UAE providing job opportunities:  2  ఉద్యోగ అవకాశాల కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రపంచంలో అత్యంత ఆశాజనకమైన గమ్యస్థానంగా నిలిచిందని మాన్‌పవర్‌గ్రూప్ ఎంప్లాయ్‌మెంట్ ఔట్‌లుక్ సర్వే లోతేలింది.  ఈ సర్వే ప్రకారం  UAE  అసాధారణమైన నెట్ ఎంప్లాయ్‌మెంట్ ఔట్‌లుక్ (NEO) +48 శాతాన్ని సాధించింది, ఇది ప్రపంచ సగటు +24 శాతాన్ని బాగా మించిపోయింది.        

UAEలో 56 శాతం మంది కంపెనీల  యజమానులు తమ సిబ్బందిని విస్తరించాలని యోచిస్తున్నారు, కేవలం 8 శాతం మంది మాత్రమే సిబ్బందిని తగ్గించాలని భావిస్తున్నారు. యూఏఈలో    ట్రాన్స్‌పోర్ట్, లాజిస్టిక్స్ , ఆటోమోటివ్ రంగాల్లో అత్యధిక అవకాశాలు ఉన్నాయి.  +64 శాతం హైరింగ్ ఔట్‌లుక్‌తో ఉన్నట్లుగా నివేదిక వెల్లడించింది.   సప్లై చైన్, స్మార్ట్ మొబిలిటీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రోల్స్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంది. కన్స్యూమర్ గూడ్స్ , సర్వీసెస్ రంగంలో +60 శాతం ఔట్‌లుక్ ఉంది. రిటైల్ , సేవల రంగంలో  పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయి.  ఎనర్జీ,  యుటిలిటీస్ రగంలో +62  శాతం అవకాశాలు ఉన్నాయి.  ఫైనాన్స్ & రియల్ ఎస్టేట్ , *హెల్త్‌కేర్ & లైఫ్ సైన్సెస్   రంగాలు కూడా గణనీయమైన హైరింగ్ వృద్ధిని చూపుతున్నాయి. కరోనా అనంతర పరిస్థితులు, ఎనర్జీ రంగం నుంచి పెట్టుబడులను వివిధ రంగాలకు విస్తరిచడం తో ఉద్యోగావకాశాలు పెరుగుతున్నట్లుగా అంచనా వేస్తున్నారు.  Now Available: Q3 2025 UAE Employment Outlook

 ఏప్రిల్ 2025 PMI డేటా ప్రకారం, UAE   నాన్-ఆయిల్ రంగం వరుసగా 11 నెలల పాటు విస్తరించింది.   ఒక సంవత్సరంలో అత్యంత వేగవంతమైన ఉద్యోగ వృద్ధిని నమోదు చేసింది. దుబాయ్   D33 వ్యూహం ,  జాతీయ AI పెట్టుబడులు అధిక నైపుణ్యం కలిగిన నిపుణులకు డిమాండ్‌ను పెంచుతున్నాయి.  ఎమిరాటైజేషన్ లక్ష్యాలు,  స్థానిక టాలెంట్ విధానాలు, స్థానిక అనుమతులు,  జాతీయ కోటా ఇంటిగ్రేషన్ అవసరమైన రోల్స్‌లో  ఉద్యోగులను విస్తృతంగా నియమించుకుంటున్నారు.                                            

జీవన వ్యయం పెరుగుతున్న కారణంగా జీతాలు కూడా ఎక్కువగానే ఆఫర్ చే్సతున్నారు. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ గంటలు , రిమోట్/హైబ్రిడ్ ఆప్షన్స్, విద్య ,  చైల్డ్‌కేర్ అలవెన్సులు,  మానసిక ఆరోగ్యం ,  వెల్‌నెస్ ప్రోగ్రామ్‌లు,  అప్‌స్కిల్లింగ్ ,శిక్షణా కార్యక్రమాలు వంటి బెనిఫిట్స్ ఉద్యోగుల దీర్ఘకాల జీవన లక్ష్యాలకు అనుగుణంగా ఉంటాయి. AI ,  గ్రీన్ టెక్నాలజీలలో కొత్త రోల్స్‌కు డిమాండ్ పెరుగుతోంది.  31 శాతం కంపెనీలు ఈ రంగాలలో విస్తరణను ఊహిస్తున్నాయి.  బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్, మార్కెటింగ్, HR  రంగాలలో కూడా నైపుణ్యం కలిగిన టాలెంట్‌కు డిమాండ్ ఉంది.