Central Armed Police Forces (ACs) Examination 2024: కేంద్ర సాయుధ బలగాలైన బీఎస్‌ఎఫ్‌ (BSF), సీఆర్‌పీఎఫ్‌ (CRPF), సీఐఎస్‌ఎఫ్‌ (CISF), ఐటీబీపీ (ITBP), సశస్త్ర సీమాబల్ (SSB) ద‌ళాల్లో అసిస్టెంట్ క‌మాండెంట్ పోస్టుల భ‌ర్తీకి 'సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (అసిస్టెంట్ కమాండెంట్) ఎగ్జామినేషన్‌-2024' నోటిఫికేష‌న్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏప్రిల్ 24న విడుద‌ల చేసింది. దీనిద్వారా మొత్తం 506 ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 24న ప్రారంభంకాగా.. మే 14 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.


డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు ఉన్న స్త్రీ, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 4న రాతపరీక్ష నిర్వహించనున్నారు. రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు తొలి సెషన్‌లో పేపర్-1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు. హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నంలో పరీక్ష నిర్వహిస్తారు.


వివరాలు...


* సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (అసిస్టెంట్ కమాండెంట్) ఎగ్జామినేషన్‌-2024


ఖాళీల సంఖ్య: 506 పోస్టులు


➥ బీఎస్‌ఎఫ్‌: 186 పోస్టులు


➥ సీఆర్‌పీఎఫ్‌: 120 పోస్టులు 


➥ సీఐఎస్‌ఎఫ్‌: 100 పోస్టులు


➥ ఐటీబీపీ: 58 పోస్టులు


➥ సశస్త్ర సీమాబల్: 42 పోస్టులు  


అర్హత: డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 


వయోపరిమితి: 01.08.2024 నాటికి 20 - 25 సంవత్సరాల మధ్య ఉండాలి.


దరఖాస్తు ఫీజు: రూ.200. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. 


రాతపరీక్ష విధానం: మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. 


➥ పేపర్-1: జనరల్ ఎబిలిటీ & ఇంటెలిజెన్స్‌‌కు 250 మార్కులు ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలో (మల్టిపుల్ ఛాయిస్) ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు. 


➥ పేపర్-2: జనరల్ స్టడీస్, ఎస్సే, కాంప్రహెన్షన్‌కు 200 మార్కులు కేటాయించారు. అభ్యర్థులు హిందీ లేదా ఇంగ్లిష్ మాధ్యమాల్లో వ్యాసం రాయాల్సి ఉంటుంది. అయితే ప్రెసిస్ రైటింగ్, కాంప్రహెన్షన్, ఇతర కమ్యూనికేషన్స్/లాంగ్వేజ్ స్కిల్ మాత్రం ఇంగ్లిష్‌లోనే రాయాల్సి ఉంటుంది.


పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం.


ఫిజికల్ ఈవెంట్లు..
➥ అభ్యర్థులు 100 మీటర్లు పరుగు పూర్తిచేయాల్సి ఉంటుంది. పురుషులు 16 సెకండ్లలో, మహిళలు 18 సెకండ్లలో పరుగు పూర్తిచేయాలి.


➥ అదేవిధంగా 800 మీటర్ల పరుగుపందెం కూడా నిర్వహిస్తారు. పురుషులు 3 నిమిషాల 45 సెకండ్లలో, మహిళలు 4 నిమిషాల 45 సెకండ్లలో పరుగు పూర్తిచేయాల్సి ఉంటుంది.


➥ లాంగ్ జంప్‌లో మూడు అవకాశాలలో పురుషులు 3.5 మీటర్లు, మహిళలు 3.0 మీటర్లు జంప్ చేయాల్సి ఉంటుంది. 


]➥ ఇక పురుషులకు మాత్రమే షార్ట్‌పుట్ నిర్వహిస్తారు. అభ్యర్థులు మూడు అవకాశాల్లో 7.26 కిలోల బరువుండే గుండును 4.5 మీటర్ల వరకు విసరాల్సి ఉంటుంది.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24.04.2024.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 14.05.2024.


➥ Pay by Cash విధానంలో ఫీజు చెల్లించడానికి చివరితేది: 13.05.2024. (23.59 hours)


➥ ఆన్‌లైన్ విధానంలో ఫీజు చెల్లించడానికి చివరితేది: 14.05.2024. (18.00 hours)


➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 15.05.2024 - 21.05.2024.


➥ రాతపరీక్ష తేదీ: 04.08.2024. 


Notification


Online Application


Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..