New Study on Ice Cream : చిన్నపిల్లల నుంచి.. పెద్దలవరకు ఇష్టంగా తినే వాటిలో ఐస్​క్రీమ్​ కచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా సమ్మర్​లో ఐస్​క్రీమ్​లకు చాలా డిమాండ్ ఉంటుంది. వేడి నుంచి ఉపశమనం ఇస్తూ.. మనుసును రిఫ్రెష్ చేస్తుంది. అయితే ఈ టేస్టీ ఫుడ్​ హెల్త్​కి మంచిది కాదని చాలా మంది దానికి దూరంగా ఉంటారు. ఇది పూర్తిగా చక్కెర, సంతృప్త కొవ్వు పదార్థాలు కలిగి ఉంటుందని మానేస్తారు. కానీ ఐస్​ క్రీమ్ మనం అనుకున్నంత చెడు అయితే కాదని తాజా అధ్యయనం తెలిపింది. 


రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది..


సమతుల్యం ఆహారం జాబితాలో రోజూ ఓ స్కూప్ తీసుకోవడం వ్లల ప్రతికూల ప్రభావం ఉండదని తెలిపింది. అంతేకాకుండా దీనివల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఈ స్టడీ తేల్చింది. ఐస్​క్రీమ్​ కాల్షియం, మెగ్నీషియం, బి12 విటమిన్లు, రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేసే ప్రోటీన్​ను కలిగి ఉంటుందని తెలిపింది. పాలు, క్రీమ్​ అనేవి ఐస్​క్రీమ్​లో ప్రధానంగా వినియోగిస్తారు. విటమిన్ ఎ, కోలిన్​ను కలిగి ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడంతో పాటు.. రోగనిరోధక శక్తి, మెదడు అభివృద్ధికి తోడ్పడుతున్నాయి వెల్లడించింది. 


బరువు తగ్గే అవకాశం.. 


ఐస్​క్రీమ్​లు న్యూట్రీషియన్ రిచ్​ ఫుడ్​గా చెప్తున్నారు. దీనిలో న్యూట్రిషియన్లు, కాల్షియం, ప్రోటీన్​, విటమిన్స్ ఉంటాయని ఇవి పూర్తి ఆరోగ్యానికి మంచివని చెప్తున్నారు. మానసికంగా దీనివల్ల ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు. ఇది ఒత్తిడిని తగ్గించి మూడ్​ని లిఫ్ట్ చేస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుందని చెప్తున్నారు. సమ్మర్​లో ఇవి శరీరానికి హైడ్రేషన్​ని అందిస్తాయట. ఐస్​క్రీమ్​ క్రేవింగ్స్​ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇతర ఫుడ్స్ జోలికి వెళ్లరు. దీనివల్ల బరువు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. బోన్స్​ను హెల్తీగా మార్చడంలో కాల్షియం పనిచేస్తుంది. స్కిన్​ హైడ్రేషన్, జీర్ణక్రియలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది. 


డెయిరీ ఉత్పత్తులతో ప్రాబ్లమ్ లేదు


తాజా పరిశోధనలో పాలు డెయిరీ హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచవని తెలిపింది. అయినప్పటికీ.. పాలు, చీజ్, పెరుగు, ఐస్​క్రీమ్ వంటి ఆరోగ్యకరమన ఎంపికల మధ్య తేడాను గుర్తించాలని చెప్తున్నారు. నాన్​ డెయిరీ ఉత్పత్తులు ఆరోగ్యకరమైనవి కాదు. ఈ ఉత్పత్తుల్లో చక్కెర ఎక్కువగా ఉంటుందని తెలిపారు. పెద్ద మొత్తంలో చక్కెర, ఫ్యాట్, కృత్రిమ స్వీటెనర్​లు, గట్టిపడే పదార్థాలు వాటిలో వినియోగిస్తారని తెలిపారు.


పరిమిత మోతాదులో తీసుకోవాలట


ఎండ్​ ఆఫ్​ ద డే ఐస్​క్రీమ్​లు ఆరోగ్యానికి ఎంత మంచివే అయినా.. వాటిని కంట్రోల్​గా తీసుకోవడం మంచిది అంటున్నారు. డైటీషియన్లు రోజుకు గరిష్ఠంగా అరకప్పు తీసుకోవచ్చని చెప్తున్నారు. ఐస్​ క్రీమ్​ను మితంగా తీసుకుంటే.. ఆహారంలో భాగం చేసుకోవచ్చని.. కానీ తీసుకునే క్వాంటింటీపై కచ్చితంగా శ్రద్ధ చూపించాలంటున్నారు. 


Also Read : హాట్ సమ్మర్​లో మట్టి కుండలోని నీరు తాగుతున్నారా? అయితే మీరు వీటి​ గురించి తెలుసుకోవాల్సిందే









గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మానసిక, శారీరక ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.