మొబైళ్లు మన జీవితాన్ని సులభంగా మార్చేశాయి. ఉన్నచోటే ఉండి ఎక్కడో ఉన్న మనుషులతో పనిచేయించేసుకునే వెసులుబాటును ఇచ్చాయి.పెళ్లి పిలుపుల నుంచి పరామర్శల వరకు అన్నీ సెల్‌ఫోన్లోనే. అలాంటి మొబైల్ ఓ గంట సేపు కనిపించకపోతే ఆ గాభరా మామూలుగా ఉండదు. ఇల్లు తీసి పందిరేసే వాళ్లు ఎంతో మంది. ప్రియమైన వారితో వెంటనే కనెక్ట్ చేసే ఈ సెల్ ఫోన్ ఆరోగ్యానికి ఎంత హాని చేస్తుందో తెలుసా? మొబైళ్ల నుంచి వచ్చే హానికరమైన రేడియేషన్లు రకరకాల ఆరోగ్యస సమస్యలకు కారణం అవుతాయి. దీని వల్ల చాలా ప్రమాదకరమైన ఆరోగ్యసమస్యలు వచ్చే అవకాశం ఉంది. 


ప్రపంచవ్యాప్తంగా అయిదు వందల కోట్ల మంది ప్రజలు ఫోన్లు చేయడానికి, ఇంటర్నెట్ కోసం, వార్తల కోసం, గేమ్స్ ఆడడం కోసం మొబైళ్లను వినియోగిస్తున్నారు. గంటలు గంటలు సెల్ ఫోనును వాడడం ఆరోగ్యానికి హానికరమని ప్రజలు కూడా నమ్ముతున్నారు. కానీ వాడడం మాత్రం తగ్గించరు. 


క్యాన్సర్ తో ముడిపడి ఉందా?
సెల్ ఫోన్ వాడకానికి, క్యాన్సర్‌కు మధ్య సంబంధం ఉన్నట్టు ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. మొబైళ్లు రేడియో ఫ్రీక్వెన్సీ లేదా రేడియో తరంగాలు అని పిలిచే రేడియేషన్‌ను విడుదల చేస్తాయి. ఇవి మైక్రో‌వేవ్ లా మాదిరిగా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని తాకినప్పుడు నేనుగా శరీరాన్ని దెబ్బతీసేంత శక్తిని కలిగి ఉండవు. కానీ మెదడులోని అనేక భాగాలు ఈ రేడియేషన్ ను గ్రహిస్తాయి. చెవులపై మొబైల్ పెట్టి మాట్లాడుతున్నప్పుడు తల, మెడలో కణితులు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే సెల్ ఫోన్లకు, క్యాన్సర్ మధ్య సంబంధాన్ని నిరూపించడానికి చాలా పరిశోధనలు జరిగాయి. కానీ ఏ లింక్‌ను కనిపెట్టలేకపోయారు.  


కొందరిలో మాత్రం...
వివిధ దేశాలలో జరిగిన అధ్యయనాలలో భాగంగా మెదడులో కణితులతో బాధపడుతున్న వ్యక్తులను పరిశోధించారు. వారు సెల్ ఫోన్ వినియోగం, మొబైల్ వాడుతున్న సమయాన్ని లెక్కించారు. వారిలో పరిశోధనలో 10 శాతం మంది వ్యక్తులలో కొన్ని రకాల మెదడు కణితులలో పెరుగుదల కనిపించింది. ఆ కణితులు క్యాన్సర్ కణితులుగా మారుతాయన్న అనుమానం కూడా ఉంది. కాబట్టి సెల్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడే అలవాటును మానుకోవాలి. 


కొన్ని చిట్కాలు
1. ఫోన్లో మాట్లాడే సమయాన్ని పరిమితం చేయండి. ఎక్కువ సేపు మాట్లాడాల్సి వస్తే స్పీకర్ పెట్టుకోండి లేదా హెడ్ ఫోన్స్ తో మాట్లాడండి. 
2. వాయిస్ ఛాట్లు, వీడియో కాల్ లను వినియోగించుకోండి. 
3. రేడియేషన్ తక్కువగా ఇచ్చే ఫోను గురించి తెలుసుకుని కొనుగోలు చేయండి. 


చివరిగా...
మొబైల్ అతి వాడకం వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పే ఆధారాలు ఇంతవరకు శాస్త్రవేత్తలు దొరకలేదు. కానీ అనుమానం మాత్రం ఉంది. ఒక పదేళ్ల తరువాత క్యాన్సర్ వస్తుందని చెప్పే ఆధారాలు దొరకవచ్చేమో. అప్పుడు పశ్చాత్తాపం పడే బదులు ఇప్పటి నుంచే జాగ్రత్తలు పాటిస్తే మంచిది. 


Also read: దీవిలో ఒంటరిగా 29 ఏళ్లు బతికిన వ్యక్తి, ఆ దీవికి గుడ్ బై చెప్పాల్సి వస్తే, వీడియో చూడండి


Also read: ఆ ఆలయం గోడలపై 900 ఏళ్ల నాటి ఆప్టికల్ ఇల్యూషన్ , ఇది వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తుంది