ఏపీలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ వెలువడనుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాసుపత్రులు, వైద్య కళాశాలల్లో కొత్తగా 1,147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడించడానికి ఏపీ వైద్యారోగ్య సేవల నియామక బోర్డు (MHSRB) కసరత్తు చేస్తోంది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ల నియామక ప్రక్రియ పూర్తికాగానే.. అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామక ప్రకటనను వెలువరించే యోచనలో ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ ఉంది.
ప్రస్తుతం సివిల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. అర్హుల ఎంపిక జాబితానూ విడుదల చేశారు. నవంబరు 22 నుంచి 25 వరకు సర్టిఫికేట్ల పరిశీలన నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కొత్తగా వెలువడే ఈ నోటిఫికేషన్‌లోనూ ప్రైవేటు ప్రాక్టీసుపై నిషేధం నిబంధన కొనసాగించనున్నారు.
విల్ అసిస్టెంట్ సర్జన్ నియామకాల్లో అయితే ప్రైవేటు ప్రాక్టీసు నిషేధం నిబంధన అమల్లో ఉన్నప్పటికీ.. దాదాపు 4800 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పోస్టులన్నీ ఎంబీబీఎస్ అర్హతతో కూడినవే కావడంతో ప్రైవేటు ప్రాక్టీసు నిషేధాన్ని పెద్దగా పట్టించుకోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులన్నీ స్పెషలిస్ట్, సూపర్ స్పెషలిస్ట్ పోస్టుల కావడంతో.. నోటిఫికేషన్ సమయంలోనే ప్రైవేటు ప్రాక్టీసు నిషేధాన్ని వర్తింపజేస్తే దరఖాస్తుదారులకు ముందుగానే స్పష్టత ఇచ్చినట్లవుతుందని అధికారులు భావిస్తున్నారు.
అనుభవానికి ప్రాధాన్యం..
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీలో అనుభవానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో ఒప్పంద, పొరుగు సేవల ప్రాతిపదికన సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్నప్పటికీ.. గతంలో పనిచేసినా, ఆ అనుభవానికి తగిన వెయిటేజీ ఇవ్వనున్నారు. పీజీ వైద్యవిద్య పూర్తి చేసి, ఒక సంవత్సరం సీనియర్ రెసిడెంట్‌గా పనిచేసినవారు ఈ పోస్టులకు అర్హులు. వచ్చే మూడు నెలల్లోగా ఈ నియామక ప్రక్రియను పూర్తిచేస్తామని వైద్యవర్గాలు తెలిపాయి.
మొత్తం ఖాళీలు: 1147 పోస్టులు
విభాగాలవారీగా ఖాళీలు..
అనాటమీ - 26, ఫిజియాలజీ - 26, ఫార్మకాలజీ - 16, పాథాలజీ - 27, ఎస్‌పీఎం - 23, మైక్రోబయాలజీ - 25, ఫోరెన్సిక్ సైన్స్ - 25, బయోకెమిస్ట్రీ - 18, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ - 14, జనరల్ మెడిసిన్ - 111, జనరల్ సర్జరీ - 116, పీడియాట్రిక్స్ - 77, అనస్థీషియా - 154, రేడియో డయాగ్నసిస్ - 46, రేడియో థెరపీ - 05, సైకియాట్రీ - 21, టీవీ అండ్ సీడీ - 10, డెర్మటాలజీ - 13, అబ్‌స్ట్రీషియన్ అండ్ గైనకాలజీ - 138, ఆప్తల్మాలజీ - 08, ఆర్థోపెడిక్స్ - 62, ఈఎన్‌టీ - 15, డెంటల్ సర్జరీ - 13, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ - 14, ఎమర్జెన్సీ మెడిసిన్ - 15, కార్డియాలజీ - 17, కార్డియోథొరాసిస్ సర్జరీ - 21, ఎండోక్రైనాలజీ - 12, న్యూరాలజీ - 11, న్యూరో సర్జరీ - 16, ప్లాస్టిక్ సర్జరీ - 17, పీడియాట్రిక్ సర్జరీ - 08, యూరాలజీ - 17, నెఫ్రాలజీ - 10.
Also Read:
విద్యార్థులకు మోదీ గుడ్ న్యూస్, నైపుణ్యాభివృద్ధికి 'కర్మయోగీ భారత్'! రోజ్ గార్ మేళాలో ప్రకటించిన ప్రధాని, 71 వేల మందికి నియామక పత్రాలు
రోజ్ గార్ మేళాలో భాగంగా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఉద్యోగాలు పొందిన మరో 71 వేల మందికి మంగళవారం (నవంబరు 22) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నియామక పత్రాలను అందించారు. ఉదయం 10.30 గంటలకు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా కొత్తగా ఉద్యోగాలు పొందిన వారిని ఉద్దేశించి ప్రసంగించారు. నియామక పత్రాలను ఎన్నికల నియమావళి అమలులో ఉన్న గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ నహా మిగిలిన రాష్ట్రాల్లోని 45 ప్రాంతాల్లో అందించేందుకు ఏర్పాట్లు చేశారు. అక్టోబరు 22న 75వేల మందికి నియామకపత్రాలు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా రెండో విడత నియామక పత్రాలు అందజేశారు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..
'ఏపీపీఎస్సీ'కి షాకిచ్చిన హైకోర్టు, మూడు నోటిఫికేషన్లపై 'స్టే'
ఏపీలో ఉద్యోగాల నియామకాలపై హైకోర్టు 'స్టే'ల పర్వం కొనసాగుతోంది. అంతకు ముందు ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులు, ఇతర పోస్టుల నియామక ప్రక్రియను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీచేయగా.. తాజాగా వివిధ పోస్టుల భర్తీ కోసం కేవలం ఇంగ్లిష్ భాషలోనే రాతపరీక్ష నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ చర్యలు చేపట్టడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఈ వ్యవహారానికి సంబంధించిన మూడు నోటిఫికేషన్లను నిలిపివేసింది. రాతపరీక్షలో ప్రశ్నలను తెలుగులోనూ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
వెస్ట్ సెంట్రల్ రైల్వేలో 2521 అప్రెంటీస్ ఖాళీలు - టెన్త్‌తోపాటు ఐటీఐ అర్హత ఉండాలి!
RRC-West Central Railway Recruitment: రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్- వెస్ట్ సెంట్రల్ రైల్వే 2022-23 సంవత్సరానికి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతో పాటు సంబంధింత విభాగంలో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులను మెరిట్ (పదోతరగతి, ఐటీఐ మార్కులు) ఆధారంగా ఎంపిక జాబితా తయారుచేస్తారు. సరైన అర్హతలు ఉన్నవారు డిసెంబరు 17 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..