యూపీఎస్సీ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 2023 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చి 3న విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను చూడవచ్చు. పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో భాగంగా జూన్ 25న మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. యూపీఎస్సీ ఫిబ్రవరి 19న  ఇంజినీరింగ్ సర్వీసెస్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.


UPSC ESE Results - ఇంజినీరింగ్ సర్వీసెస్ పరీక్ష ఫలితాల కోసం క్లిక్ చేయండి..


                               


యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్‌ను గతేడాది సెప్టెంబరు 16న విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా ఇండియన్ రైల్వే సర్వీసెస్, ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీసెస్, సెంట్రల్ ఇంజినీరింగ్, టెలికామ్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని 327 ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీలకు నియామకాలు చేపడతారు. పోస్టుల భర్తీకి సంబంధించి సెప్టెంబరు 14 నుంచి అక్టోబరు 4 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించారు. ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. తాజాగా ఫలితాలను వెల్లడించారు.


ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2023 నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..


మెయిన్ పరీక్ష ఇలా..


మొత్తం 600 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. వీటిలో 300 మార్కులకు పేపర్-1 (సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్), 300 మార్కులకు పేపర్-2 (సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్) పరీక్ష నిర్వహిస్తారు.  ఒక్కో పేపర్‌కు 3 గంటల చొప్పున సమయం కేటాయిస్తారు. కన్వెన్షల్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. 


తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైద‌రాబాద్, తిరుప‌తి, విశాఖ‌ప‌ట్నంలో పరీక్ష నిర్వహిస్తారు.


ఉద్యోగాల భర్తీ ఈ  సంస్థల్లో..


ఇండియన్ రైల్వే సర్వీసెస్, ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీసెస్, సెంట్రల్ ఇంజినీరింగ్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ సర్వీసెస్, సెంట్రల్ ఇంజినీరింగ్ సర్వీసెస్, సర్వే ఆఫ్ ఇండియా, బోర్డర్ రోడ్ ఇంజినీరింగ్ సర్వీసెస్, ఇండియన్ డిఫెన్స్ సర్వీసెస్, ఎంఈఎస్ సర్వేయర్ క్యాడర్, నావెల్ అర్మామెంట్ సర్వీసెస్, జూనియర్ టెలికమ్ ఆఫీసర్ (టెలికమ్ సర్వీసెస్).


Also Read:


IAF: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో 'అగ్నివీర్ వాయు' ఉద్యోగాలు, అర్హతలివే!
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత వాయుసేన అగ్నిపథ్ స్కీంలో భాగంగా అగ్నివీర్ వాయు నియామకాలకు సంబంధించి నోటిషికేషన్ విడుదల చేసింది. ఇంటర్ లేదా ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి మార్చి 17 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు మార్చి 31 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్‌లైన్ రాతపరీక్ష, ఫిజికల టెస్ట్, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


అస్సాం రైఫిల్స్‌లో 616 టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ పోస్టులు - అర్హతలివే!
షిల్లాంగ్‌లోని అస్సాం రైఫిల్స్, డైరెక్టర్ జనరల్ కార్యాలయం గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో రాష్ట్రాల వారీగా టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్ ఖాళీల భర్తీకి సంబంధించి మే నెలలో రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులు మార్చి 19 లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, స్కిల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...