UPSC IES/ISS 2024 Notification: భారత ప్రభుత్వ ఎకనామిక్స్‌, స్టాటిస్టికల్‌ సర్వీసుల్లో జూనియర్‌ టైమ్ స్కేల్‌ పోస్టుల భర్తీకి సంబంధించి ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వీస్‌(IES), ఇండియన్‌ స్టాటిస్టికల్‌ సర్వీస్‌ ఎగ్జామినేషన్‌ (ISSE)- 2024 నోటిఫికేషన్‌ను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(UPSC) ఏప్రిల్ 10న విడుదల చేసింది. దీనిద్వారా ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వీస్‌లో 18 పోస్టులను, ఇండియన్‌ స్టాటిస్టికల్‌ సర్వీస్‌‌లో 30 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఏప్రిల్ 10 నుంచి 30 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.


పోస్టుల వివరాలు.. 


➥ ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వీస్‌: 18 పోస్టులు 


➥ ఇండియన్‌ స్టాటిస్టికల్‌ సర్వీస్‌: 30 పోస్టులు


అర్హత: ఎకనామిక్‌ సర్వీసుకు పీజీ డిగ్రీ (ఎకనామిక్స్‌/అప్లైడ్‌ ఎకనామిక్స్‌/బిజినెస్‌ ఎకనామిక్స్‌/ఎకనామెట్రిక్స్‌) ఉత్తీర్ణులై ఉండాలి. ఇక స్టాటిస్టికల్‌ సర్వీసుకు డిగ్రీ(స్టాటిస్టిక్స్‌/మ్యాథమెటికల్‌ స్టాటిస్టిక్స్‌/అప్లైడ్‌ స్టాటిస్టిక్స్‌) లేదా పీజీ(స్టాటిస్టిక్స్‌/మ్యాథమెటికల్‌ స్టాటిస్టిక్స్‌/అప్లైడ్‌ స్టాటిస్టిక్స్‌) ఉత్తీర్ణులై ఉండాలి. 


వయోపరిమితి: 01.08.2024 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.


రాతపరీక్ష విధానం..


➥ మొత్తం 1000 మార్కులకు ఎకనామిక్స్‌, స్టాటిస్టిక్స్ విభాగాలకు వేర్వేరుగా పరీక్షలు నిర్వహిస్తారు. 


➥ ఎకనామిక్స్‌ విభాగంలో జనరల్ ఇంగ్లిష్-100 మార్కులు, జనరల్ స్టడీస్-100 మార్కులు, జనరల్ ఎకనామిక్స్(1)-200 మార్కులు, జనరల్ ఎకనామిక్స్(2): 200 మార్కులు, జనరల్ ఎకనామిక్స్(3)-200 మార్కులు, ఇండియన్ ఎకనామిక్స్-200 మార్కులకు పరీక్షలు ఉంటాయి. ఒక్కో సబ్జెక్టుకు 3 గంటల సమయం కేటాయించారు.


➥ ఇక స్టాటిస్టిక్స్ విభాగంలో జనరల్ ఇంగ్లిష్-100 మార్కులు, జనరల్ స్టడీస్-100 మార్కులు, స్టాటిస్టిక్స్-1(ఆబ్జెక్టివ్)-200 మార్కులు, స్టాటిస్టిక్స్-2(ఆబ్జెక్టివ్)-200 మార్కులు, స్టాటిస్టిక్స్-3(డిస్క్రిప్టివ్): 200 మార్కులు, స్టాటిస్టిక్స్-4(డిస్క్రిప్టివ్)-200 మార్కులకు పరీక్షలు ఉంటాయి. ఒక్కో సబ్జెక్టుకు 3 గంటల సమయం కేటాయించారు.


➥ తర్వాత దశలో 200 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైనవారికి డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఉంటుంది.


పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, చండీగఢ్, చెన్నై, కటక్, ఢిల్లీ, డిస్పూర్, జైపూర్, జమ్మూ, కోల్‌కతా, లక్నో, ముంబయి, పాట్నా, ప్రయాగ్‌రాజ్, షిల్లాంగ్, సిమ్లా, తిరువనంతపురం.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.04.2024.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 30.04.2024.


➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 01 - 07.05.2024.


➥ రాతపరీక్ష తేదీ: 21.06.2024.


Notification


Online Application


Website


ALSO READ:


UPSC CMS 2023: యూపీఎస్సీ సీఎంఎస్-2024 నోటిఫికేషన్ విడుదల, వివిధ విభాగాల్లో 827 పోస్టుల భర్తీ
కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో మెడికల్ ఆఫీసర్ల నియామకానికి సంబంధించిన కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్-2024 నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఏప్రిల్ 10న విడుదల చేసింది. దీనిద్వారా వివిధ విభాగాల్లో 827 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు నిర్దిష్ట శారీరక/ వైద్య ప్రమాణాలకు కలిగి ఉండాలి. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 10 నుంచి ఏప్రిల్ 30న సాయంత్రం 6 గంటల వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా 200 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. యూపీఎస్సీ సీఎంఎస్ పరీక్ష జులై 14న దేశవ్యాప్తంగా 41 సెంటర్లలో నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...