UPSC CDSE 2022 Result: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (I)-2022 తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) విడుదల చేసింది. ఫలితాలను యూపీఎస్సీ అధికారిక వెబ్‌‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. త్రివిధ దళాల పరిధిలోని విభాగాల వారీగా ఫలితాలను విడుదల చేసింది. పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. ఏప్రిల్ 10న నిర్వహించిన సీడీఎస్-1 2022 పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాలను వెబ్‌సైట్‌ ద్వారా చూసుకోవచ్చు. 


సీడీఎస్ ఫలితాలకు సంబంధించి మొత్తం 164 మందిని ఎంపిక చేసింది. వీరిలో ఇండియన్ మిలిటరీ అకాడమీకి 104 మంది, ఇండియన్ నేవల్ అకాడమీకి 46 మంది,  ఎయిర్‌ఫోర్స్ అకాడమీకి 14 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థులు తమ ఫలితాలను చూసుకోవచ్చు.


UPSC CDS 1 Final result 2022: ఫలితాలు ఇలా చూసుకోండి...


1) ఫలితాల కోసం మొదటి అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. - upsc.gov.in


2) అక్కడ హోంపేజీలో “What’s New” లింక్ మీద క్లిక్ చేయాలి.


3) ఇప్పుడు “Written Result (with name): Combined Defence Services Examination (I), 2022” ఫలితాలకు సంబంధించిన లింక్ మీద క్లిక్ చేయాలి.


4) సీడీఎస్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల ఫలితాలు కంప్యూటర్ స్కీన్ మీద కనిపిస్తాయి. పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఫలితాలు ఉంటాయి. 


5) 'Ctrl + F' క్లిక్ చేసి హాల్‌టికెట్ లేదా రూల్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలు చేసుకోవచ్చు. నెంబర్ వస్తే అర్హత సాధించినట్లు లేకపోతే అర్హత లేనట్టే. 


6) ఫలితాలను డౌన్‌‌లోడ్ చేసుకోవాలి. భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి. 


సీడీఎస్ తుది ఫలితాల కోసం క్లిక్ చేయండి..


యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏప్రిల్ 10న  నిర్వహించిన ఈ పరీక్షలో మొత్తం 4161 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సర్వీస్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూలు నిర్వహించింది. అనంతరం తుది ఫలితాలను విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థుల రూల్ నెంబర్లను త్రివిధ దళాల వారీగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థుల మార్కుల వివరాలను త్వరలోనే వెబ్‌సైట్‌లో ఉంచనున్నట్లు ఉంచనున్నారు. ఎంపికైన అభ్యర్థుల ఫలితాలను పీడీఎఫ్ ఫార్మాట్లో అందుబాటులో ఉంచారు.


త్రివిధ దళాల్లో మొత్తం 341  పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతేడాది డిసెంబరు 22న 'కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (I)- 2022' నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో ఇండియ‌న్ మిల‌ట‌రీ అకాడ‌మీ (డెహ్రాడూన్) పరిధిలో 100 పోస్టులు, ఇండియ‌న్ నేవ‌ల్ అకాడ‌మీ(ఎజిమ‌ళ‌) పరిధిలో 22 పోస్టులు, ఎయిర్‌ఫోర్స్ అకాడ‌మీ (హైద‌రాబాద్) పరిధిలో 32 పోస్టులు, ఆఫీస‌ర్స్ ట్రైనింగ్ అకాడ‌మీ(చెన్నై) పరిధిలో 170 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల నుంచి 2021 డిసెంబరు 22 నుంచి 2023 జనవరి 11 వరకు దరఖాస్తులు స్వీకరించింది. అనంతరం ఏప్రిల్ 10న సీడీఎస్(1)-2022 పరీక్ష నిర్వహించింది. వీటికి సంబంధించిన ఫలితాలనే తాజాగా విడుదల చేసింది.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...