UPSC CDSE 2022 Result: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (II)-2022 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)  విడుదల చేసింది. ఫలితాలను యూపీఎస్సీ అధికారిక వెబ్‌‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. త్రివిధ దళాల పరిధిలోని విభాగాల వారీగా ఫలితాలను విడుదల చేసింది. పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. సెప్టెంబరు 4న నిర్వహించిన పరీక్షలకు హాజరైన అభ్యర్థులు ఫలితాలను వెబ్‌సైట్‌ ద్వారా చూసుకోవచ్చు. 



UPSC CDS 2 result 2022: ఫలితాలు ఇలా చూసుకోండి...


1) ఫలితాల కోసం మొదటి అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. - upsc.gov.in

2) అక్కడ హోంపేజీలో “What’s New” లింక్ మీద క్లిక్ చేయాలి.

3) ఇప్పుడు “Written Result (with name): Combined Defence Services Examination (II), 2022” ఫలితాలకు సంబంధించిన లింక్ మీద క్లిక్ చేయాలి.

4) సీడీఎస్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల ఫలితాలు కంప్యూటర్ స్కీన్ మీద కనిపిస్తాయి. పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఫలితాలు ఉంటాయి. 

5) 'Ctrl + F' క్లిక్ చేసి హాల్‌టికెట్ లేదా రూల్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలు చేసుకోవచ్చు. నెంబర్ వస్తే అర్హత సాధించినట్లు లేకపోతే అర్హత లేనట్టే. 

6) ఫలితాలను డౌన్‌‌లోడ్ చేసుకోవాలి. భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.


 


UPSC CDS (II) - 2022 Results Link..


యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 4న నిర్వహించిన సీడీఎస్(2) ఫలితాల్లో మొత్తం 6658 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. ఎంపికైన అభ్యర్థుల రూల్ నెంబర్లను త్రివిధ దళాల వారీగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సర్వీస్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. అనంతరం తుది ఫలితాలను విడుదల చేస్తారు. పరీక్షలో అర్హత సాధించని అభ్యర్థుల మార్కుల వివరాలను తుది ఫలితాలు వెల్లడించిన పదిహేను రోజుల్లోగా వెబ్‌సైట్‌లో ఉంచుతామని యూపీఎస్సీ స్పష్టం చేసింది.



త్రివిధ దళాల్లో మొత్తం 339 ఆఫీసర్ స్థాయి పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మే 18న  'కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (II)- 2022' నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో ఇండియ‌న్ మిల‌ట‌రీ అకాడ‌మీ (డెహ్రాడూన్) పరిధిలో 100 పోస్టులు, ఇండియ‌న్ నేవ‌ల్ అకాడ‌మీ(ఎజిమ‌ళ‌) పరిధిలో 22 పోస్టులు, ఎయిర్‌ఫోర్స్ అకాడ‌మీ (హైద‌రాబాద్) పరిధిలో 32 పోస్టులు, ఆఫీస‌ర్స్ ట్రైనింగ్ అకాడ‌మీ(చెన్నై) పరిధిలో 185 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల నుంచి మే 15 నుంచి జూన్ 7 వరకు దరఖాస్తులు స్వీకరించింది. అనంతరం సెప్టెంబరు 4న సీడీఎస్(2) పరీక్ష నిర్వహించింది. వీటికి సంబంధించిన ఫలితాలనే తాజాగా విడుదల చేసింది.



CDS II 2022 Notification


 


ఇవి కూడా చదవండి:


UPSC: యూపీఎస్సీ నుంచి 54 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అర్హతలు ఇవే!
కేంద్రప్రభుత్వ విభాగాల్లో వివిధ ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 54 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 43 లేబర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ పోస్టులు, సైంటిస్ట్ ‘బి’ (ఫోరెన్సిక్ డీఎన్‌ఏ) విభాగంలో 6 పోస్టులు, ఇతర విభాగాల్లో ఒక్కో పోస్టుల చొప్పున భర్తీ చేస్తారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా సెప్టెంబరు 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..



UPSC:  ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2023 నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు ఇలా
యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా ఇండియన్ రైల్వే సర్వీసెస్, ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీసెస్, సెంట్రల్ ఇంజినీరింగ్, టెలికామ్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీలకు నియామకాలు చేపడతారు. పోస్టుల భర్తీకి సంబంధించి సెప్టెంబరు 14న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబరు 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..



UPSC: 'కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్-2023' నోటిఫికేషన్ వచ్చేసింది, పోస్టులెన్నో తెలుసా?
యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 'కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ ఎగ్జామినేషన్‌-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా కేంద్ర గనుల శాఖ, జలవనరుల శాఖలో గ్రూప్‌-ఎ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.200 చెల్లించి అక్టోబరు 11లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ పరీక్ష, జూన్ 24, 25 తేదీల్లో మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..



మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...