అన్ని రకాల చర్మం, జుట్టు, ఆరోగ్య సమస్యలని నయం చేయగలిగే అత్యంత ప్రసిద్ధ మూలికల్లో ఒకటి కలబంద. ఈ చిన్న మొక్క పెద్ద అద్భుతాలు చేయగలదు. ఎటువంటి చర్మ సమస్యలు అయిన తగ్గించి అందమైన రూపాన్ని ఇవ్వగలదు. దాదాపు 3500 సంవత్సరాల చరిత్ర ఉన్న అలోవెరా ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో తప్పకుండా పెంచుకుంటున్నారు. అలోవెరా జెల్ ముడతలు, మొటిమలని నివారించడం ద్వారా చర్మాన్ని మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది.
చర్మం మీద పేరుకుపోయిన మృతకణాలని తొలగిస్తుంది. దద్దుర్లు, మొటిమలు, గాయాలని నయం చేస్తుంది. వృద్ధాప్య సంకేతాలు కనిపించకుండా చేయడంలో దీని తర్వాత ఏదైన.. చర్మానికే కాదు ఆరోగ్యానికి కూడా మంచిది. జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి పోషకాల శోషణ సహకరిస్తుంది. పోషకాలు అధికంగా ఉండే కలబందలో 20 ఖనిజాలు, 18 అమైనో ఆమ్లాలు, 12 విటమిన్లతో సహ 75 కంటే ఎక్కువ పోషక భాగాలు, 200 ఇంతర కాంపౌండ్స్ ఉన్నాయి.
పొడి చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది
చలికాలంలో చర్మం పొడి బారిపోయి చికాకు పెడుతుంది. ఈ సమస్యకి చక్కని పరిష్కారం కలబంద. శరీరానికి తేమని ఇస్తుంది. అలోవెరా జెల్ రాసుకోవడం వల్ల చర్మం సహజ తేమను పొందుతుంది. మొక్క నుంచి నేరుగా జెల్ తీసుకుని చర్మానికి మాయిశ్చరైజర్ గా రాసుకోవచ్చు.
డార్క్ స్పాట్స్ తొలగింపు
కలబందలో ఆస్ట్రింజెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. మొటిమలు వల్ల ఏర్పడిన మచ్చలు తగ్గించడంలో అత్యంత ప్రభావవంతంగా పని చేస్తుంది.
మెరిసే చర్మం ఇస్తుంది
కలబంద జెల్ ని ఐస్ క్యూబ్స్ మార్చుకోవచ్చు. వాటితో ఫేస్ రబ్ చేయడం వల్ల మృదువైన చర్మం లభిస్తుంది. మొహం మీద పేరుకుపోయిన మురికిని తొలగించి మూసుకుపోయిన రంధ్రాలు తెరుచుకునేలా చేస్తుంది. మచ్చలు లేని చర్మం కోసం వారానికి రెండు సార్లు అలోవెరా ఐస్ క్యూబ్స్ ఉపయోగించుకుని మెరిసే చర్మాన్ని పొందొచ్చు.
మొటిమలు పోగొడుతుంది
అలోవెరాలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమల బారిన పడిన చర్మాన్ని రక్షిస్తుంది. హైపర్ పిగ్మెంటేషన్ సమస్యని కలబంద నయం చేస్తుంది. కలబందలో గ్లిసరిన్, సోడియం పామ్ కెమేలేట్, సార్బిటోల్, సోడియం పామాల్, సోడియం కార్బోనేట్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. అవి మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరిచి కాంతివంతంగా ఉంచేందుకు సహాయపడతాయి.
కలబంద ఆకుల మధ్యలోంచి జిగటగా ఉండే గుజ్జును తీసి మొటిమలపై రాయాలి. ఇలా రోజు రాత్రి పడుకోబోయే ముందు చేయాలి. అలాగే నిద్రపోయి మరుసటి రోజు ఉదయం గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా కొన్ని రోజుల పాటూ చేస్తుంటే మొటిమలు తగ్గుతాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also read: అబ్బాయిలూ, కాలుష్యం నుంచి మీ చర్మాన్ని ఇలా సంరక్షించుకోండి