ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏప్రిల్ 21న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. త్రివిధ దళాల పరిధిలోని విభాగాల వారీగా ఫలితాలను విడుదల చేసింది. పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఎంపికైన అభ్యర్థుల వివరాలను అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను చూసుకోవచ్చు. ఫలితాలకు సంబంధించి మొత్తం 204 మంది అభ్యర్థులు ఎంపిక కాగా.. వీరిలో ఇండియన్ మిలిటరీ అకాడమీకి 146 మంది అభ్యర్థులు, ఇండియన్ నేవల్ అకాడమీకి 43 మంది అభ్యర్థులు, ఎయిర్‌ఫోర్స్ అకాడమీకి 15 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలన తర్వాత వెల్లడించనున్నారు. 


సీడీఎస్(2) - 2022 తుది ఫలితాలు ఇలా చూసుకోండి..


➥ ఫలితాల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.- https://www.upsc.gov.in/


➥ అక్కడ్ హోంపేజీలో కనిపించే 'UPSC CDS II Final Result 2022' లింక్ పై క్లిక్ చేయాలి.


➥ ఫలితాలకు సంబంధించిన పేజీ ఓపెన్ అవుతోంది. 


➥ అక్కడ పీడీఎఫ్ ఫార్మాట్‌లో అందుటులో ఉన్న ఫలితాలు కనిపిస్తాయి.


➥ 'Ctrl + F' క్లిక్ చేసి హాల్‌టికెట్ లేదా రూల్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలు చేసుకోవచ్చు. నెంబర్ వస్తే అర్హత సాధించినట్లు లేకపోతే అర్హత లేనట్టే. 


➥ ఆ పీడీఎఫ్ ఫైల్‌లో అభ్యర్థులు 'UPSC CDS II 2022' తుది ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.


➥ ఫలితాలతో కూడిన పీడీఎఫ్‌ను అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకుని, భవిష్యత్ అవసరాల కోసం భద్ర పర్చుకోవాలి.


ఫలితాల కోసం క్లిక్ చేయండి


Notification


యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 4న నిర్వహించిన సీడీఎస్(2) ఫలితాల్లో మొత్తం 6658 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. ఎంపికైన అభ్యర్థుల రూల్ నెంబర్లను త్రివిధ దళాల వారీగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సర్వీస్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూలు నిర్వహించింది. అనంతరం తుది ఫలితాలను విడుదల చేసింది. 


త్రివిధ దళాల్లో మొత్తం 339 ఆఫీసర్ స్థాయి పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మే 18న  'కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (II)- 2022' నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి మే 15 నుంచి జూన్ 7 వరకు దరఖాస్తులు స్వీకరించింది. ఖాళీల్లో ఇండియ‌న్ మిల‌ట‌రీ అకాడ‌మీ (డెహ్రాడూన్) పరిధిలో 100 పోస్టులు, ఇండియ‌న్ నేవ‌ల్ అకాడ‌మీ(ఎజిమ‌ళ‌) పరిధిలో 22 పోస్టులు, ఎయిర్‌ఫోర్స్ అకాడ‌మీ (హైద‌రాబాద్) పరిధిలో 32 పోస్టులు, ఆఫీస‌ర్స్ ట్రైనింగ్ అకాడ‌మీ(చెన్నై) పరిధిలో 185 పోస్టులు ఉన్నాయి. అనంతరం సెప్టెంబరు 4న సీడీఎస్(2) పరీక్ష నిర్వహించింది. వీటికి సంబంధించిన ఫలితాలనే తాజాగా విడుదల చేసింది.


Also Read:


యూపీఎస్సీ సీఎంఎస్-2023 నోటిఫికేషన్ విడుదల, వివిధ విభాగాల్లో 1261 పోస్టుల భర్తీ!
కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో మెడికల్ ఆఫీసర్ల నియామకానికి సంబంధించిన కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్-2023 నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఏప్రిల్ 19న విడుదల చేసింది. దీనిద్వారా వివిధ విభాగాల్లో 1261 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు నిర్దిష్ట శారీరక/ వైద్య ప్రమాణాలకు కలిగి ఉండాలి. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 19 నుంచి మే 9న సాయంత్రం 6 గంటల వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా 200 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. యూపీఎస్సీ సీఎంఎస్ పరీక్ష జులై 16న దేశవ్యాప్తంగా 41 సెంటర్లలో నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


గురుకుల డిగ్రీ కాలేజీల్లో 868 డీఎల్, నాన్-టీచింగ్ పోస్టులు - అర్హతలివే!
తెలంగాణ గురుకుల డిగ్రీ కాలేజీల్లో వివిధ పోస్టుల భర్తీకి పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఏప్రిల్ 17న వెలువడింది. దీనిద్వారా 868 లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో 174 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలల్లో 287 పోస్టులు, బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 407 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో లెక్చరర్ పోస్టులు 785, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 39, లైబ్రేరియన్ పోస్టులు 36 ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


గురుకుల జూనియర్ కళాశాలల్లో జేఎల్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు, అర్హతలివే!
తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీల్లో వివిధ పోస్టుల భర్తీకి పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఏప్రిల్ 17న వెలువడింది. దీనిద్వారా 2008 జూనియర్ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో 253 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలల్లో 291 పోస్టులు, బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 1070 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో జేఎల్ పోస్టులు 1924, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 34, లైబ్రేరియన్ పోస్టులు 50 ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..