Ginger Health Benefits: ఈ బిజీ లైఫ్‌లో జనాలు శారీరక సుఖానికి కూడా నోచుకోవడం లేదు. జీవితం మరీ యాంత్రికంగా మారిపోతోంది. ఒక వేళ ఆ సుఖం కోసం ప్రయత్నించినా.. ఛాంపియన్స్ కాలేకపోతున్నారు. కోరికలు చచ్చిపోవడం వల్ల.. జీవితం చప్పగా సాగిపోతుంది. మీ లైఫ్ కూడా ఇలాగే ఉన్నట్లయితే.. ‘మసాలా’ యాడ్ చెయ్యండి. ఔనండి, నిజం. మసాలాలో ఉపయోగించే అల్లం మీ సంసార జీవితాన్ని రుచిమయం చేస్తుంది. ఓ పరిశోధన సంస్థ తాజాగా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? చదివేయండి మరి.
సాధారణం.. మునక కాడలు పురుషులకు వయాగ్రాలా పనిచేస్తాయని అంటుంటారు. ఈ విషయంలో అల్లం కూడా ఏమీ తీసిపోదని తేలింది. అంతేకాదు.. ఇది స్త్రీ, పురుషులు ఇద్దరికీ ఎంతో మేలు చేస్తుందని పరిశోధకులు అంటున్నారు. ది జర్నల్ ఆఫ్ సె* రీసెర్చ్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం.. తక్కువ కోరికలు, ఉద్రేకం వంటి సమస్యలను ఎదుర్కొనే జంటలు ఎక్కువగా నిరాశ, ఆందోళనలతో జీవితం సాగిస్తారని అధ్యయనం పేర్కొంది. ముఖ్యంగా పురుషుల్లో ఆ సామర్థ్యం లేకపోతే సంసారం కల్లోలంగా మారుతుందని, పార్టనర్స్ మధ్య విభేదాలు నెలకొంటాయని వెల్లడించింది. ఆ సమస్యలకు అల్లం ఒక మంచి ఔషదం అని తెలిపింది.
ఆగ్నేయ ఆసియాలో ఎక్కువగా పెరిగే అల్లంను మసాలాలు, మూలికా ఔషదాల్లో ఉపయోగిస్తారు. భూగర్భంలో పెరిగే అల్లం ఘాటైన వాసన, రుచి కలిగి ఉంటుంది. మనలో చాలామంది అల్లాన్ని పచ్చిగానే వాడేస్తాం. అయితే, మన పూర్వికులు దీన్ని బాగా ఎండబెడ్డి, పొడి చేసి సొంఠిగా వాడేవారు. అంతేకాదు, ఆ అల్లాన్ని రసం లేదా నూనెలా మార్చి వైద్యానికి వాడేవారు. జీర్ణ సమస్యలతో బాధపడేవారికి ఇది మంచి ఔషదం. తాజా అధ్యయనంలో అల్లా లైంగిక పనితీరును కూడా మెరుగుపరుస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది.
వాస్తవానికి అల్లం.. ప్రేరేపణ కలిగించడంలోనే కాదు, మనసులో ఉండే ఆందోళనను తొలగిస్తుంది. 2023లో జర్నల్ సె*లో ప్రచురించిన వివరాల ప్రకారం.. క్రెడామో అనే ఆన్‌లైన్ ప్రొఫెషనల్ సర్వే వెబ్ సైట్.. 499 చైనీయులు (250 మంది పురుసులు, 249 మంది మహిళలు)పై ప్రయోగాలు చేశారు. వీరిలో కొందరికి అల్లం ఎక్కువగా ఉండే ఆహారాలను తినిపించారు. మిగతావారికి తక్కువ అల్లాన్ని ఆహారంగా అందించారు. చివరిగా అల్లం ఎక్కువగా తిన్నవారిలో ఆ కోరికలతోపాటు.. పనితీరు కూడా మెరుగ్గా ఉన్నట్లు గుర్తించారు. కోరికలను చంపేయకుండా సజీవంగా ఉంచుతున్నాయని తెలిపారు.
అల్లం ఎక్కువగా తీసుకున్నవారు తమ భాగస్వామితో కలవడం లేదా స్వయంగా తృప్తిని పొందుతూ ఆనందాన్ని పొందుతున్నారని తెలుసుకున్నారు. అల్లం స్త్రీ, పురుషులకు ఉద్దీపనలా పనిచేస్తున్నట్లు తెలుసుకున్నారు. వారి రహస్య భాగాల నుంచి ఉత్పన్నమయ్యే శ్రావాలను అసహ్యించుకొనే పరిస్థితుల నుంచి గట్టెక్కిస్తున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. చూశారుగా అల్లం పనితనం. ఇకపై మీరు కూడా ప్రయత్నించండి. మీరు ఏం చేసినా డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. మేం కేవలం అధ్యయనంలో తేలిన విషయాలపై మాత్రమే మీకు అవగాహన కల్పిస్తున్నాం అని గుర్తుంచుకోండి.
Also Read: పెట్రోల్‌ను కూల్‌డ్రింక్‌లా తాగేస్తున్న యువతి - దాని టేస్ట్ అలా ఉంటుందట!