కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో మెడికల్ ఆఫీసర్ల నియామకానికి సంబంధించిన కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్-2025 నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) విడుదల చేసింది. దీనిద్వారా వివిధ విభాగాల్లో 705 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు నిర్దిష్ట శారీరక/ వైద్య ప్రమాణాలకు కలిగి ఉండాలి. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు మార్చి 11 సాయంత్రం 6 గంటల వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా 200 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. యూపీఎస్సీ సీఎంఎస్ పరీక్ష జులై 20న దేశవ్యాప్తంగా 41 సెంటర్లలో నిర్వహించనున్నారు.
వివరాలు..
* యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2025
ఖాళీల సంఖ్య: 705 పోస్టులు
కేటగిరీ-I..
మెడికల్ ఆఫీసర్స్ గ్రేడ్: 226 పోస్టులు
విభాగం: జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ సబ్-క్యాడర్ ఆఫ్ సెంట్రల్ హెల్త్ సర్వీస్
కేటగిరీ-II..
1) అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్: 450 పోస్టులు
విభాగం: రైల్వే.
2) జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్: 09 పోస్టు
విభాగం: న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్.
3) జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (గ్రేడ్-2): 20
విభాగం: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్.
విద్యార్హత: అభ్యర్థులు ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: 01.08.2025 నాటికి అభ్యర్థుల వయసు 32 సంవత్సరాలకు మించకూడదు. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ సబ్-క్యాడర్ ఆఫ్ సెంట్రల్ హెల్త్ సర్వీస్ పోస్టులకు 35 సంవత్సరాలకు మించకూడదు
దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రుసుం రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు/ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
పరీక్ష విధానం..
✪ పార్ట్-1లో భాగంగా మొత్తం 500 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరకు 250 మార్కులు. ఒక్కో పేపరులో 120 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు.
✪ పేపర్-1లో జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్ గురించి, పేపర్-2లో సర్జరీ, గైనకాలజీ & అబ్‌స్ట్రేట్రిక్స్, ప్రివెంటివ్ & సోషల్ మెడిసిన్ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
✪ పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కుల చొప్పున కోత విధిస్తారు.
✪ పార్ట్-1లో భాగంగా 100 మార్కులకు పర్సనాలిటీ పరీక్ష నిర్వహిస్తారు.
పరీక్షా కేంద్రాలు: అగర్తలా, అహ్మదాబాద్, ఐజ్వాల్, బరేలీ, బెంగళూరు, భోపాల్, చండీగఢ్, చెన్నై, కటక్, డెహ్రాడూన్, ఢిల్లీ, ధార్వాడ్, డిస్‌పూర్, గ్యాంగ్‌టక్, హైదరాబాద్, ఇంఫాల్, ఇటానగర్, జైపూర్, జమ్ము, జోర్హాట్, కొచ్చి, కోహిమా, కోల్‌కతా, లక్నో, మధురై, ముంబయి, నాగ్‌పూర్, పనాజీ (గోవా), పాట్నా, పోర్ట్ బ్లెయిర్, ప్రయాగ్రాజ్, (అలహాబాద్) రాయ్పూర్, రాంచీ, సంబల్పూర్, షిల్లాంగ్, సిమ్లా, శ్రీనగర్, తిరువనంతపురం, తిరుపతి, ఉదయపూర్, విశాఖపట్నం.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి.
ముఖ్యమైన తేదీలు...
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 11.03.2025.
➥ సీఎంఎస్ పరీక్ష తేది: 20.07.2025.