కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అన్ని రంగాలు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాయి. అక్కడ పరిస్థితులు మునుపటి స్థాయికి చేరుకుంటున్నాయి. దీంతో 2023లో జాబ్ మార్కెట్ జోరు అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆ దేశంలోని ప్రముఖ రిక్రూట్‌మెంట్ కంపెనీ మైఖేల్ పేజ్ ప్రాంతీయ డైరెక్టర్ జోన్ ఈడ్ తెలిపారు. వచ్చే ఏడాది యూఏఈలో డిమాండ్ ఉండే ఉద్యోగాలు, జీతాల వివరాలతో జాబ్స్ గైడ్‌ను విడుదల చేశారు. దీనిద్వారా నిరుద్యోగులు ఓ అంచనాకు రావచ్చని జోన్ పేర్కొన్నారు. యూఏఈలో డిమాండ్ ఉన్న ఉద్యోగాలు, వాటికి కావాల్సిన నైపుణ్యం, అనుభవం, జీతాల శ్రేణిని ఈ జాబ్ గైడ్ సవివరంగా తెలియజేస్తుందని ఆయన స్పష్టం చేశారు. మైఖేల్ జాబ్ గైడ్ అంచనా ప్రకారం యూఏఈలో డిమాండ్ ఉన్న జాబ్స్, జీతభత్యా గురించి ఓ లుక్కేద్దాం..
1) బ్యాంకింగ్- ఫైనాన్షియల్ సర్వీసెస్
పొజిషన్: ఇన్వెస్ట్‌మెంట్స్- సీనియర్ అనలిస్ట్/అసోసియేట్/సీనియర్ అసోసియేట్ గ్రోత్ వెంచర్ క్యాపిటల్ అండ్ ప్రైవేట్ ఈక్విటీ, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్, ఫండ్ అకౌంటెంట్, ఇన్వెస్ట్‌మెంట్ రిలేషన్‌షిప్స్, ఫైనాన్స్ మేనేజర్-ఇన్వెస్ట్‌మెంట్, మార్కెట్ రిస్క్ మేనేజర్.
పే స్కేల్: (Note: ఇండియన్ కరెన్సీలో 1 దిర్హమ్, రూ. 22.14 సమానం)
➥ హోల్‌సేల్ బ్యాంకింగ్ హెడ్: 98 వేల దిర్హమ్స్ నుంచి లక్ష 77 వేల దిర్హమ్స్ వరకు.
➥ సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్: 35వేల దిర్హమ్స్ నుంచి 50 వేల దిర్హమ్స్ వరకు.
➥ రిలేషన్‌షిప్ ఆఫీసర్/అసిస్టెంట్ రిలేషన్‌షిప్ మేనేజర్: 15 వేల దిర్హమ్స్ నుంచి 25వేల దిర్హమ్స్ వరకు.
2) రిటైల్ బ్యాంకింగ్
➥ కస్టమర్ బ్యాంకింగ్ హెడ్(ఈపీవీ): 95 వేల దిర్హమ్స్ నుంచి 2 లక్షల దిర్హమ్లు వరకు.
➥ మేనేజర్ ఉత్పత్తులు/అమ్మకాలు: 25 వేల దిర్హమ్స్ నుంచి 40 వేల దిర్హమ్స్ వరకు.
3) ఇన్స్యూరెన్స్
➥ మేనేజింగ్ డైరెక్టర్: 50 వేల దిర్హమ్స్ నుంచి లక్ష 60 వేల దిర్హమ్స్ వరకు.
➥ సీనియర్ అసోసియేట్: 20 వేల దిర్హమ్స్ నుంచి 40 వేల దిర్హమ్స్ వరకు.
4) ఫినాన్స్ అండ్ అకౌంటింగ్ (ఇన్వెస్ట్‌మెంట్/ఫండ్స్)
➥ సీఎఫ్ఓ: 75వేల దిర్హమ్స్ నుంచి లక్ష 70వేల దిర్హమ్స్ వరకు.
➥ సీనియర్ అకౌంటెంట్: 16వేల దిర్హమ్స్ నుంచి 26వేల దిర్హమ్స్ వరకు.
➥ అకౌంటెంట్: 14వేల దిర్హమ్స్ నుంచి 23వేల దిర్హమ్స్ వరకు.
