యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) పలు విభాగాల్లో ఉన్న ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ఈఎస్ఐసీ) కార్పొరేషన్‌లో డిప్యూటీ డైరెక్టర్, ఆంత్రపాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాలో అసిస్టెంట్‌ కీపర్‌, మినిస్ట్రీ ఆఫ్‌ ఫిషరీస్‌ విభాగంలో ఫిషరీష్‌ రీసెర్చ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌, మినిస్ట్రీ ఆఫ్‌ పోర్ట్స్‌ విభాగంలో ప్రిన్సిపల్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనుంది.


ఈ పోస్టుల దరఖాస్తు స్వీకరణ ఇప్పటికే ప్రారంభమవ్వగా.. గడువు సెప్టెంబర్ 2వ తేదీతో ముగియనుంది. దరఖాస్తులను సెప్టెంబర్ 3వ తేదీ వరకు ప్రింటవుట్ తీసుకోవచ్చు. నోటిఫికేషన్ సహా మరిన్ని వివరాల కోసం యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://www.upsc.gov.in/ ను సంప్రదించవచ్చు. 


విభాగాల వారీగా ఖాళీలు.. 



  • ఈఎస్‌ఐసీలో డిప్యూటీ డైరెక్టర్‌- 151 (జనరల్- 66, ఓబీసీ- 38, ఎస్సీ- 23, ఎస్టీ- 09, పీడబ్ల్యూబీడీ- 04, ఈడబ్ల్యూఎస్- 15)

  • ఆంత్రపాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాలో అసిస్టెంట్‌ కీపర్‌- 2 (ఎస్టీ- 1, ఓబీసీ- 1)

  • మినిస్ట్రీ ఆఫ్‌ ఫిషరీస్‌ విభాగంలో ఫిషరీష్‌ రిసెర్చ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌- 1 (ఎస్టీ- 1)

  • మినిస్ట్రీ ఆఫ్‌ పోర్ట్స్‌ విభాగంలో ప్రిన్సిపల్‌ ఆఫీసర్‌- 1 (జనరల్- 1)


విద్యార్హత వివరాలు.. 
పోస్టు ఆధారంగా విద్యార్హతలు మారుతున్నాయి. పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ లేదా పీజీ చేసి ఉండాలి. ఈఎస్‌ఐసీలో డిప్యూటీ డైరెక్టర్‌ పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత రంగంలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. వీటితో పాటు ప్రభుత్వ లేదా ప్రభుత్వ అధీనంలో నడిచే సంస్థల్లో అకౌంట్స్, మార్కెటింగ్, ఇన్సూరెన్స్ లేదా పబ్లిక్ రిలేషన్స్‌లో కనీసం మూడేళ్ల అనుభవం తప్పనిసరిగా ఉండాలి.


వయో పరిమితి..
ఈఎస్ఐసీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు గరిష్టంగా 35 ఏళ్లకు మించరాదు. ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌ పోస్టులకు గరిష్ట వయసు 40 ఏళ్లుగా ఉంది. ప్రిన్సిపల్‌ ఆఫీసర్‌ పోస్టులకు గరిష్ట వయసు 50 ఏళ్లుగా ఉంది. పోస్టు ఆధారంగా వయోపరిమితి మారుతోంది. రిజర్వేషన్ల ఆధారంగా గరిష్ట వయోపరిమితిలో సడలింపులు ఉన్నాయి. 


డిప్యూటీ డైరెక్టర్ పోస్టులకు ఇలా..
డిప్యూటీ డైరెక్టర్ పోస్టులకు అర్హులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ), ఇంటర్వ్యూల ద్వారా అర్హులను ఎంపిక చేస్తుంది. రాత పరీక్షలో షార్ట్ లిస్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. రాత పరీక్ష తేదీలను ఇంకా వెల్లడించలేదు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష రెండు గంటల పాటు ఉంటుంది. ఇందులో పార్ట్- ఏ, పార్ట్- బి విభాగాలు ఉంటాయి. మొదటి విభాగంలో ఇంగ్లిష్, రెండో విభాగంలో జనరల్ ఎబులిటీ ప్రశ్నలు ఉంటాయి. 


Also Read: UBI Recruitment 2021: యూనియన్ బ్యాంకులో 347 ఉద్యోగాలు.. నోటిఫికేషన్, దరఖాస్తు ప్రక్రియ పూర్తి వివరాలు ఇవే