UCSL Recruitment: కర్ణాటక రాష్ట్రం మాల్పేలోని ఉడిపి కొచ్చిన్ షిప్‌యార్డు లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 16 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా (మెకానికల్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్), డిగ్రీ (ఆర్ట్స్/ కెమిస్ట్రీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జులై 12 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 16
* సూపర్‌వైజర్ పోస్టులు
విభాగాలవారీగా ఖాళీలు..
➤ సూపర్‌వైజర్(మెకానికల్): 07 పోస్టులు
అర్హత: స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుండి మెకానికల్ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా లేదా స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి వెల్డింగ్ ట్రేడ్ లేదా షీట్ మెటల్ వర్కర్ ట్రేడ్ లేదా బెంచ్ ఫిట్టర్ లేదా ఫిట్టర్ ట్రేడ్ లేదా ప్లంబర్ ట్రేడ్‌లో ఐటీఐ (NTC) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 12.07.2024 నాటికి 45 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు 5 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
➤ సూపర్‌వైజర్(ఎలక్ట్రికల్): 05 పోస్టులు
అర్హత: స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుండి ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా లేదా రాష్ట్ర గుర్తింపు పొందిన ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్ ట్రేడ్‌లో ఐటీఐ (NTC) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 12.07.2024 నాటికి 45 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు 5 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
➤ సూపర్‌వైజర్(పెయింటింగ్): 02 పోస్టులు
అర్హత: కెమిస్ట్రీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి ఏదైనా ఇంజినీరింగ్ శాఖలో మూడేళ్ల డిప్లొమాతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 12.07.2024 నాటికి 45 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు 5 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
➤ సూపర్‌వైజర్(స్కాఫ్‌ఫోల్డింగ్): 01 పోస్టు
అర్హత: స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుండి మెకానికల్ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా లేదా స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి వెల్డింగ్ ట్రేడ్ లేదా షీట్ మెటల్ వర్కర్ ట్రేడ్ లేదా బెంచ్ ఫిట్టర్ లేదా ఫిట్టర్ ట్రేడ్ లేదా ప్లంబర్ ట్రేడ్‌లో ఐటీఐ (NTC) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 12.07.2024 నాటికి 45 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు 5 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
➤ సూపర్‌వైజర్(హెచ్‌ఆర్): 01 పోస్టు
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం 60% మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ (కళలు (ఫైన్ ఆర్ట్స్ లేదా పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ కాకుండా) లేదా సైన్స్ లేదా కామర్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్, లేదా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 12.07.2024 నాటికి 45 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు 5 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.300, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపులో మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, ప్రాక్టికల్ టెస్ట్, పని అనుభవం తదితరాల ఆధారంగా.
జీతం: మొదటి సంవత్సరం రూ.40,650, రెండవ సంవత్సం రూ.41,490, మూడవ సంవత్సరం రూ.42,355, నాల్గొవ సంవత్సరం రూ.43,246, ఐదొవ సంవత్సరం రూ.44,164.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12.07.2024.