5) డేటా- విశ్లేషణ
పొజిషన్: డేటా మేనేజ్‌మెంట్ అండ్ గవర్నెన్స్ ఎక్స్‌పర్ట్స్, మోడర్న్ అనాలిసిస్/ స్టాటిస్టిక్స్, డేటా ఇంజినీరింగ్ ఎక్స్‌పర్ట్స్, డేటా అనలిటిక్స్ అండ్ సైన్స్ అంతటా సీనియర్ లీడర్‌షిప్, డేటా ప్లానింగ్ అండ్ అడ్వయిజర్.
పేస్కేలు:
➥ చీఫ్ డేటా ఆఫీసర్: 80 వేల దిర్హమ్స్ నుంచి లక్ష 77వేల దిర్హమ్స్ వరకు.
➥ చీఫ్ డైరెక్టర్ ఆఫ్ డేటా సైన్స్: 55 వేల దిర్హమ్స్ నుంచి 73వేల దిర్హమ్స్ వరకు.
➥ డేటా అనలిటిక్ మేనేజర్: 95 వేల దిర్హమ్స్ నుంచి 2 లక్షల దిర్హమ్స్ వరకు.
➥ డిజిటల్/ప్రొడక్ట్ అనలిటిక్స్ మేనేజర్: 40 వేల దిర్హమ్స్ నుంచి 60 వేల దిర్హమ్స్ వరకు.
➥ డేటా ఆర్కిటెక్ట్స్: 14 వేల దిర్హమ్స్ నుంచి 24 వేల దిర్హమ్స్ వరకు.
➥ బిగ్ డేటా ఇంజినీర్: 35 వేల దిర్హమ్స్ నుంచి 75వేల దిర్హమ్స్ వరకు.
6) డిజిటల్
పొజిషన్: ఉత్పత్తుల అభివృద్ధి, వినియోగదారు అనుభవ రూపకల్పన, డిజిటల్ నాయకత్వం, ఈ-కామర్స్ నిపుణులు, పర్ఫామెన్స్ మార్కెటింగ్.
పేస్కేలు:
➥ డిజిటల్ మార్కెటింగ్ హెడ్: 40 వేల దిర్హమ్స్ నుంచి 60 వేల దిర్హమ్స్ వరకు.
➥ డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్: 28 వేల దిర్హమ్స్ నుంచి 38 వేల దిర్హమ్స్ వరకు.
➥ అడ్వర్టైజింగ్ ఆపరేషన్స్ మేనేజర్: 15 వేల దిర్హమ్స్ నుంచి 25 వేల దిర్హమ్స్ వరకు.
➥ ఎస్ఈఓ/ఎస్ఈఎం మేనేజర్: 18 వేల దిర్హమ్స్ నుంచి 28 వేల దిర్హమ్స్ వరకు.
➥ డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్: 12 వేల దిర్హమ్స్ నుంచి 18 వేల దిర్హమ్స్ వరకు.
➥ యూఎక్స్ డైరెక్టర్: 50 వేల దిర్హమ్స్ నుంచి 70 వేల దిర్హమ్స్ వరకు.
➥ విజువల్ డిజైనర్: 15 వేల దిర్హమ్స్ నుంచి 25 వేల దిర్హమ్స్ వరకు.
➥ చీఫ్ డిజిటల్ ఆఫీసర్: 60 వేల దిర్హమ్స్ నుంచి 90 వేల దిర్హమ్స్ వరకు.
➥ ఈ-కామర్స్ మేనేజర్: 25 వేల దిర్హమ్స్ నుంచి 35 వేల దిర్హమ్స్ వరకు.
7) ఇంజినీరింగ్ అండ్ మ్యానుఫాక్చరింగ్
పొజిషన్: చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, జనరల్ మేనేజర్, ఆర్ అండ్ డీ మేనేజర్, సస్టైనబిలిటీ మేనేజర్, ప్లాంట్ మేనేజర్.
పే స్కేల్:
➥ వైస్ ప్రెసిడెంట్: 90వేల దిర్హమ్స్ నుంచి లక్ష 50వేల దిర్హమ్స్ వరకు.
➥ సీఈఓ: 80వేల దిర్హమ్స్ నుంచి లక్ష 20వేల దిర్హమ్స్ వరకు.
➥ సీఓఓ: 70వేల దిర్హమ్స్ నుంచి 1లక్ష దిర్హమ్స్ వరకు.
➥ మేనేజింగ్ డైరెక్టర్: 65వేల దిర్హమ్స్ నుంచి 1లక్ష దిర్హమ్స్ వరకు.
➥ జనరల్ మేనేజర్: 60వేల దిర్హమ్స్ నుంచి 90వేల దిర్హమ్స్ వరకు.
➥ ప్రాజెక్ట్ డైరెక్టర్: 45వేల దిర్హమ్స్ నుంచి 90వేల దిర్హమ్స్ వరకు.
➥ ప్రాజెక్ట్ మేనేజర్: 35వేల దిర్హమ్స్ నుంచి 45వేల దిర్హమ్స్ వరకు.
➥ ప్రాజెక్ట్ ఇంజనీర్: 10వేల దిర్హమ్స్ నుంచి 25వేల దిర్హమ్స్ వరకు.
➥ డిజైన్ మేనేజర్: 15వేల దిర్హమ్స్ నుంచి 30వేల దిర్హమ్స్ వరకు.
8) ఫినాన్స్ అండ్ అకౌంటింగ్
పొజిషన్: కమర్షియల్ ఫినాన్స్ మేనేజర్/ఎఫ్‌పీ&ఏ మేనేజర్స్, కంప్లియన్స్/రిస్క్/ఇంటర్నల్ ఆడిట్ మేనేజర్, ట్యాక్స్ మేనేజర్స్, బిజినెస్ కంట్రోలర్స్/ఫినాన్స్ కంట్రోలర్స్, చీఫ్ ఫినాన్స్ ఆఫీసర్స్/ఫినాన్స్ డైరెక్టర్.
పే స్కేల్:
➥ గ్రూప్/రిజినల్ సీఎఫ్ఓ: 70వేల దిర్హమ్స్ నుంచి 2లక్షల దిర్హమ్స్ వరకు.
➥ సీఎఫ్ఓ: 69వేల దిర్హమ్స్ నుంచి లక్ష 20వేల దిర్హమ్స్ వరకు.
➥ ఎఫ్‌పీ&ఏ డైరెక్టర్: 45వేల దిర్హమ్స్ నుంచి 70వేల దిర్హమ్స్ వరకు.
➥ ఫినాన్స్ డైరెక్టర్: 50వేల దిర్హమ్స్ నుంచి 80వేల దిర్హమ్స్ వరకు.
➥ ఎఫ్‌పీ&ఏ మేనేజర్: 27వేల దిర్హమ్స్ నుంచి 40వేల దిర్హమ్స్ వరకు.
➥ క్రెడిట్ మేనేజర్: 28వేల దిర్హమ్స్ నుంచి 50వేల దిర్హమ్స్ వరకు.
➥ జనరల్ లెడ్జర్ అకౌంటెంట్: 12వేల దిర్హమ్స్ నుంచి 22వేల దిర్హమ్స్ వరకు.
➥ పేరోల్ మేనేజర్: 18వేల దిర్హమ్స్ నుంచి 28వేల దిర్హమ్స్ వరకు.
➥ చీఫ్ ఆడిట్ ఆఫీసర్: 53వేల దిర్హమ్స్ నుంచి లక్ష 40వేల దిర్హమ్స్ వరకు.
➥ ఆడిట్ మేనేజర్: 25వేల దిర్హమ్స్ నుంచి 45వేల దిర్హమ్స్ వరకు.
➥ ట్యాక్స్ డైరెక్టర్: 35వేల దిర్హమ్స్ నుంచి 60వేల దిర్హమ్స్ వరకు.
➥ సీనియర్ ట్యాక్స్ అనలిస్ట్/అసోసియేట్: 25వేల దిర్హమ్స్ నుంచి 35వేల దిర్హమ్స్ వరకు.
9) హెల్త్‌కేర్ అండ్ లైఫ్ సైన్సెస్
పొజిషన్: నర్సులు, డాక్టర్లు, వైద్య శాస్త్రవేత్తలు, సేల్స్ రిప్రజెంటేటివ్స్, ప్రాంతీయ సేల్స్ మేనేజర్, ప్రాంతీయ మార్కెటింగ్ మేనేజర్
పే స్కేల్:
➥ డాక్టర్(సర్జన్): 80 వేల దిర్హమ్స్ నుంచి లక్ష 60వేల దిర్హమ్స్ వరకు.
➥ వైద్యుడు(కన్సల్టెంట్): 40వేల దిర్హమ్స్ నుంచి 1లక్ష దిర్హమ్స్ వరకు.
➥ వైద్యుడు(నిపుణుడు): 25వేల దిర్హమ్స్ నుంచి 40వేల దిర్హమ్స్ వరకు.
➥ నర్సు: 6 వేల దిర్హమ్స్ నుంచి 15వేల దిర్హమ్స్ వరకు.
