ఝార్ఖండ్ రాష్ట్రం జాదుగూడ మైన్స్‌లోని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వైండింగ్ ఇంజిన్ డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. పదోతరగతి అర్హతతోపాటు వైండింగ్ ఇంజిన్ డ్రైవర్ సర్టిఫికెట్‌ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 3 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులను జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగ భర్తీ చేపట్టనున్నారు. ట్రేడ్ టెస్టు ఆధారంగా ఎంపికలు ఉంటాయి. 


వివరాలు..


* వైండింగ్ ఇంజిన్ డ్రైవర్: 12 పోస్టులు


అర్హత: పదోతరగతి అర్హత, వైండింగ్ ఇంజిన్ డ్రైవర్ సర్టిఫికెట్‌తో పాటు మూడు సంవత్సరాల పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 62 సంవత్సరాలు మించకూడదు.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాలి. అభ్యర్థులు తమ పుట్టినతేదీ, అర్హతలు, అనుభవం, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడీ, ప్రస్తుత/శాశ్వత చిరునామా, గ్రామం, పోస్టాఫీసు, జిల్లా, పిన్‌కోడ్, కులం, పాస్‌పోర్ట్ సైజు ఫొటోతో కూడిన రెజ్యూమ్‌/అప్లికేషన్‌తోపాటు, సర్టిఫికేట్ల అటెస్టేషన్ కాపీలను జతచేసి సంబంధిత చిరునామాకు నిర్ణీత గడువులోగా చేరేలా స్పీడ్ పోస్టు/ కొరియర్ ద్వారా పంపాలి. 


ఎంపిక విధానం: ట్రేడ్ టెస్టు ఆధారంగా ఎంపిక చేస్తారు.


జీత భత్యాలు: నెలకు రూ.37,531.


చిరునామా: 
General Manager(I/P&IRs/CP), 
Uranium Corporation of India Limited, 
PO: Jaduguda Mines, 
Dist: East Singhbhum, Jharkhand – 832 102. 


దరఖాస్తుకు చివరితేదీ: 31.01.2023.


Notification
Website


Also Read:


సీఆర్‌పీఎఫ్‌లో 1458 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్, ఈ అర్హతలుండాలి!
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1458 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో 143 అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ASI - స్టెనోగ్రాఫర్) పోస్టులు, 1315 హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్) పోస్టులు ఉన్నాయి. ఇంటర్ అర్హత ఉన్న యువతీయువకులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల భ ఆన్‌లైన్ దరఖాస్తులు జనవరి 4న ప్రారంభమై 25న ముగియనుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్‌లో ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే!
ముంబయిలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ ఆఫీసర్స్ కేటగిరీలో ఆఫీసర్ (మార్కెటింగ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీని ద్వారా మొత్తం 18 పోస్టులను భర్తీచేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీఏ లేదా ఎంఎంఎస్ ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు ఉంటాయి. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 9 నుంచి 29 వరకు ఆన్‌లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


ఎయిమ్స్‌లో 88 సీనియర్‌ రెసిడెంట్ ఖాళీలు, వివరాలు ఇలా!
భువనేశ్వర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ డీఎన్‌బీ/ ఎంఎస్ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మెయిల్ ద్వారా జనవరి 14, స్పీడ్ పోస్టు ద్వార 19వరకు దరఖాస్తుచేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...