Viral: తన కలలను కంట్రోల్ చేద్దామని, తన పుర్రెకు తానే రంధ్రం పెట్టుకున్న సైంటిస్ట్

వెర్రి వేయి విధాలు అంటే ఇదేనేమో. ఏకంగా పుర్రెకే చిల్లు పెట్టేసుకున్నాడుప

Continues below advertisement

కలలు ఎందుకు వస్తాయి? అనే దాని గురించి ఎప్పటినుంచో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. న్యూరో సైన్స్ గణనీయమైన పురోగతిని సాధించినప్పటికీ... ఇప్పటికీ మనుషులు ఎందుకు? ఎలా కలలు కంటున్నారు అనే దాని గురించి శాస్త్రవేత్తలకు పెద్దగా అవగాహన లేదు. వాటిపైనే పరిశోధనలు చేస్తున్న ఓ శాస్త్రవేత్త మిఖాయిల్ రాదుగా. ఇతను రష్యాకు చెందిన సైంటిస్ట్. ఎప్పుడూ పరిశోధనలోనే మునిగితేలుతూ ఉంటాడు. అలాంటి వ్యక్తి తన పైన తానే ప్రయోగం చేసుకున్నాడు. దానికి తగిన మూల్యాన్ని చెల్లించాడు. ఇంట్లోనే తన పుర్రెకు తానే చిల్లు పెట్టుకొని... లోపల ఒక చిప్‌ను పంపించాలనుకున్నాడు. కానీ అది విఫలం చెంది ఆసుపత్రి పాలయ్యాడు.

Continues below advertisement

మిఖాయిల్ రాదుగా తన మెదడులో ‘డ్రీమ్ కంట్రోలింగ్ చిప్’  ప్రవేశపెట్టడం ద్వారా తన స్పష్టమైన కలలను నియంత్రించాలనుకున్నాడు. ఈ ప్రయోగం వేరే వారి మీద చేస్తే.. వారికి ఏదైనా జరిగే అవకాశం ఉంది. అందుకే తన కలలను తానే నియంత్రించడానికి తన మెదడులోనే చిప్‌నే పెట్టుకోవాలని అనుకున్నాడు. తన అపార్ట్మెంట్లోనే స్వయంగా శస్త్ర చికిత్స చేశాడు. నాలుగు గంటల పాటు కష్టపడ్డాడు. దీనికి కొంతమంది సాయాన్ని కూడా తీసుకున్నాడు. అతని పుర్రెను డ్రిల్ చేసి రంధ్రం పెట్టి దానిలో చిప్‌ను పంపించి తిరిగి పుర్రెను తిరిగి మూసేయాలి అన్నది ఆయన ఉద్దేశం. కానీ ఈ ప్రక్రియలో ఆ సైంటిస్ట్ తీవ్రంగా గాయపడ్డాడు. నాలుగు గంటల శస్త్ర చికిత్స తర్వాత ఒక లీటర్ రక్తాన్ని కోల్పోయాడు. దీంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది.

 వైద్యులు అతి కష్టం మీద ఆయన ప్రాణాన్ని కాపాడగలిగారు. ఇలాంటి వెర్రి పనులు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కోలుకున్న తర్వాత మిఖాయిల్ తన ట్విట్టర్ ఖాతాలో దీని గురించి పోస్ట్ పెట్టాడు. అతను శరీరానికి వెలుపల జరిగే అనుభవాలు, జ్యోతిష్య అంచనాలు, స్పష్టమైన కలలు వంటి వాటిని చేధించే ‘డిసోసియేటివ్ స్టేట్ ఆఫ్ మైండ్’ గురించి పరిశోధనలు చేస్తున్నట్టు చెప్పాడు. నిపుణుల సమక్షంలో ఈ డ్రిల్లింగ్ పనిచేస్తే సమస్య పెరుగుతుందని, స్వయంగా తానే నిర్వహించాలని అనుకున్నట్టు చెప్పాడు. అయితే ఈయన చేసినది విఫలం చెందినప్పటికీ... డ్రీమ్ కంట్రోల్ టెక్నాలజీలో భవిష్యత్తులో ఫలితాలు మార్గాన్ని సుగమం చేస్తాయని తాను ఆశాభావంతో ఉన్నట్టు చెప్పాడు. ఇలాంటి వెర్రి పనులు మాత్రం ఎవరూ చేయకూడదని సూచించాడు. ఇలా చేయడం వల్ల సృహ కోల్పోయి శరీరంలోని రక్తం అంతా కోల్పోతే ప్రాణానికే ప్రమాదం రావచ్చు. అదృష్టం కొద్దీ మిఖాయిల్ బతికి బట్ట కట్టాడు. లేకపోతే ఈపాటికి అతని పరిస్థితి వేరేలా ఉండేది.

" data-captioned data-default-framing width="400" height="400" layout="responsive">

Also read: గుండె ఆరోగ్యానికి పిండి, ఈ ఐదు రకాల పిండిని ప్రయత్నించండి

Also read: నెలపాటు మాంసాహారం మానేస్తే మీ శరీరంలో వచ్చే మార్పులు ఇవే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Continues below advertisement
Sponsored Links by Taboola