యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ)  వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దీని ద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఖాళీగా వున్న పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

వివరాలు..

1. సీనియర్ డిజైన్ ఆఫీసర్ గ్రేడ్-1: 01 పోస్టు
2. సైంటిస్ట్ 'బి': 10 పోస్టులు
3. జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్: 01 పోస్టు
4. అసిస్టెంట్ ఆర్కిటెక్ట్: 13 పోస్టులు
5. అసిస్టెంట్ ప్రొఫెసర్(ఆయుర్వేదం): 01 పోస్టు
6. డ్రగ్ ఇన్‌స్పెక్టర్: 26 పోస్టులు

అర్హత:
బ్యాచిలర్స్ డిగ్రీ(ఇంజినీరింగ్/ఆర్కిటెక్చర్, ఆయుర్వేదం, ఫార్మసీ/ఫార్మాస్యూటికల్ సైన్సెస్), పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి:
27.10.2022 నాటికి సీనియర్ డిజైన్ ఆఫీసర్ పోస్టులకు 40 ఏళ్లు, సైంటిస్ట్‌కు 35 ఏళ్లు, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్/ అసిస్టెంట్ ఆర్కిటెక్ట్ & డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ 30 ఏళ్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలకు 45 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు రుసుము:
రూ.25(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు).

ఎంపిక విధానం:
రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 27.10.2022.

Notification

Website


Also Read


ఇండియన్ ఆర్మీలో 128 రిలీజియస్ టీచర్ పోస్టులు, అర్హతలివే!
ఇండియన్ ఆర్మీ ఆర్ఆర్‌టీ 91 & 92 కోర్సుల్లో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లుగా రిలీజియస్ టీచర్ల నియామకానికి పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు వున్న అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


సీజీఎల్ఈ దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నిర్వహించే 'కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌-2022' దరఖాస్తు గడువును అక్టోబరు 13 వరకు పొడిగిస్తూ స్థాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. వాస్తవానికి అక్టోబరు 8తో ముగియాల్సిన ఆన్‌లైన్ దరఖాస్తు గడువును మరో వారంపాటు పొడిగించింది. ఇప్పటివరకూ దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు అక్టోబరు 13లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజు చెల్లించడానికి ఆన్‌లైన్ ద్వారా అక్టోబరు 14 వరకు, చలనా ద్వారా అక్టోబరు 15 వరకు అవకాశం కల్పించారు. ఇక దరఖాస్తుల్లో ఏమైనా తప్పులుంటే అక్టోబరు 19, 20 తేదీల్లో సరిచేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


సీడాక్‌‌లో 530 ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు, ఈ అర్హతలుంటే చాలు
పుణెలోని సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(సీడ్యాక్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇంజినీరింగ్‌లో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అక్టోబరు 20లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 1535 ఖాళీలు, దరఖాస్తుకు అర్హతలివే!
భారత ప్రభుత్వ పెట్రోలియం, నేచురల్ గ్యాస్‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) దేశ వ్యాప్తంగా పలు కేంద్రాల్లో ఖాళీగా ఉన్న.. 1535 ట్రేడ్‌, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ స్టాండర్డ్స్‌, ప్యారామీటర్స్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌, ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...