విశాఖపట్నంలోని జిల్లా గ్రంథాలయ సంస్థ ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన లైబ్రేరియన్, రికార్డ్ అసిస్టెంట్, లైబ్రరీ హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం12 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి 8వ తరగతి, 10వ తరగతి, ఏదైనా డిగ్రీ, సీఎన్‌ఐఎస్సీ, కంప్యూటర్ నాలెడ్జ్ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అబ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా జులై 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 12
⏩ గ్రేడ్-3 లైబ్రేరియన్: 07
⏩ రికార్డ్ అసిస్టెంట్: 01
⏩ లైబ్రరీ హెల్పర్: 04
అర్హత: పోస్టును అనుసరించి 8వ తరగతి, 10వ తరగతి, ఏదైనా డిగ్రీ, సీఎన్‌ఐఎస్సీ, కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి
వయోపరిమితి: 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
చిరునామా: Secretary, District Library Corporation,
Laxmi Gayatri Apartment, Door.No. 48-7-49,
Ftat no. 11, 3rd Floor, Rama Talkies,
Veg Market Line, Visakhapatnam- 530016.
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15.07.2023.
Notification
ALSO READ:
'టెన్త్' అర్హతతో 1558 ఉద్యోగాలు, మల్టీటాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది!
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూన్ 30న విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా కేంద్రప్రభుత్వ విభాగాల్లో 1558 మల్టీ టాస్కింగ్(నాన్ టెక్నికల్), హవిల్దార్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పదోతరగతి లేదా తత్సమాన అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి జూన్ 30 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు జులై 21లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో 4062 ఉద్యోగాలు, వివరాలు ఇలా!
భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఎడ్యుకేషన్ సోసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్(ఎన్‌ఈఎస్‌టీఎస్) దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో (ఈఎంఆర్ఎస్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 4062 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జులై 31లోగా ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. జాతీయస్థాయి రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
డిగ్రీ కాలేజీల్లో 2,858 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు, వివరాలు ఇలా!
తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఖాళీల భర్తీకి జులై 6న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 2,858 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్నారు. వీటిలో కాంట్రాక్ట్ పద్ధతిలో 527 మంది లెక్చరర్ పోస్టులను, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 341 పోస్టులను, హోనరేరియం కింద 50 టీఎస్‌కేసీ ఫుల్ టైమ్ మెంటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అదేవిధంగా 1,940 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులను కూడా భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఈ పోస్టుల కాలపరిమితి వచ్చే ఏడాది మార్చి 31తో ముగియనుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial