2025 అక్టోబర్ 07 రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu 7 October 2025

Continues below advertisement

మేష రాశి

ఈ రోజు మీ సృజనాత్మకత స్నేహితులను మీ వైపుకు ఆకర్షిస్తుంది. వజ్రాలు, బొగ్గు, సున్నం రంగాల్లో వ్యాపారులకు లాభాలొస్తాయి. జీవితాన్ని  సాధారణంగా ఉంచుకోవడం మీకు మంచిది. అకస్మాత్తుగా వచ్చిన బాధ్యత మీ దినచర్యను దెబ్బతీస్తుంది. మీరు ఇతరుల కోసం ఎక్కువ మరియు మీ కోసం తక్కువ సమయం కేటాయిస్తున్నారని గుర్తించండి శుభ సంఖ్య: 9రంగు: ఎరుపుపరిహారం: హనుమంతునికి సింధూరం సమర్పించండి.

Continues below advertisement

వృషభ రాశి

అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపారంలో వస్తున్న అడ్డంకులు తొలగిపోతాయి. ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రోజు మీరు వ్యాపారంలో లాభం చేకూర్చే వ్యక్తిని కలుసుకుంటారు. మీ సృజనాత్మకతతో అందర్నీ ఆకట్టుకుంటారు.

శుభ సంఖ్య: 6రంగు: తెలుపుపరిహారం: సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి.

మిథున రాశి

మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. పెట్టుబడి పెట్టేటప్పుడు అనుభవజ్ఞులైన వారి అభిప్రాయాన్ని తీసుకోండి. గృహ వ్యవహారాలను వెంటనే పరిష్కరించండి, నిర్లక్ష్యం ఖరీదు భారీగా ఉంటుంది. భాగస్వామ్యంలో విజయం సాధిస్తారు.. కానీ ఆలోచించి అడుగు వేయండి.

శుభ సంఖ్య: 5రంగు: ఆకుపచ్చపరిహారం: అవసరమైన వారికి ఆకుకూరలు దానం చేయండి.

కర్కాటక రాశి

ఈ రోజు మీకు నిజమైన ప్రేమ లభిస్తుంది. కుటుంబ సహాయం తీసుకోవలసి రావచ్చు. ఉద్యోగస్తులకు బయటి అవకాశాలు లభిస్తాయి. మీ కీర్తి పెరుగుతుంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. గాయపడే అవకాశం ఉంది..వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త శుభ సంఖ్య: 2రంగు: తెలుపుపరిహారం: దుర్గామాతకు ఎర్రటి పువ్వులు సమర్పించండి.

సింహ రాశి

మీరు కష్టపడి పనిచేయడం ద్వారా కుటుంబం ఆశలు నెరవేరుస్తారు. వ్యాపారంలో కొత్త ప్రారంభం చేయవచ్చు. ముఖ్యమైన పనుల్లో విజయం లభిస్తుంది. మీడియా , సృజనాత్మక రంగాల వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది.

శుభ సంఖ్య: 1రంగు: బంగారుపరిహారం: చేపలకు ఆహారం వేయండి కన్యా రాశి

ఈ రోజు మీరు ఖాళీ సమయాన్ని ఆనందిస్తారు. లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించండి. తల్లి ఆరోగ్యం మిమ్మల్ని కలవరపెడుతుంది. కార్యాలయంలో వాతావరణం కష్టంగా ఉండవచ్చు. పుకార్లను నమ్మవద్దు.

శుభ సంఖ్య: 3రంగు: ఆకుపచ్చపరిహారం: గణేశునికి దూర్వా సమర్పించండి.

తులా రాశి

ఈ రోజు మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. పూర్వీకుల ఆస్తి నుంచి లాభం పొందుతారు. పని చేసే ప్రదేశంలో అనవసర వాగ్ధానాలు చేయొద్దు.  పెద్దల ఆశీస్సులు మీకు తోడుగా ఉంటాయి.

శుభ సంఖ్య: 6రంగు: నీలంపరిహారం: వృద్ధులకు సేవ చేయండి.

వృశ్చిక రాశి

ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. కార్యాలయంలో సహోద్యోగితో వాగ్వాదం పెట్టుకుంటారు. తల్లిదండ్రులకు నమస్కరించి ఇంటి నుంచి బయలుదేరండి.

శుభ సంఖ్య: 9రంగు: ముదురు ఎరుపుపరిహారం: మంగళవారం నాడు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.

ధనుస్సు రాశి

మంచి డబ్బు సంపాదిస్తారు కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. బంధువులు , స్నేహితుల నుంచి మీకు సహకారం లభిస్తుంది. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండండి.  కొత్త ఆలోచనలు లాభం చేకూరుస్తాయి. ప్రతికూల ఆలోచనల వల్ల నష్టం జరగవచ్చు.

శుభ సంఖ్య: 3రంగు: పసుపుపరిహారం: విష్ణువుకు అరటిపండ్లు నైవేద్యంగా సమర్పించండి మకర రాశి

విజయం సాధించడానికి మీరు మరింత కష్టపడాలి. ఉద్యోగం చేసేవారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అకస్మాత్తుగా ధన వ్యయం పెరగుతుంది. సహోద్యోగులతో విభేదాలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుంది.

శుభ సంఖ్య: 8రంగు: నలుపుపరిహారం: శని దేవునికి ఆవాల నూనె సమర్పించండి.

కుంభ రాశి

ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. పేదలకు వస్త్రాలు దానం చేయండి. అనవసరమైన గొడవలకు దూరంగా ఉండండి.

శుభ సంఖ్య:4రంగు: నీలంపరిహారం: శివలింగానికి అభిషేకం చేయండి మీన రాశి

చట్టపరమైన సమస్యల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. సహోద్యోగులు మీ పని శైలితో అసంతృప్తి చెందవచ్చు. కొత్త ఆలోచనల వల్ల లాభం ఉంటుంది.

శుభ సంఖ్య: 7రంగు: లేత నీలంపరిహారం: తులసి మొక్కకు నీరు పోసి దీపం వెలిగించండి.

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.