UPSC CSE Prelims Result 2025 :  సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) ప్రిలిమినరీ 2025 ఫలితాలు విడుదల చేసేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సిద్ధమైంది. ఈ సంవత్సరం UPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష మే 25న జరిగింది. మునుపటి ట్రెండ్‌లను అనుసరించి పరీక్షను రెండు పూటలు నిర్వహించారు. గతంలో పరీక్ష జరిగిన పక్షం రోజుల్లో ఫలితాలు విడుదల చేశారు. ఆ ట్రెండు ప్రకారం చూస్తే ఏ క్షణమైనా ఫలితాలు వెల్లడించే అవకాశం ఉందని అభ్యర్థులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.

ప్రిలిమ్స్‌లో మంచి మార్కులు సాధించిన అభ్యర్థులను మెయిన్స్ పరీక్షకు అర్హతన సాధించినట్టు యూపీఎస్సీ ప్రకటిస్తుంది. ఇలా మెయిన్స్‌కు అర్హత సాధించిన వారి జాబితాను షార్ట్ లిస్ట్ చేసి పీడీఎఫ్‌ రూపంలో తయారు చేస్తుంది. ఆ పీడీఎఫ్‌ను వెబ్‌సైట్‌లో పెడుతుంది. అభ్యర్థులు upsc.gov.inలో పెట్టిన పీడీఎఫ్‌ను డౌన్‌లోడ్ చేసుకొని తమ నెంబర్ ఆధారంగా పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు.  

గత ప్రిలిమినరీ పరీక్షలతో పోలిస్తే గతేడాది కటాఫ్ భారీగా ఉంది. జనరల్ కేటగిరీ కటాఫ్ 87.98కి పెరిగింది, అయితే OBC 87.28 , EWS కేటగిరీ కటాఫ్‌ 85.92గా ఉంది. ఈసారి కూడా ఆ స్థాయిలో ఉంటుందని అంచనా వేస్తున్నారు.  

UPSC ఈసారి ఆధార్‌తో అనుసంధానించే అప్లికేషన్ ప్రక్రియను చేపట్టింది. అంటే ఆధార్‌ ఆధారంగా లాగిన్ అయ్యే విధానం తీసుకొచ్చింది. కొత్త విధానంలో దాదాపు 95 మంది ఆధార్‌ బేస్‌ లాగిన్‌ విధానాన్ని ఎంచుకున్నారు. ఈ మధ్యే అంటే మే 28, 2025న కొత్త వ్యవస్థ అమలులోకి వచ్చింది.  

పరీక్ష ఎప్పుడు నిర్వహించారు?

UPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2025 మే 25, 2025న జరిగింది. పరీక్షలో రెండు పేపర్లు ఉన్నాయి—. స్టడీస్ పేపర్ I, CSAT (పేపర్ II).

అత్యంత కఠినంగా CSAT 2025 

CSAT 2025 అత్యంత కఠినంగా డిజైన్ చేసినట్టు నిపుణులు చెబుతున్నారు. ఈ పేపర్‌ను అర్హత పరీక్షగా కాకుండా ఎలిమినేటింగ్ రౌండ్‌గా రూపొందించారని అంటున్నారు. చాలా మంది అభ్యర్థులకు ఇదే ముప్పుతిప్పలు పెట్టింది.  విశ్లేషణాత్మక, అవగాహన, తార్కిక ప్రశ్నలతో తికమక పెట్టింది.  

UPSC ఫలితాన్ని ఎలా తనిఖీ చేయాలిఫలితాలు విడుదలైన తర్వాత అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఫలితాలు చూడాలి. వాట్స్‌ న్యూ అనే విభాగంపై క్లిక్ చేయాలి. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఫలితం 2025 PDF లింక్‌పై క్లిక్ చేయండి. మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థుల రోల్ నంబర్ల జాబితా వస్తంది. అందులో కంట్రోల్‌ ఎఫ్ క్లిక్ చేసి మీ నెంబర్ టైప్ చేస్తే ఫలితం తెలుస్తుంది. మీ నెంబర్ ఉంటే కనిపిస్తుంది.లేకుంటే నాట్ ఫౌండ్ అని వస్తుంది.