సుపు పాలు ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జలుబు, దగ్గు అనిపించినప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో దీన్ని తప్పనిసరిగా తాగుతారు. అందుకే పసుపు పాలని గోల్డెన్ మిల్క్ అని కూడా పిలుస్తారు. మంచి సువాసన కలిగిన పసుపు మంచి యాంటీ బ్యాక్టీరియల్ గా పని చేస్తుంది. బరువు తగ్గడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. దీనితో పాటు దాల్చిన చెక్క, లవంగం, యాలకులు, నల్ల మిరియాలు, అల్లం వంటి ఇతర సుగంధ ద్రవ్యాలు వేసుకుని కూడా తాగుతారు. ఇవే కాదు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మరికొన్ని పదార్థాలు కూడా జోడించుకోవచ్చు.


బాదంపప్పు


ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల ఎముకల ధృడంగా ఉండేందుకు నట్స్ తో చేసిన పొడి కలిపి తాగిస్తారు. అది ఆరోగ్యానికి చాలా మంచిది. బాదం పప్పు పొడి చేసుకుని గోల్డెన్ మిల్క్ లో కలుపుకుని తాగడం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారు. ఇందులో రిబోఫ్లవిన, ఎల్ కార్నిటైన్ పుష్కలంగా ఉంటుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బాదం కలపడం వల్ల విటమిన్ డి, కాల్షియం ఎముకల ఆరోగ్యాన్ని బలపరుస్తుంది.


అంజీరా


అంజీర్ లేదా అంజూరా పండ్లలో కాల్షియం, డైటరీ ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఎండిన అంజీరా రోజు రాత్రిపూట నానబెట్టుకుని తింటారు. ఎముకల ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా పేగులని ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని మాలోపేతం చేస్తుంది. గోల్డెన్ మిల్క్ లో అంజీరా కలుపుకుని తాగడం వల్ల అందులోని ట్రిప్టోఫాన్, మెలటోనిన్ సమ్మేళనాలు నిద్రని ప్రేరేపిస్తాయి. సెరోటోనిన్ అనే న్యూరోట్రాన్స్మిటర్ ఉత్పత్తిలో ట్రిప్టోఫాన్ ముఖ్య భూమిక పోషిస్తుంది.


ఖర్జూరాలు


డ్రై ఫ్రూట్స్ లో ఉత్తమమైనది ఖర్జూరం. వీటిని తరచూ పిల్లలకి పెట్టడం వల్ల వాళ్ళ ఏకాగ్రత స్థాయిలు పెరుగుతాయి. పేగు కదలికలని మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్యని నివారిస్తుంది. దీన్ని గోల్డెన్ మిల్క్ లో కలుపుకుని తాగడం వల్ల మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు శరీరానికి అందుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలని మెరుగు పరచడంలో సహాయపడుతుంది. హిమోగ్లోబిన్ స్థాయిని పెంచేందుకు అత్యుత్తమ పదార్థం. గర్భిణీలు తప్పనిసరిగా ఎండు ఖర్జూరాలు తినమని చెప్తుంటారు. రక్తం పడుతుందని, శరీరానికి కావాల్సిన ముఖ్యమైన విటమిన్లని అందిస్తుంది. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొండటంలో సహాయపడుతుంది.


గోల్డెన్ మిల్క్ వల్ల ప్రయోజనాలు


ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పసుపులోని కర్కుమిన్ శరీరానికి అనేక ప్రయోజనాలు అందిస్తుంది. చర్మ సంరక్షణకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎముకల్ని బలంగా ఉంచుతుంది. శీతాకాలంలో పసుపు పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ విజృంభిస్తున్న వేళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు రోజూ గోల్డెన్ మిల్క్ తాగడం మంచిది. ఇన్ఫెక్షన్స్ కి వ్యతిరేకంగా పోరాడుతుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: హైపోథైరాయిడిజంతో బాధపడుతున్నారా? ఈ ఆహార పదార్థాలు తినాల్సిందే