WDCW Recruitment: నంద్యాలలోని జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన నంద్యాల జిల్లాలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, కేస్ వర్కర్, పారా లీగల్ పర్సనల్, పారా మెడికల్ పర్సనల్, సైకో- సోషల్ కౌన్సెలర్, ఆఫీస్ అసిస్టెంట్, ఎంటీఎస్(కుక్), సెక్యూరిటీ గార్డ్/ నైట్ గార్డ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 13 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి హైస్కూల్‌, డిగ్రీ, పీజీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిబ్రవరి 12 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 


వివరాలు..


ఖాళీల సంఖ్య: 13


➥ సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్: 01 పోస్టు
అర్హత: లా/సోషల్ వర్క్/సోషియాలజి/సోషల్ సైన్స్/సైకాలజిలో మాస్టర్స్‌ కలిగి ఉండాలి.
అనుభవం: కనీసం1 సంవత్సరం కౌన్సిలింగ్ అనుభవం, ప్రభుత్వ ప్రాజెక్ట్/ప్రొగ్రామ్‌లో అడ్మినిస్ట్రేటివ్ గా మహిళలకు సంబంధించి సంబంధిత డొమైన్‌లలో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 25 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
వేతనం: రూ.34,000.


➥ కేస్ వర్కర్: 02 పోస్టులు 
అర్హత: లా/సోషల్ వర్క్/సోషియాలజి/సోషల్ సైన్స్/సైకాలజిలో మాస్టర్స్‌ కలిగి ఉండాలి.
అనుభవం: ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర ప్రాజెక్ట్/ప్రొగ్రామ్‌లో మహిళలకు సంబంధించి సంబంధిత డొమైన్‌లలో 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 25 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
వేతనం: రూ.19,500.


➥ పారా లీగల్ పర్సనల్: 01  
అర్హత: ఎల్‌ఎల్‌బీ.
అనుభవం: లీగల్ అడ్వైజర్లుగా కనీసం 3 సంవత్సరాల అనుభవం, జిల్లా స్థాయిలో ప్రభుత్వ మహిళా సంబంధిత ప్రాజెక్ట్/ప్రొగ్రామ్‌ లేదా ఏదైనా న్యాయస్థానంలో వ్యాజ్యం చేసిన, కనీసం 2 సంవత్సరాలు న్యాయవాదిగా ప్రాక్టీస్  కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 25 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
వేతనం: రూ.20,000.


➥ పారా మెడికల్ పర్సనల్: 01 
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ/డిప్లోమా కలిగి ఉండాలి. 
అనుభవం: సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల పని అనుభవం, జిల్లా స్థాయిలో ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర ప్రాజెక్ట్/ప్రొగ్రామ్‌లో పాల్గొనవచ్చు.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 25 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
వేతనం: రూ.19,000.


➥ సైకో- సోషల్ కౌన్సెలర్: 01 పోస్టు
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ/డిప్లోమా(సైకాలజీ, సైకియాట్రీ, న్యూరోసైన్స్) కలిగి ఉండాలి.
అనుభవం: ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర ప్రాజెక్ట్/ప్రొగ్రామ్‌లో కనీసం 3 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 25 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
వేతనం: రూ.20,000.


➥ ఆఫీస్ అసిస్టెంట్: 01 పోస్టు 
అర్హత: గ్రాడ్యుయేట్, డిప్లొమా(కంప్యూటర్/ఐటీ) కలిగి ఉండాలి. 
అనుభవం: డేటామేనేజ్‌మెంట్, ప్రాసెస్ డాక్యుమెంటేషన్ అండ్ వెబ్ ఆధారిత రిపోర్టింగ్ ఫార్మాట్‌లు, రాష్ట్ర లేదా జిల్లా స్థాయిలో కాన్ఫరెన్సింగ్‌లలో కనీసం 3 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి. ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర/ ఐటీ ఆధారిత సంస్థలలో అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 25 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
వేతనం: రూ.19,000.


➥ ఎంటీఎస్(కుక్): 03 పోస్టులు 
అర్హత: అక్షరాస్యులై ఉండాలి. హైస్కూల్ ఉత్తీర్ణత లేదా తత్సమానం కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
అనుభవం: సంబంధిత డొమైన్‌లలో జ్నానం లేదా పనిచేసిన అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 25 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
వేతనం: రూ.13,000.


➥ సెక్యూరిటీ గార్డ్/ నైట్ గార్డ్: 03 పోస్టులు 
అర్హత: అతను/ఆమె రిటైర్డ్ మిలిటరీ/పారా మిలిటరీ స్టాఫ్ అయి ఉండాలి.
అనుభవం: రాష్ట్ర లేదా జిల్లా స్థాయిలో సెక్యూరిటీ స్టాఫ్‌గా కనీసం 2 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి. 
వయోపరిమితి: 01.07.2023 నాటికి 25 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
వేతనం: రూ.15,000.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. 


దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: The District Women Child Welfare & Empowerment Officer, Nandyal District.


ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12.02.2024.


Notification


Application form


Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..