చాలా సేపు ఒకేలా కూర్చుంటే కాళ్లు తిమ్మిరి పట్టేస్తుంది. కాళ్లు కదపలేనంతగా తిమ్మిర్లు వస్తాయి. కాసేపు ఇటూ అటూ కదల్చలేం. ఓ రెండు నిమిషాల తరువాత తిమ్మిరి పోతుంది.  రోజులో ఒకసారో, రెండుసార్లో వస్తే సాధారణమే, కానీ కొందరిలో మాత్రం తరచూ కాళ్లల్లో, చేతుల్లో తిమ్మిర్లు వస్తుంటాయి. ఈ పరిస్థితి చాలా చికాకుగా ఉంటుంది. ఇలా తరచూ వస్తుంటే మాత్రం దాని వెనుక కారణాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వైద్యులు చెప్పిన ప్రకారం కొన్ని రకాలా ఆరోగ్య పరస్థితులు, పోషకాహార లోపం వల్ల తిమ్మిర్లు వస్తుంటాయి. 


ఆ విటమిన్ లోపం వల్ల
శరీరానికి అన్ని విటమిన్లు, ఖనిజాలు అందాల్సిన అవసరం ఉంది. కానీ కొందరిలో బి12 లోపం వస్తుంది. ఆ విటమిన్ లోపించినప్పుడు తిమ్మిర్లు వచ్చే అవకాశం ఉంది. మీకు ఎలాంటి ఆరోగ్య సమస్య లేకుండా తరచూ తిమ్మిర్లు పడుతుంటే మాత్రం ఓ సారి బి12 లోపం ఉందేమో చెక్ చేసుకోవడం మంచిది. లేదా బి12 అధికంగా ఉండే ఆహారాలు అధికంగా తినాలి. ఓట్స్, మటన్ లివర్, చేపలు, రొయ్యలు, చీజ్, పుట్ట గొడుగులు, గుడ్లు, పాలు, సోయా ఉత్పత్తుల్లో బి12 పుష్కలంగా లభిస్తుంది. వాటిని మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. 


డయాబెటిస్ ఉన్నా...
మధుమేహంతో బాధపడుతున్న వారికి కూడా తిమ్మిర్లు అధికంగా పట్టే అవకాశం ఉంది. తరచూ తిమ్మిరి పడుతుంటే మధుమేహం పరీక్ష కూడా చేసుకోవాలి. డయాబెటిస్ అదుపులో ఉంటే తిమ్మిరి వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. 


ఇతర సమస్యలు
కొంతమందికి కొన్ని అనారోగ్య సమస్యలు ఉంటాయి. వాటి వల్ల కూడా తిమ్మిర్లు పడతాయి. థైరాయిడ్ ఉన్న వారికి, కిడ్నీ సమస్యలు, కాల్ఫియం లోపం, గర్భిణిలకు, అధిక బరువు ఉన్న వారికి, నరాల సమస్యలు ఉన్నవారికి కూడా తిమిర్లు తరచూ వస్తుంటాయి. తిమ్మిర్లు రోజూ అసాధారణంగా వస్తుంటే మాత్రం అశ్రద్ధ చేయకండి. అవి వేటి వల్ల వస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇవి కొన్ని అనారోగ్య సమస్యలకు సంకేతాలుగా కూడా పనిచేస్తాయి. తిమ్మిర్లను చాలా తక్కువగా అంచనా వేస్తారు. కానీ అవి ఒక్కోసారి పెద్ద సమస్యకు కారణం కావచ్చు. కాబట్టి అతిగా  తిమ్మిర్లు పడుతుంటే  వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోవడం ఉత్తమం. 



Also read: పచ్చి మాంసాన్ని ఎక్కువ కాలం ఫ్రిజ్‌లో తాజాగా ఉంచాలంటే ఈ చిట్కాలు పాటించండి


Also read: పెళ్లి కాని వ్యక్తులు గుండె వైఫల్యంతో మరణించే ప్రమాదం ఎక్కువ, కొత్త పరిశోధన ఫలితం