యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్(యూపీఎస్సీ) వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


వివరాలు..


మొత్తం ఖాళీలు: 19


1. నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియాలో ఆర్కైవిస్ట్ (జనరల్): 13 పోస్టులు


రిజర్వ్ కేటగిరి: ఎస్సీ-01, ఓబీసీ-03, ఈడబ్ల్యూఎస్-01, యూఆర్-08.


అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటి నుంచి మాస్టర్స్ డిగ్రీ(చరిత్ర) ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 30 సంవత్సరాలు.


2. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌లో స్పెషలిస్ట్ గ్రేడ్-3(పీడియాట్రిక్స్): 05 పోస్టులు


రిజర్వ్ కేటగిరి: ఎస్సీ-01, ఓబీసీ-01, ఈడబ్ల్యూఎస్-01, యూఆర్-02. వీటిలో పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు -01.


అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో 3 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 40 సంవత్సరాలు.


3. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో సైంటిస్ట్‌- బి(న్యూట్రాన్ యాక్టివేషన్ అనాలిసిస్): 01 పోస్టు


రిజర్వ్ కేటగిరి: యూఆర్-01.


అర్హత: మాస్టర్ డిగ్రీ(కెమిస్ట్రీ/ఫిజిక్స్‌) లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి మూడేళ్ల బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్‌తో పాటు కెమిస్ట్రీ లేదా ఫిజిక్స్ సంబధిత విభాగంలో ఉత్తీర్ణతతో పాటు 3 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 35 సంవత్సరాలు.


ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తుచేసుకోవాలి.


దరఖాస్తు ఫీజు: రూ.25.


ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.


ముఖ్యమైన తేదీలు..


▶ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివ‌రితేది: 10.12.2022.


▶ ఆన్‌లైన్ దరఖాస్తు కాపీ ప్రింట్ తీసుకోవడానికి చివరితేది: 29.12.2022.


Notification 


Website  


Also Read:


తిరువనంతపురం,హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు
తిరువనంతపురంలోని హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్(హెచ్ఎల్ఎల్) ఒప్పంద ప్రాతిపదికన ప్రొడక్షన్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దీని ద్వారా మొత్తం 19 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఐటీఐ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 21లోపు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఏపీలో 1458 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు, అర్హతలివే!
ఏపీలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రభుత్వ మెడికల్, డెంటల్‌ బోధనాస్పత్రుల్లో సీనియర్‌ రెసిడెంట్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడదల చేసింది. దీని ద్వారా మొత్తం 1,458 పోస్టులను భర్తీ చేయనున్నారు. మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ(డీఎం/ ఎంసీహెచ్‌/ ఎండీ/ ఎంఎస్‌/ ఎండీఎస్‌) ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 10లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తుచేసుకోవచ్చు.
నోటిపికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.


నిరుద్యోగులకు గుడ్ న్యూస్, టీఎస్‌పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ - వివరాలు ఇలా!
తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం మరో తీపి కబురు వినిపించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో 18 డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ డిసెంబర్ 8న నోటిఫికేషన్ (నెం.21/2022) విడుదల చేసింది. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి డిసెంబర్ 16 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. జనవరి 5 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...