దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) శుభవార్త తెలిపింది. ఇకపై యూపీఎస్సీ నిర్వహించే పరీక్షలకు దరఖాస్తు చేసుకొనే, అభ్యర్థులు ఇకపై ప్రతిసారి తమ వివరాలు నమోదు చేయాల్సిన అవసరం లేదు. అభ్యర్థుల సౌకర్యార్థం వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌(ఓటీఆర్‌) విధానాన్ని యూపీఎస్సీ అందుబాటులోకి తీసుకొచ్చింది.


Also Read: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 1312 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు, అర్హతలివే!


ఓటీఆర్‌ వేదికపై ఒకసారి వ్యక్తిగత సమాచారం, ఇతర వివరాలు రిజస్ట్రేషన్‌ చేసుకుంటే చాలు. వేర్వేరు పరీక్షలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నప్పుడు ఓటీఆర్‌ నంబర్‌ తెలియజేస్తే సరిపోతుంది. వారి వివరాలన్నీ దరఖాస్తు పత్రంలో ప్రత్యక్షమవుతాయి. దీనివల్ల అభ్యర్థులకు సమయం ఆదా కావడంతోపాటు దరఖాస్తుల ప్రక్రియ మరింత సులభతరంగా మారుతుందని, దరఖాస్తుల్లో పొరపాట్లకు అవకాశం ఉండదని యూపీఎస్సీ వర్గాలు వెల్లడించాయి..

Also Read: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌‌లో 323 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు; అర్హతలివే!


ఓటీఆర్‌లో నమోదు చేసుకున్న అభ్యర్థుల సమాచారం యూపీఎస్సీ సర్వర్లలో భద్రంగా ఉంటుందని తెలిపాయి. ఆన్‌లైన్‌ దరఖాస్తు పత్రంలో ఈ ఓటీఆర్‌ నంబర్‌ నమోదు చేస్తే 70 శాతం దరఖాస్తును పూర్తిచేసినట్లే. యూపీఎస్సీ నిర్వహించే అన్నిపరీక్షలకు ఓటీఆర్‌ ఉపయోగపడుతుంది.  https://www.upsc.gov.in/ లేదా https://upsconline.nic.in/ వెబ్‌సైట్ల ద్వారా ఎప్పుడైనా సరే ఓటీఆర్‌లో అభ్యర్థులు వివరాలు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని యూపీఎస్సీ ఒక ప్రకటనలో సూచించింది.




Also Read:


జూనియర్‌లెక్చరర్లకు బీఈడీ తప్పనిసరి, ఏపీ ప్రభుత్వ నిర్ణయం!


ఏపీలోని జూనియర్‌ కళాశాలల్లో పని చేస్తున్న రెగ్యులర్‌, ఒప్పంద లెక్చరర్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై జూనియర్‌ లెక్చరర్ ఉద్యోగాలకు బీఈడీ అర్హత కచ్చితంగా ఉండాలని ఏపీ ఇంటర్‌ విద్యాశాఖ ఆదేశించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు సీబీఎస్‌ఈకి అనుబంధంగా మారుతున్న నేపథ్యంలో ఇంటర్మీడియట్‌ బోర్డు ఉనికి ప్రశ్నార్థకం కానుంది. దీన్ని పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన కసరత్తు ఇప్పటికే కొనసాగుతుంది. సీబీఎస్‌ఈ నిబంధనల ప్రకారం ఇంటర్మీడియట్‌ను +1, +2గా పరిగణిస్తారు. ఎన్‌సీఆర్‌టీ (NCERT) నిబంధనల ప్రకారం బీఈడీ అర్హత ఉన్న వారే +1, +2కు పాఠాలు బోధించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పాఠాలు బోధిస్తున్న వారిలో ఎక్కువ మందికి బీఈడీ అర్హత లేదు. రెగ్యులర్‌గా నియామకాలు పొందిన వారు ఆయా సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ పూర్తి చేశారు. కొంతమంది గతంలో స్కూల్‌ అసిస్టెంట్ల నుంచి డిప్యూటేషన్ల మీద జూనియర్‌ లెక్చరర్లుగా వచ్చారు. వీరి విషయంలో ఎలాంటి సమస్యలేదు. అసలు చిక్కంతా రెగ్యులర్‌, ఒప్పంద లెక్చరర్ల విషయంలోనే వచ్చిపడింది. ఇలాంటి వారు 5,100మంది ఉండగా.. వీరిలో దాదాపు 350 మందికి మాత్రమే బీఈడీ అర్హత ఉంది.
ఇగ్నో సాయం...
సీబీఎస్‌ఈకి అనుబంధంగా మారుతున్న పాఠశాలల్లోని విద్యార్థులు 2026లో +1 పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఆలోగా జూనియర్‌ లెక్చరర్లు ఈ కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ కోర్సు అందించేందుకు ఇంటర్‌ విద్యాశాఖ ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం(ఇగ్నో)తో సంప్రదింపులు జరుపుతోంది. సామర్థ్యాల పెంపునకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు సహకారం తీసుకోనుంది. ఆన్‌లైన్‌లోనే లెక్చరర్లకు ఇగ్నో శిక్షణ ఇస్తుంది. అనంతరం వీరికి పరీక్ష పెట్టి, ఒక సర్టిఫికెట్‌ ఇస్తుంది. ఈ సామర్థ్యాల పెంపు శిక్షణను లెక్చరర్లు అందరికీ తప్పనిసరి చేశారు.


 


Also Read:

తెలంగాణలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ, ముఖ్యమైన తేదీలివే!
ఇండియన్ ఆర్మీలో నియామకాల కోసం నిర్దేశించిన అగ్నిపథ్‌ పథకం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. సెప్టెంబరు 3 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు నిర్ణీత గడువులోగా అగ్నిపథ్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణలో అక్టోబరు 15 నుంచి 31 వరకు సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ఆఫీస్ అగ్రిపథ్ నియామక ర్యాలీ నిర్వహించనుంది. సూర్యాపేటలోని శ్రీ వేంకటేశ్వర డిగ్రీ కాలేజీ మైదానంలో నియామక ర్యాలీ జరుగనుంది. తెలంగాణలోని 33 జిల్లాలకు చెందిన అభ్యర్థులు నియామక ర్యాలీకి హాజరుకావచ్చు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..



Also Read:


ITBP: టెన్త్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇవే!
ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) విభాగం కానిస్టేబుల్(పయోనిర్) గ్రూప్-సి పరిధిలోని నాన్ గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండి, గుర్తింపు పొందిన ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక సంవత్సరం సర్టిఫికేట్ కోర్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆగస్టు 19 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సెప్టెంబరు 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..


 


మరిన్ని ఉద్యోగ సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి...