యూపీఎస్సీ సీఏపీఎఫ్ 2023 ఇంటర్వ్యూ షెడ్యూలును యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులు షెడ్యూలును అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం  అభ్యర్థులకు జులై 3 నుంచి 27 వరకు పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) నిర్వహించనున్నారు. మొత్తం 762 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరుకానున్నారు.


జులై 3 నుంచి రెండు షిఫ్టుల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఉదయం సెషన్ అభ్యర్థులు 9 గంటల్లోపు, మధ్యాహ్నం సెషన్ అభ్యర్థులు 1 గంటలోపు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలకు సంబంధించి ఈకాల్ లెటర్లను త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులకు నిర్దేశించిన తేదీల్లో మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ తేదీల్లో మార్పులు చేసుకోవడానికి ఎలాంటి అవకాశం లేదు.


ఇంటర్వ్యూ షెడ్యూలు ఇలా చూసుకోండి..


➥ ఇంటర్వ్యూ షెడ్యూలు కోసం అభ్యర్థులు మొదటి యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి-upsc.gov.in


➥ అక్కడ హోంపేజీలో కనిపించే 'UPSC CAPF Exam 2022 interview schedule' లింక్ మీద క్లిక్ చేయాలి. 


➥ క్లిక్ చేయగానే ఇంటర్వ్యూ షెడ్యూలుకు సంబంధించిన PDF ఫైల్ ఓపెన్ అవుతుంది. 


➥ పీడీఎఫ్ ఫైల్ డౌన్‌‌లోడ్ చేసుకోవాలి. 


➥ అందులో అభ్యర్థి ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల రూల్ నెంబర్లు, ఇంటర్వ్యూ తేదీలు చూసుకోవచ్చు.


ఇంటర్వ్యూ తేదీలు: జులై 3 నుంచి 27 వరకు.


ఇంటర్వ్యూ వేదిక:
Union Public Service Commission, 
Dholpur House, Shahjahan Road, 
New Delhi-110069


అభ్యర్థులకు ముఖ్య సూచనలు..


ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది.


ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు ఈ-సమ్మన్ లెటర్లను తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి.


రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలను కూడా తీసుకెళ్లాలి.


అభ్యర్థులు తమ ఒరిజినల్ విద్యార్హత ధ్రువపత్రాలు, ఒక జత జిరాక్స్ కాపీలు, కుల ధ్రువీకరణ సర్టిఫికేట్, ఇతర అవసరమైన అన్ని సర్టిఫికేట్లను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.


విమానంలో ఢిల్లీ చేరుకోదలచిన అభ్యర్థులకు విమానఛార్జీలను చెల్లిస్తారు. అయితే యూపీఎస్సీ పేర్కొ్న్న ట్రావెల్ ఏజెంట్ల వద్దనే ఎకానమీ టికెట్లు కొనాల్సి ఉంటుంది. టికెట్ల హార్డ్ కాపీ/ప్రింటవుట్ కాపీలను సమర్పించాల్సి ఉంటుంది.


అదేవిధంగా సెకండ్/స్లీపర్ క్లాస్ ట్రైన్ ద్వారా ప్రయాణించినవారు కూడా రీయింబెర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.


అభ్యర్థులు తమ ప్రయాణానికి కనీసం 21 రోజుల ముందుగా విమాన టికెట్లు, తిరుగు ప్రయాణ టికెట్లను కూడా బుక్ చేసుకోవాలి. కనీసం 72 గంటల ముందుగా బుక్ చేసుకోవడం మంచిది.


ఏదైనా విమాన టిక్కెట్ బుకింగ్ 72 గంటలలోపు చేయబడుతుంది. ముందు ఉద్దేశించిన ప్రయాణం, చెల్లుబాటు అయ్యే కారణాలతో సమర్థించబడకపోతే, తిరిగి చెల్లించబడదు.


కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.


సోషల్ డిస్టెన్స్, వ్యక్తిగత పరిశుభ్రత, తరచుగా చేతులు కడగటం, శానిటైజర్ వినియోగం, మాస్కులు ధరించడం తప్పనిసరి.



ALSO READ:


ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో 43 ఐటీ ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే!
న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్(ఐపీపీబీ) ఒప్పంద ప్రాతిపదికన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 43 పోస్టులను భర్తీ చేయనున్నారు. బీఈ, బీటెక్‌(కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనప్పటికి జులై 03 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


నాగ్‌పూర్‌ ఎయిమ్స్‌లో 73 సీనియర్‌ రెసిడెంట్ పోస్టులు, అర్హతలివే!
నాగ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) వివిధ విభాగాలో ఖాళీగా ఉన్న సీనియర్‌ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 73 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టులకి దరఖాస్తు ప్రక్రియ జూన్ 9న ప్రారంభమైంది. జులై 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..