయర్స్‌ను ఆకర్షించడంలో క్రియేటర్ లుక్ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే చాలా మంది చర్మాన్ని మృదువుగా చేసే, కళ్లను పెద్దదిగా చేసే బ్యూటీ ఫిల్టర్‌లు వాడుతారు.