➥ వైద్య శాస్త్రవేత్త: 30వేల దిర్హమ్స్ నుంచి 50వేల దిర్హమ్స్ వరకు.
➥ జనరల్ సేల్స్ మేనేజర్: 60వేల దిర్హమ్స్ నుంచి లక్ష 10వేల దిర్హమ్స్ వరకు.
➥ ప్రాంతీయ సేల్స్ డైరెక్టర్: 50వేల దిర్హమ్స్ నుంచి 90వేల దిర్హమ్స్ వరకు.
➥ విక్రయ ప్రతినిధి: 15వేల దిర్హమ్స్ నుంచి 25వేల దిర్హమ్స్ వరకు.
➥ చీఫ్ మార్కెంటింగ్ ఆఫీసర్ (సీఎంఓ): 65వేల దిర్హమ్స్ 1లక్ష దిర్హమ్స్ వరకు.
➥ మార్కెటింగ్ డైరెక్టర్: 45వేల దిర్హమ్స్ నుంచి 80వేల దిర్హమ్స్ వరకు.
➥ ప్రాంతీయ మార్కెటింగ్ మేనేజర్: 30వేల దిర్హమ్స్ నుంచి 50వేల దిర్హమ్స్ వరకు.
10) మానవ వనరులు
పొజిషన్: టాలెంట్ డెవలప్‌మెంట్ నిపుణులు, ప్రాంతీయ హెచ్ఆర్ మేనేజర్, హెచ్ఆర్ వ్యాపార భాగస్వాములు
పే స్కేల్:
➥వీపీ హెచ్ఆర్/సీహెచ్ఆర్ఓ: 65వేల దిర్హమ్స్ నుంచి 90వేల దిర్హమ్స్ వరకు.
➥ హెచ్ఆర్ డైరెక్టర్: 55వేల దిర్హమ్స్ నుంచి 78వేల దిర్హమ్స్ వరకు.
➥ హెచ్ఆర్ మేనేజర్: 30వేల దిర్హమ్స్ నుంచి 45వేల దిర్హమ్స్ వరకు.
➥ టాలెంట్ అక్విజిషన్ మేనేజర్: 33వేల దిర్హమ్స్ నుంచి 45వేల దిర్హమ్స్ వరకు.
➥ టాలెంట్ అక్విజిషన్ స్పెషలిస్ట్: 20వేల దిర్హమ్స్ నుంచి 28వేల దిర్హమ్స్ వరకు.
11) రిటైల్
పొజిషన్లు: మార్కెటింగ్ మేనేజర్లు, స్టోర్ నిర్వాహకులు, శిక్షకులు, సేల్స్ డైరెక్టర్స్, రిటైల్ డైరెక్టర్స్.
పే స్కేల్:
➥ మేనేజింగ్ డైరెక్టర్/జనరల్ మేనేజర్: 65వేల దిర్హమ్స్ నుంచి 1లక్ష దిర్హమ్స్ వరకు.
➥ రిటైల్ డైరెక్టర్: 35వేల దిర్హమ్స్ నుంచి 60వేల దిర్హమ్స్ వరకు.
➥ సేల్స్ డైరెక్టర్: 35వేల దిర్హమ్స్ నుంచి 60వేల దిర్హమ్స్ వరకు.
➥ సేల్స్ మేనేజర్: 20వేల దిర్హమ్స్ నుంచి 35వేల దిర్హమ్స్ వరకు.
➥ స్టోర్ మేనేజర్: 30వేల దిర్హమ్స్ నుంచి 50వేల దిర్హమ్స్ వరకు.
➥ మేనేజింగ్ డైరెక్టర్/జనరల్ మేనేజర్: 65వేల దిర్హమ్స్ నుంచి 1లక్ష దిర్హమ్స్
➥ రిటైల్ డైరెక్టర్: 35వేల దిర్హమ్స్ నుంచి 60వేల దిర్హమ్స్
➥ సేల్స్ డైరెక్టర్: 35వేల దిర్హమ్స్ నుంచి 60వేల దిర్హమ్స్
➥ సేల్స్ మేనేజర్: 20వేల దిర్హమ్స్ నుంచి 35వేల దిర్హమ్స్
➥ స్టోర్ మేనేజర్: 30వేల దిర్హమ్స్ నుంచి 50వేల దిర్హమ్స్
➥ స్టోర్ మేనేజర్: 15 వేల దిర్హమ్స్ నుంచి 35వేల దిర్హమ్స్
➥ సేల్స్ అసోసియేట్: 12 వేల దిర్హమ్స్ నుంచి 15వేల దిర్హమ్స్
➥ సేల్స్ అసోసియేట్: 7 వేల దిర్హమ్స్ నుంచి 15వేల దిర్హమ్స్
➥ మార్కెటింగ్ డైరెక్టర్: 40 వేల దిర్హమ్స్ నుంచి 70 వేల దిర్హమ్స్
➥ మార్కెటింగ్ మేనేజర్: 30 వేల దిర్హమ్స్ నుంచి 45 వేల దిర్హమ్స్
➥ పీఆర్ మేనేజర్: 20 వేల దిర్హమ్స్ నుంచి 45 వేల దిర్హమ్స్
➥ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్: 18 వేల దిర్హమ్స్ నుంచి 24వేల దిర్హమ్స్
12) ప్రొక్యూర్ మెంట్ అండ్ సప్లయ్ చైన్..
