శ్రీకాకుళం జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ వర్కర్, మినీ అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ హెల్పర్ ఖాళీల భర్తీకి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 123 పోస్టులను భర్తీ చేయనున్నారు. 7వ తరగతి, 10వ తరగతి ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల భర్తీకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. మే 25తో దరఖాస్తు గడువు ముగియనుంది. రూల్ ఆఫ్ రిజెర్వేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 123
1. అంగన్‌వాడీ వర్కర్
2. అంగన్వాడీ హెల్పర్
3. మినీ అంగన్వాడీ వర్కర్
ఐసీడీఎస్ ప్రాజెక్టు పేరు: గార, ఇచ్చాపురం, కాశీబుగ్గ, కొత్తూరు, మందస, నరసన్నపేట, బూర్జ, రణస్థలం, ఎస్.ఎమ్.పురం, టెక్కలి, కోటబొమ్మాళి, సారవకోట, ఆమదాలవలస.
అర్హత: 7వ తరగతి, 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 21 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
చిరునామా: ఆఫ్‌లైన్ దరఖాస్తులను సంబంధిత శ్రీకాకుళం జిల్లాలోని సీడీపీవో కార్యాలయం చిరునామాకు పంపాలి.
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 25.05.2023.
ఎంపిక విధానం: రూల్ ఆఫ్ రిజెర్వేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
Also Read:
టౌన్‌ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షల తేదీలు ఖరారు - ఎగ్జామ్స్ ఎప్పుడంటే?
తెలంగాణలో ప్రశ్నపత్రాల లీకేజీతో వాయిదాపడిన టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల రాతపరీక్ష తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) మే 19న ప్రకటించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 8న టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష; జులై 13, 14 తేదీల్లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు వారం రోజుల ముందు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు కమిషన్ పేర్కొంది.
పరీక్షల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఇండియన్ నేవీలో 227 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ ఉద్యోగాలు- అర్హతలివే!
ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్ఏ)లో 2024 జనవరి నుంచి ప్రారంభమయ్యే షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఇండియన్ నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 227 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక/ వైద్య ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టులకు అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
APPSC: 'గ్రూప్-1' మెయిన్స్ పరీక్షల షెడ్యూలు ఖరారు, ఎప్పుడంటే?
ఏపీలో వివిధ రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో గ్రూప్-1 సర్వీసు(నోటిఫికేషన్ నెం. 28/2022) ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఖరారుచేసింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను జూన్ 3 నుంచి 10 వరకు నిర్వహించనున్నట్లు మే 19న ఒక ప్రకటనలో తెలిపింది. ఆయా తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలోని పాతజిల్లాల ప్రధాన కేంద్రాల్లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు మే 24 నుంచి అందుబాటులోకి రానున్నాయి. అభ్యర్థులు నిర్దేశించిన తేదీలో హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని, అందులో పేర్కొన్న సూచనలను అనుసరించాలని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది.
పరీక్ష పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..