లికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం వల్ల జలుబు, దగ్గు, ఫ్లూ వంటి అనేక రకాల సమస్యలు దాడి చేస్తాయి. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉండటం వల్ల ఇవి సంభవిస్తాయి. ఇది శరీరంలోని తీవ్రతరమైన వాత, కఫ దోషాల ఫలితంగానే జరుగుతుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. మారుతున్న రుతువులని బట్టి ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో కూడా మార్పులు చేసుకోవాలి. అప్పుడే సీజనల్ వ్యాధులతో పోరాడగలిగే శక్తి మనకి లభిస్తుంది. వ్యాధుల తీవ్రమైన లక్షణాలని అభివృద్ధి చేసే ప్రమాదాన్ని తగ్గించగలుతారు. అందుకే వాతావరణానికి తగ్గట్టుగా ఆహార ఎంపికలు చేసుకోవడం చాలా ముఖ్యం అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. శీతాకాలంలో మీ డైట్లో ఈ ఆహారాలు చేర్చుకుంటే రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు సాధ్యమవుతుంది. అవేంటంటే..


వేరుశెనగ


అందరి వంటింట్లో తప్పనిసరిగా లభించే పదార్థం ఇది. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, సూక్ష్మ, స్థూల పోషకాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు దోహదపడతాయి. అనేక వ్యాధుల నుంచి మనల్ని కాపాడతాయి. అంతే కాదు రోగనిరోధక శక్తి పెంపొందెలా సహాయపడతాయి. మహిళలు వీటిని తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయటపడొచ్చు. గర్భిణీలకి చాలా మంచిది. పల్లీ పట్టి లేదా బెల్లంతో తయారు చేసిన పల్లీ ఉండలు ఎలా తిన్నా ఆరోగ్యానికి మంచిది.


అంజీరా, పాలు


ఇవి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. ఆరోగ్యాన్ని అందిస్తాయి. అంజీరా తినడం వల్ల శక్తి వస్తుంది. బరువు తగ్గడాన్ని వేగవంతం చేస్తుంది. జీవక్రియని పెంచుతుంది. అంతే కాదు దీనికున్న ప్రత్యేకమైన విషయం ఏమిటంటే వేసవిలో శరీరం చల్లగా ఉండటానికి శీతాకాలంలో వెచ్చగా ఉండటానికి సహాయపడుతుంది. ప్రతిరోజు రెండు నుంచి మూడు అంజీరా పండు ముక్కలు పాలల్లో మరిగించి తింటూ పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి. పాల వల్ల రోజువారికి కావలసినంత కాల్షియం అందుతుంది.


బెల్లం


ఇందులో పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఐరన్, మినరల్స్ మెండుగా ఉంటయి. ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు దోహదపడతాయి. తరచూ బెల్లం తీసుకోవడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. అయితే బెల్లం ప్రతి రోజు పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. చక్కెరకి ప్రత్యామ్నాయంగా దీన్ని తీసుకోవచ్చు. అతిగా తీసుకోవడం వల్ల నోటి పూత వచ్చే అవకాశం ఉంది. అందుకే మితంగా మాత్రమే తినాలి.


ఉసిరి


విటమిన్ సి పుష్కలంగా ఉండే పదార్థాలలో ఉసిరి ఒకటి. రోగనిరోధక శక్తి పెంచడానికి ఇది చాలా అవసరం. మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగ్గా ఉంచుతుంది. జుట్టు రాలడం, చర్మ సమస్యల్ని నయం చెయ్యడంలో గొప్ప ఔషధంగా పని చేస్తుంది. అందుకే చలికాలంలో ప్రతిరోజు ఒక ఉసిరి కాయ మురబ్బాని తినడం శ్రేయస్కరం అని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.


చ్యవనప్రాష్


చ్యవనప్రాష్ రోజు తినడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు. రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలతో 20-40 ఆయుర్వేద పదార్థాలు, మూలికల మిశ్రమంతో దీన్ని తయారు చేస్తారు. ఇది జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. సీజనల్ వ్యాధులని నివారిస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. భోజనం తర్వాత ఒక టీ స్పూన్ చ్యవనప్రాష్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: టూత్ పేస్ట్ లేకుండా బ్రష్ చెయ్యొచ్చా? నిపుణులు ఏం సూచిస్తున్నారు?