అమెరికాలో పసిపిల్లలు బేబీ ఫార్ములా మిల్క్ పైనే ఆధారపడతారు. కానీ ఫిబ్రవరిలో బేబీ ఫార్మూలా తయారు చేసి అతి పెద్ద సంస్థ మూతపడడంతో పసిపిల్లలకు కష్టం వచ్చిపడింది. దాదాపు 40శాతం పాల పొడి ఉత్పత్తి ఆగిపోవడంతో ఎంతో పిల్లలు పాలు దొరక్క ఇబ్బంది పడుతున్నారు.ఈ పరిస్థితిని చూసి ఓ తల్లికి మనసు కరిగింది. తన రొమ్ముపాలనే ఫ్రీజర్లో దాచి పాలు కావాల్సిన పిల్లల కోసం అమ్మడం మొదలుపెట్టింది. అది కూడా చాలా తక్కువ ధరకి.
ఆమె పేరు అలెస్సా చిట్టి. ఆమెకు చంటి బిడ్డకు తల్లి. అందరిలా కాకుండా ఆమెకు రొమ్ము పాలు అధికంగా ఉత్పత్తి అవుతున్నాయి. అమెరికాలోని కరువును చూసి ఆమె రొమ్ముపాలను నిల్వ ఉంచడం మొదలుపెట్టింది. అలా ప్రస్తుతం 118 లీటర్లు ఫ్రీజర్లో నిల్వ ఉంచింది.ఒక ఔన్సు డాలర్ కు అమ్మడం మొదలుపెట్టింది. ఒక లీటర్ అంటే 33 ఔన్సులు. అంటే ఒక లీటర్ పాలు 33 డాలర్లకు అమ్ముతోందన్నమాట. పేద తల్లిదండ్రులు రిక్వెస్ట్ చేస్తే అంతకన్నా తక్కువ ధరకే అందిస్తోంది.
‘ఒక తల్లిగా నాకు ఇతర అమ్మల బాధ అర్థమవుతోంది. అందరికీ రొమ్ము పాలు అధికంగా పడవు. కానీ నాకు మాత్రం పడుతున్నాయి. అందుకే నాకు ఈ ఆలోచన వచ్చింది. నేను ఉచితంగా కూడా ఇద్దామనుకున్నాను. కానీ కొన్ని న్యాయపరమైన చిక్కులు వస్తున్నాయి. అందుకే అమ్మడం మొదలుపెట్టాను’ అని చెప్పుకొచ్చింది అలెస్సా. ఇప్పుడు కూడా ఆ పాలను టెస్ట్ చేశాక అమ్మాలన్న నిబంధన ఉంది అమెరికాలో. లేకపోతే రొమ్ము పాలను ఇచ్చిన తల్లికుండే కొన్ని రకాల వైరస్ లు పిల్లలకు వెళ్తాయనే వాదన ఉంది. ప్రస్తుతం అలెస్సా ఆ సమస్యను ఎదుర్కుంటోంది. పోనీ ఆ పాలను త్వరగా టెస్టులు చేసి పిల్లలు అందిస్తారా అంటే అదీ లేదు. చాలా సమయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం కొంత మంది తల్లులు అలెస్సా దగ్గర పాలు కొని తమ బిడ్డ పొట్ట నింపుతున్నారు. ,
Also read: కొవ్వును కరిగించే లైపోసక్షన్ ఆపరేషన్ ఎలా చేస్తారు? అది ప్రాణాలు తీసేంత ప్రమాదకరంగా ఎందుకు మారుతోంది?