ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్‌వో)లో 577 ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) జులై 21 విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఫలితాలను విడుదల చేసింది. ఈపీఎఫ్‌వోలో ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ జులై 2న రాతపరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన అనంతరం ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. మొత్తం 577 ఖాళీల్లో 418 ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్/అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులుకాగా.. 159 అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టులు ఉన్నాయి.


ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్/అకౌంట్స్ ఆఫీసర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..


అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..


పోస్టుల వివరాలు..


మొత్తం ఖాళీల సంఖ్య: 577


1) ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్/అకౌంట్స్ ఆఫీసర్: 418 పోస్టులు


పోస్టుల కేటాయింపు: ఎస్సీ-57, ఎస్టీ-28, ఓబీసీ-78, ఈడబ్ల్యూఎస్-51, జనరల్-204. వీటిల్లో దివ్యాంగులకు 25 పోస్టులు కేటాయించారు.


2) అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్: 159 పోస్టులు


పోస్టుల కేటాయింపు: ఎస్సీ-25, ఎస్టీ-12, ఓబీసీ-38, ఈడబ్ల్యూఎస్-16, జనరల్-68. వీటిల్లో దివ్యాంగులకు 8 పోస్టులు కేటాయించారు.


నోటిఫికేషన్, పోస్టుల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


 ALSO READ:


ఐటీబీపీలో 458 కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులు, ఈ అర్హతలుండాలి!
భారత హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ), కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా 458 కానిస్టేబుల్ ఖాళీలను భర్తీ చేయనుంది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతోపాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా పోస్టుల భర్తీ చేపడతారు. అర్హులైన అభ్యర్థులు జూన్ 27 నుంచి జులై 26 వరకు ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఏఈ పోస్టుల భర్తీకి మళ్లీ పరీక్షలు, షెడ్యూలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని పలు ఇంజినీరింగ్‌ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి మళ్లీ పరీక్షలు నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. ఈ మేరకు జులై 20న పరీక్షల షెడ్యూలును విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. అక్టోబర్‌ 18 నుంచి 20 వరకు అసిస్టెంట్ ఇంజినీర్ కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్ష(సీబీఆర్‌టీ)లు నిర్వహించనున్నారు. వీటిలో అక్టోబరు 18, 19 తేదీల్లో సివిల్ ఇంజినీరింగ్ పోస్టులకు; అక్టోబరు 20న మెకానికల్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్‌ & ఎలక్ట్రానిక్స్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలో అభ్యర్థుల మార్కులను నార్మలైజేషన్ విధానంలో లెక్కించనున్నారు.
మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి..


బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 400 ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే!
పుణె ప్రధాన కేంద్రంగా గల బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో ఆఫీసర్ స్కేల్ 2, 3 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 400 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ లేదా సీఏ, సీఎంఏ, సీఎఫ్‌ఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేపుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జులై 25 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..


Join Us on Telegram: https://t.me/abpdesamofficial