దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (TSSPDCL) జూనియర్ లైన్‌మెన్, అసిస్టెంట్ ఇంజినీర్(ఎలక్ట్రికల్) పోస్టుల పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా పీడీఎఫ్ రూపంలో ఉన్న తమ ఫలితాలను చూసుకోవచ్చు. ఏప్రిల్ 30న ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహించగా.. నెల రోజుల్లోపే ఫలితాలు ప్రకటించడం గమనార్హం. డైరెక్ట్ ప్రాతిపదికన 1,553 జూనియర్ లైన్‌మెన్, 48 అసిస్టెంట్ ఇంజినీర్(ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి టీఎస్ఎస్‌పీడీసీఎల్ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఏఈ ఫలితాల కోసం క్లిక్ చేయండి..
ఏఈ జనరల్ మెరిట్ జాబితా కోసం క్లిక్ చేయండి..
జూనియర్ లైన్‌మెన్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..
అసిస్టెంట్ ఇంజినీర్ రాతపరీక్ష ఫలితాలు..
జిల్లాలవారీగా జూనియర్ లైన్‌మెన్ రాతపరీక్ష ఫలితాలు..
➥ జూనియర్ లైన్‌మెన్ పోస్టుల వివరాలు...
సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్(టీఎస్‌ఎస్‌పీడీసీఎల్) పరిధిలో ఖాళీగా ఉన్న 1553 జూనియర్ లైన్‌మెన్ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 17న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. పదోతరగతితోపాటు ఐటీఐ (ఎలక్ట్రికల్ ట్రేడ్/వైర్‌మ్యాన్) లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు (ఎలక్ట్రికల్ ట్రేడ్) అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి మార్చి 8 నుంచి మార్చి 28 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు.
అభ్యర్థులకు ఏప్రిల్ 30న రాతపరీక్ష నిర్వహించారు. మొత్తం 80 మార్కులకు రాతపరీక్ష నిర్వహించారు. పరీక్షలో 80 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇచ్చారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. పరీక్షలో రెండు సెక్షన్లు (సెక్షన్-ఎ, సెక్షన్-బి) ఉన్నాయి. సెక్షన్-ఎ (కోర్ ఐటీఐ సబ్జెక్ట్) నుంచి 65 ప్రశ్నలు, సెక్షన్-బి (జనరల్ నాలెడ్జ్) నుంచి 15 ప్రశ్నలు ఇచ్చారు. పరీక్షకు రెండు గంటల సమయం కేటాయించారు. పరీక్షలో కనీస అర్హత మార్కులకు ఓసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40 % (40 మార్కులు), బీసీ అభ్యర్థులకు 35 % (35 మార్కులు), ఎస్సీ-ఎస్టీ అభ్యర్థులకు 30 % (30 మార్కులు) గా నిర్ణయించారు.
జూనియర్ లైన్‌మెన్ పోస్టులు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
➥ అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల వివరాలు..
సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్(టీఎస్‌ఎస్‌పీడీసీఎల్) పరిధిలో ఖాళీగా ఉన్న 48 అసిస్టెంట్ ఇంజినీర్(ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి ఫిబ్రవరి17న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థుల నుంచి ఫిభ్రవరి 23నుంచి మార్చి 15 వరకు దరఖాస్తులు స్వీకరించారు.
అభ్యర్థులకు ఏప్రిల్ 30న రాతపరీక్ష నిర్వహించారు. మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉన్నాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. పరీక్షలో రెండు సెక్షన్లు (సెక్షన్-ఎ, సెక్షన్-బి) ఉంటాయి. సెక్షన్-ఎ (టెక్నికల్ సబ్జెక్ట్) నుంచి 80 ప్రశ్నలు, సెక్షన్-బి (జనరల్ అవేర్‌నెస్ & న్యూమరికల్ ఎబిలిటీ, తెలంగాణ హిస్టరీ (సంస్కృతి, ఉద్యమం)) నుంచి 20 ప్రశ్నలు అడిగారు. పరీక్ష సమయం 2 గంటలు. పరీక్షలో కనీస అర్హత మార్కులకు ఓసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40 % (40 మార్కులు), బీసీ అభ్యర్థులకు 35 % (35 మార్కులు), ఎస్సీ-ఎస్టీ అభ్యర్థులకు 30 % (30 మార్కులు), దివ్యాంగులకు 30 % (30 మార్కులు)గా నిర్ణయించారు.
అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..