➤ డిమాండ్ అండ్ సప్లయ్ ప్లానర్
➤ ఆర్డర్ - క్యాష్ మేనేజర్
➤సప్లయర్ రిలేషన్‌షిప్ మేనేజర్
➤ కేటగిరీ మేనేజర్
➤ప్రొక్యూర్‌మెంట్ అనలిస్ట్
పేస్కేల్:
➥ చీఫ్ ప్రొక్యూర్‌మెంట్ ఆఫీసర్: 70 వేల దిర్హమ్స్ నుంచి లక్షా 50వేల దిర్హమ్స్ వరకు.
➥ప్రొక్యూర్‌మెంట్ మేనేజర్: 25 వేల దిర్హమ్స్ నుంచి 35 వేల దిర్హమ్స్ వరకు.
➥ బయ్యర్/ప్రొక్యూర్‌మెంట్ స్పెషలిస్ట్/పర్చేసింగ్ ఆఫీసర్: 13 వేల దిర్హమ్స్ నుంచి 18 వేల దిర్హమ్స్ వరకు.
➥ అసిస్టెంట్ బయ్యర్: 8 వేల దిర్హమ్స్ నుంచి 13 వేల దిర్హమ్స్ వరకు.
➥ సప్లయ్ ప్లానింగ్ మేనేజర్: 20 వేల దిర్హమ్స్ నుంచి 30 వేల దిర్హమ్స్ వరకు.
➥ లాజిస్టిక్స్ మేనేజర్: 18 వేల దిర్హమ్స్ నుంచి 30 వేల దిర్హమ్స్ వరకు.
➥ ఫ్లీట్/ట్రాన్స్‌పొర్టేషన్ మేనేజర్: 18 వేల దిర్హమ్స్ నుంచి 30 వేల దిర్హమ్స్ వరకు.
➥ వేర్‌హౌజ్ మేనేజర్: 15 వేల దిర్హమ్స్ నుంచి 28 వేల దిర్హమ్స్ వరకు.
➥ వేర్‌హౌజ్ సూపర్‌వైజర్: 15 వేల దిర్హమ్స్ నుంచి 20 వేల దిర్హమ్స్ వరకు.
14) ప్రాపర్టీ & కన్‌స్ట్రక్షన్
➤ ప్రాజెక్ట్ డైరెక్టర్
➤ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్
➤ రియల్ ఎస్టేట్ అసెట్ మేనేజ్‌మెంట్
➤ లీసింగ్ అండ్ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్
➤ ఫెసిలిటీస్ మేనేజ్‌మెంట్
పేస్కేలు:
➥ జనరల్ మేనేజర్: 65 వేల దిర్హమ్స్ నుంచి 1 లక్ష దిర్హమ్స్ వరకు.
➥ ప్రాజెక్ట్ డైరెక్టర్: 60 వేల దిర్హమ్స్ నుంచి 90 వేల దిర్హమ్స్ వరకు.
➥ ప్రాజెక్ట్ మేనేజర్: 40 వేల దిర్హమ్స్ నుంచి 55 వేల దిర్హమ్స్ వరకు.
➥ ఫెసిలిటీస్ మేనేజర్: 30 వేల దిర్హమ్స్ నుంచి 50 వేల దిర్హమ్స్ వరకు.
➥ అసెట్ మేనేజర్: 40 వేల దిర్హమ్స్ నుంచి 50 వేల దిర్హమ్స్ వరకు.
➥ లీసింగ్ మేనేజర్: 30 వేల దిర్హమ్స్ నుంచి 55 వేల దిర్హమ్స్ వరకు.
