UPSC NDA Results 2023: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC NDA & NA (2) - 2023) నేషనల్ డిఫెన్స్ అకాడమీ & నేవల్ అకాడమీ రాతపరీక్ష ఫలితాలు సెప్టెంబరు 26న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. సెప్టెంబరు 3న దేశవ్యాప్తంగా నిర్వహించిన ఎన్డీఏ రాతపరీక్షకు హాజరైన అభ్యర్ధులు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.


మొత్తం 395 ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షలో ఎంపికైన అభ్యర్థుల వివరాలను పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో యూపీఎస్సీ అందుబాటులో ఉంచింది. అభ్యర్థుల మార్కుల వివరాలను 15 రోజుల్లో వెల్లడించనున్నట్లు యూపీఎస్సీ తెలిపింది. అదేవిధంగా తర్వాతి దశలో ఇంటర్వ్యూలు పూర్తయిన 30 రోజుల్లోగా తుది ఎంపిక ఫలితాలను వెల్లడించనున్నట్లు యూపీఎస్సీ వెల్లడించింది.


పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఆర్మీ వెబ్‌సైట్‌లో 14రోజుల్లోగా రిజిస్టర్ చేసుకోవాలి. ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ వివరాలను అభ్యర్థులకు ఈమెయిల్ ద్వారా పంపుతారు.


UPSC NDA-2 2023 ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలంటే..?


🔰 ముందుగా యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in ఓపెన్‌ చెయ్యాలి.


🔰హోమ్‌పేజ్‌లో కనిపించే 'NDA & NA - II Written Results' ఆప్షన్‌పై క్లిక్ చెయ్యాలి. 


🔰 క్లిక్ చేయగానే ఫలితాలకు సంబంధించిన పీడీఎఫ్‌ కనిపిస్తుంది.


🔰  ఎన్డీఏ & ఎన్‌ఏ-2 ఫలితాలకు సంబంధించిన పీడీఎఫ్‌ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.


🔰  మీ పేరును చెక్‌ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ నంబర్/ రోల్ నంబర్‌తో చెక్ చేసుకోవాలి.



Direct Link


యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ(NDA) 152వ కోర్సు, నేవల్‌ అకాడమీ(NA) 114వ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ఏడాది మే నెలలో నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి మే 17 నుండి జూన్ 6 వరకు అవివాహిత పురుష/మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 395 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు 3న రాతపరీక్ష నిర్వహించింది. పరీక్షను రెండు సెషన్లలో  నిర్వహించింది. ఉదయం 10 గంటల నుండి మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి రెండో సెషన్ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్ష ద్వారా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ పరిధిలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. వచ్చే ఏడాది జులై 2 నుంచి కోర్సులు ప్రారంభంకానున్నాయి.


సందేహాలుంటే సంప్రదించవచ్చు..


🔰 అభ్యర్థులకు ధ్రవపత్రాల పరిశీలన, విద్యార్హతలు తదితర విషయాల్లో ఏమైనా సందేహాలుంటే  011-23385271/011- 23381125/011-23098543 ఫోన్  నెంబర్లలో ఉదయం 10:00 గంటల నుంచి  సాయంత్రం 5 గంటల మధ్య పనిదినాల్లో సంప్రదించవచ్చు. 


🔰 ఇంటర్వ్యూకు సంబంధించి అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 011-26175473, 011-23010097 నెంబర్లు లేదా joinindianarmy.nic.in for Army, Emai: officer-navy@nic.in ద్వారా సంప్రదించవచ్చు.


🔰 అదేవిధంగా నేవీ/నేవల్ అకాడమీకి సంబంధించిన సమస్యలపై  011-010231 Extn.7645/7646/7610 ఫోన్ నెంబర్లు లేదా joinindiannavy.gov.in  లేదా www.careerindianairforce.cdac.in ద్వారా సంప్రదించవచ్చు.


ALSO READ:


కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్-2024 నోటిఫికేషన్ వచ్చేసింది, పోస్టుల వివరాలు ఇలా
యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 'కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ ఎగ్జామినేషన్‌-2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా కేంద్ర గనుల శాఖ, జలవనరుల శాఖలో గ్రూప్‌-ఎ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.200 చెల్లించి అక్టోబరు 10లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న ప్రిలిమినరీ పరీక్ష; జూన్ 22న మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్ అడ్మిట్‌కార్డు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్ పరీక్ష అడ్మిట్ కార్డులను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ సెప్టెంబరు 26న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఐబీపీఎస్ క్లర్క్స్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్ పరీక్ష హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు/రూల్ నెంబర్, పాస్‌వర్డ్/పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు పొందవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబరు 7న క్లర్క్స్ మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షరోజు వరకు హాల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. 
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..