SSC Constable GD Result 2025::  భారతదేశంలో ఏటా అనేక ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) వేస్తూ ఉంటుంది. ఈ ఏడాది కూడా జనరల్ డ్యూటీ (GD) కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ వేసింది. అన్ని ప్రక్రియలు పూర్తి చేసుకొని ఫైనల్ రిజల్ట్స్‌ను విడుదల చేసింది. ఈ ఫలితాలు సీఎస్సీ అధికారిక వెబ్సైట్ ssc.gov.in లేదా ssc.nic.inలో అప్‌లోడ్ చేసింది. ఈ పోస్టులకు ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు తమ స్కోర్ కార్డులు, మెరిట్ లిస్టు, కట్-ఆఫ్ మార్కులు వెబ్‌సైట్‌లో ఉంచారు.  

ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ 2025: ముఖ్య వివరాలుమొత్తం 53,690 ఉద్యోగాలు భర్తీ చేయాలని 2025లో SSC జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వేసింది. వివిధ కేంద్ర భద్రతా బలగాల్లో ఉన్న ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేయనుంది. ప్రధానంగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), సశస్త్ర సీమా బల్ (SSB), ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మన్ (జనరల్ డ్యూటీ), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (SSF), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB)లో సైనికుల ఉద్యోగాల ఎంపిక చేపట్టింది.  

ఈ ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి:ఈ నోటిఫికేషన్ ద్వారా CISFలో 16,571 పోస్టులు భర్తీ చేయనున్నారు. BSFలో 16,371 పోస్టులు, CRPFలో 14,359 పోస్టులు, ITBPలో 3,468 పోస్టులు, AR (Assam Rifles) విభాగంలో 1,865 పోస్టులు, SSBలో 902 పోస్టులు ఫిల్ చేయాలని నోటిఫికేషన్ జారీ చేశారు. 

ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ 2025: ఎంపిక ప్రక్రియ SSC జీడీ కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియలో ఐదు దశల్లో జరిగింది.  కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ (CBE): ఈ పరీక్ష 2025 ఫిబ్రవరి 4 నుంచి 25 వరకు జరిగింది. ఇంగ్లీషు, హిందీతో పాటు 13 ప్రాంతీయ భాషల్లో ఈ పరీక్ష నిర్వహించారు.

ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST): ఎత్తు, బరువు, ఛాతీ పరిమాణం వంటి శారీరక ప్రమాణాలను ఈ పరీక్షల్లో పరిశీలించారు. ఇందులో ఎంపికైన వారిటి తర్వాత దశ పరీక్ష చేపట్టారు. 

ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PET): రన్నింగ్, లాంగ్ జంప్‌, హై జంప్ లాంటి వంటి శారీరక పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో అన్ని పక్కాగా ఉన్న వాళ్లకు చివరగా మెడికల్ పరీక్ష నిర్వహించారు. 

డాక్యుమెంట్ వెరిఫికేషన్: మెడికల్‌లో కూడా సెలెక్ట్ అయిన వారి సర్టిఫికెట్స్‌ను వెరిఫై చేశారు. అవసరమైన పత్రాలతో వచ్చిన అభ్యర్థులను మాత్రమే తుది జాబితాలో చేటు కల్పించారు. 

ఫైనల్ మెరిట్ లిస్టును రాష్ట్రం, ప్రాంతం, కేటగిరీ ఆధారంగా తయారు చేశారు. ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు తమ స్కోర్ కార్డులు SSC అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. 

ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ 2025: ఫలితాలను ఎలా చూడాలి?అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ (ssc.gov.in లేదా ssc.nic.in)కి వెళ్లాలి.యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి. అక్కడ ఎస్సీసీ జీడీ ఫలితాలు, స్కోర్ కార్డు, మెరిట్ లిస్టు కనిపిస్తుంది. ఆ లింక్‌పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. 

ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ 2025: జీతం, ప్రయోజనాలు ఎలా ఉంటాయి?ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ 2025 ఫలితాలు ఎంపికైన వారికి వివిధ విభాగాల్లో వివిధ శాలరీలు ఉంటాయి. వారు ఎంచుకున్న డిపార్టమెంట్ ఆధారంగా శాలరీలను నిర్ణయిస్తారు. NCBలో సిపాయి జీతం రూ. 18,000 నుంచి రూ. 56,900 వరకు ఉంటుంది. ఇతర పోస్టులు అంటే BSF, CISF, CRPF, ITBP, SSB, AR, SSFలో అయితే పే లెవల్ 3 జీతం రూ. 21,700 నుంచి రూ. 69,100 వరకు ఇస్తారు. వీటితోపాటు ఇంతర ప్రయోజనాలు ఉంటాయి. పెన్షన్, మెడికల్ బెనెఫిట్స్, క్వార్టర్లు, ఇతర సౌకర్యాలు కల్పిస్తారు.