➥ సివిల్ ఇంజినీర్: 15 వేల దిర్హమ్స్ నుంచి 25 వేల దిర్హమ్స్ వరకు.
➥ ఆర్కిటెక్ట్: 15 వేల దిర్హమ్స్ నుంచి 30 వేల దిర్హమ్స్ వరకు.
15) సేల్స్ అండ్ మార్కెటింగ్(కన్జ్యూమర్)
➤ ట్రేడ్ మార్కెటింగ్ మేనేజర్
➤ బ్రాండ్ మేనేజర్
➤ బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్/రీజినల్ సేల్స్ మేనేజర్
➤ హెడ్ ఆఫ్ సేల్స్
పేస్కేల్:
➥జనరల్ మేనేజర్: 60 వేల దిర్హమ్స్ నుంచి లక్ష 20 వేల దిర్హమ్స్ వరకు.
➥ వీపీ ఆఫ్ సేల్స్/కమర్షియల్ డైరెక్టర్: 65 వేల దిర్హమ్స్ నుంచి 1లక్ష దిర్హమ్స్ వరకు.
➥హెడ్ ఆఫ్ సేల్స్/సేల్స్ డైరెక్టర్: 45 వేల దిర్హమ్స్ నుంచి 70 వేల దిర్హమ్స్ వరకు.
➥ రీజినల్ సేల్స్ మేనేజర్/జీసీసీ సేల్స్ మేనేజర్/ బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్: 30 వేల దిర్హమ్స్ నుంచి 55 వేల దిర్హమ్స్ వరకు.
➥ కీ అకౌంట్ మేనేజర్/నేషనల్ అకౌంట్ మేనేజర్: 20 వేల దిర్హమ్స్ నుంచి 35 వేల దిర్హమ్స్ వరకు.
➥ కీ అకౌంట్ ఎగ్జిక్యూటివ్: 12 వేల దిర్హమ్స్ నుంచి 20 వేల దిర్హమ్స్ వరకు.
➥ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్: 65 వేల దిర్హమ్స్ నుంచి లక్ష 20 వేల దిర్హమ్స్ వరకు.
➥ మార్కెటింగ్ మేనేజర్: 35 వేల దిర్హమ్స్ నుంచి 55 వేల దిర్హమ్స్ వరకు.
➥ సీనియర్ బ్రాండ్ మేనేజర్: 30 వేల దిర్హమ్స్ నుంచి 45 వేల దిర్హమ్స్ వరకు.
➥ బ్రాండ్ మేనేజర్: 20 వేల దిర్హమ్స్ నుంచి 33 వేల దిర్హమ్స్ వరకు.
➥ అసిస్టెంట్ బ్రాండ్ మేనేజర్/మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్: 14 వేల దిర్హమ్స్ నుంచి 22 వేల దిర్హమ్స్ వరకు.
16) టెక్నాలజీ
➤ సాఫ్ట్‌వేర్ డెవలపర్
➤ ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్
➤ ఎంటర్‌ప్రైజ్ ఆర్కిటెక్ట్
➤ ఈఆర్‌పీ కన్సల్టెంట్
➤సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్
పేస్కేల్:
➥ ఐటీ డైరెక్టర్: 50 వేల దిర్హమ్స్ నుంచి 80 వేల దిర్హమ్స్ వరకు.
➥ హెడ్ ఆఫ్ ఐటీ: 40 వేల దిర్హమ్స్ నుంచి 70 వేల దిర్హమ్స్ వరకు.
➥ ఐటీ మేనేజర్: 20 వేల దిర్హమ్స్ నుంచి 40 వేల దిర్హమ్స్ వరకు.
➥ సైబర్ సెక్యూరిటీ ఆర్కిటెక్ట్: 35 వేల దిర్హమ్స్ నుంచి 60వేల దిర్హమ్స్ వరకు.
➥ ఐటీ సెక్యూరిటీ మేనేజర్: 30 వేల దిర్హమ్స్ నుంచి 55 వేల దిర్హమ్స్ వరకు.
➥ ఐటీ సెక్యూరిటీ ఇంజినీర్: 20 వేల దిర్హమ్స్ నుంచి 40 వేల దిర్హమ్స్ వరకు.
➥ సెక్యూరిటీ అనలిస్ట్: 15 వేల దిర్హమ్స్ నుంచి 25 వేల దిర్హమ్స్ వరకు.
(Note: ఇండియన్ కరెన్సీలో 1 దిర్హమ్, రూ. 22.14 సమానం)