Easy Diwali Rangoli with Flowers For Deepavali 2025 : దీపావళి సమయంలో అత్యంత ప్రధానమైన పనుల్లో తప్పకుండా చేయాల్సింది ఏదైనా ఉందా అంటే అది రంగోళి(Diwali is incomplete without Colorful Rangoli) వేయడమే. అవును ఇంటి ముందు చక్కని ముగ్గు వేసి.. దానిని పువ్వులతో నచ్చిన రంగులతో అలంకరించి.. దానిపై దీపాలు పెడితే చాలు. మొత్తం పండుగ ఇంటి ముందు ఉన్నట్లు అనిపిస్తుంది. రంగోళిని కేవలం అలంకరణ కోసమే కాదు.. శ్రేయస్సు, ఆనందం కోసంతో పాటు అందరికీ స్వాగతం చెప్పడాన్ని సూచిస్తాయి. అయితే ఈ దీపావళి 2025 (Diwali 2025 Rangoli Designs) కోసం మీరు ఎలాంటి ముగ్గులు వేయాలని ఆలోచిస్తున్నారా? అయితే అందమైన పువ్వుల రంగోలి డిజైన్(Flower Rangoli Ideas)లు ఎలా వేయవచ్చో.. వాటిని ఎలా అలంకరిస్తే లుక్ బాగుంటుందో ఇప్పుడు చూసేద్దాం.
క్లాసిక్ రంగోలి.. పువ్వులతో
దాదాపు అందరూ ఈజీగా వేయగలిగే రంగోళిలలో ఇది ఒకటి. దీనిని మీరు ఇంటి ముందు, హాల్లో, బాల్కనీలో వేసుకునేందుకు అనువైనది. చాలా సులభంగా, ఆకర్షణీయంగా వేయగలిగే ముగ్గు ఇది. దీనికోసం మీరు బంతి పువ్వు, గులాబీ, చామంతి రేకులను ఉపయోగించవచ్చు. సర్కిల్ డిజైన్ వేసుకుని.. మధ్యలో నుంచి పూరేకులతో ఫిల్లింగ్స్ చేసుకుంటూ.. బయటి వరకు వచ్చేయవచ్చు. దీనిని ప్రధాన ద్వారాలు లేదా పూజా గదుల వద్ద కూడా వేసుకోవచ్చు. దీపావళి సాయంత్రం ప్రకాశవంతమైన లుక్ తీసుకురావడానికి దీనిని వేయవచ్చు. అలాగే ఈ ముగ్గును చిన్న దివ్వెలతో అలంకరిస్తే లుక్ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ డిజైన్ మొత్తం పండుగ వాతావరణాన్ని పెంచుతుంది.
నెమలి-రంగోలి
భారతదేశ జాతీయ పక్షి నుంచి నుంచి ప్రేరణ పొందుతూ.. ఈ పండక్కి నెమలిని రంగోలిగా వేయవచ్చు. దానిని పువ్వులు, ఆకులతో అలంకరిస్తే ఇంకేమైనా ఉందా.. పండుగ శోభ డబుల్ అయిపోద్ది. అయితే ఈకల కోసం ఆకులు, నీలిరంగు పువ్వులు ఉపయోగించవచ్చు. శరీరం కోసం ఆకుపచ్చ బంతి పువ్వులు, దానిరంగుకు సరిపోలే పువ్వులు, ఆకులు ఎంచుకుంటే నెమలి అందంగా కనిపిస్తుంది. ముందుగా నెమలిని డ్రా చేసి.. లేదా ముగ్గుతో వేసి.. దానిని పువ్వులు, ఆకులతో నింపాలి. అప్పుడే రంగోలి కరెక్ట్‌గా వస్తుంది. అలాగే ఈకల దగ్గర దీపాలు పెట్టండి. మీ ముగ్గు సెంట్రాఫ్ అట్రాక్షన్‌గా మారుతుంది.
తామర రంగోలి డిజైన్
(Image Source: ABPLIVE AI)
లోటస్ స్వచ్ఛత, శ్రేయస్సుని సూచిస్తుంది. కాబట్టి దీపావళి డిజైన్స్ వేయాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్ అవుతుంది. దీనిని కూడా తేలికగా వేయవచ్చు. ఈ తామర పువ్వు రంగోళి కోసం మీరు గులాబీ, పసుపు, తెల్లని పూలు ఎంచుకుంటే మంచిది. మల్టీపుల్ కలర్స్ ఫ్లవర్స్‌తో మీరు లోటస్‌ను క్రియేట్ చేయవచ్చు. దీనిని పూజా ప్రాంతానికి దగ్గర్లో వేసుకోవచ్చు. ఎందుకంటే.. ఇది మీకు ఆధ్యాత్మిక లుక్ ఇస్తుంది. పువ్వు మధ్యలో దీపం పెట్టి.. చివర్లో కూడా క్యాండిల్స్ లేదా దీపాలు పెడితే చూసేందుకు రెండు కన్నులు సరిపోవు.
దీపపు రంగోలి
పువ్వులు, లైట్లను మిక్స్ చేస్తూ.. దీపం ఆకారంలో వేసిన రంగోలి.. దీపావళికి పర్ఫెక్ట్ రంగోలి అనిపించుకుంటుంది. బంతి పువ్వు రేకులతో దీపం ఆకారంలో ఈ డిజైన్ వేయండి. లోపలి భాగాలను ఎరుపు గులాబీలు లేదా ఇతర అందమైన పూరేకులతో నింపండి. మెరిసే లుక్ కోసం.. రంగోళ అంచుల వెంబడి చిన్న దీపాలను వెలిగించండి. ముగ్గుపై గ్లిట్టర్ లుక్‌కోసం.. రంగులు కూడా వేయవచ్చు. ఇది మరింత రియలిస్టిక్ లుక్ ఇస్తుంది.
ఇవేకాకుండా మీరు మండలా ఫ్లవర్ రంగోలి వేయవచ్చు. దీనికోసం ఎక్కువరంగుల పువ్వులను ఉపయోగించాల్సి ఉంటుంది. ఎన్ని ఎక్కువ కలర్స్ ఉంటే ముగ్గు అంత అందంగా మారుతుంది. అయితే దీనిని వేసేందుకు ఓపిక, క్రియేటివిటీ చాలా అవసరం. కానీ దీపావళి వేడుకల్లో ఇదే హైలెట్‌గా కూడా ఉంటుంది. లేదంటే మీరు మీకు వచ్చిన చుక్కల ముగ్గులు వేసి.. వాటి రంగులు, పువ్వులతో నింపి.. అందంగా దీపాలు పెడితే చాలు పండుగ శోభ ఇట్టే వచ్చేస్తుంది. మరి ఈ దీపావళికి మీరు కూడా ఈ తరహా ముగ్గులు వేసి.. మీ ఇంటిని హైలెట్‌గా మార్చేయండి.