TSRTC Nursing College Recruitment: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న హైదరాబాద్ తార్నాకాలోని నర్సింగ్ కళాశాలలో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా ఒప్పంద ప్రాతిపదికన వైస్ ప్రిన్సిపాల్, అసోసియేట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు, అనుభవం, వేతనం తదితర అంశాలు నిర్ణయించారు. వాక్‌ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనున్నారు. సరైన అర్హతలున్నవారు జనవరి 23న తార్నాకాలోని ఆర్టీసీ నర్సింగ్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించే వాక్ఇన్ ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. అభ్యర్థులు అవసరమైన అన్ని విద్యార్హత ధ్రువపత్రాలు, వాటి జిరాక్స్ కాపీలు తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. 


వివరాలు..


* తార్నాక ఆర్టీసీ నర్సింగ్ కాలేజీలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు


ఖాళీల సంఖ్య: 03 పోస్టులు


1) వైస్ ప్రిన్సిపాల్: 01 పోస్టు


అర్హతలు: ఎంఎస్సీ (నర్సింగ్), పీహెచ్‌డీ (నర్సింగ్) ఉండాలి. 


అనుభవం: ఎంఎస్సీ (నర్సింగ్) అర్హతతో 12 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఇందులో కనీసం 10 సంవత్సరాల టీచింగ్ (అబ్‌స్టేట్రిక్స్, పీడియాట్రిక్ నర్సింగ్) అనుభవం ఉండాలి.


వేతనం: రూ.65,000.


2) అసోసియేట్ ప్రొఫెసర్: 01 పోస్టు


అర్హతలు: ఎంఎస్సీ (నర్సింగ్), పీహెచ్‌డీ (నర్సింగ్) ఉండాలి. 


అనుభవం: ఎంఎస్సీ (నర్సింగ్) అర్హతతో 8 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఇందులో కనీసం 5 సంవత్సరాల టీచింగ్ (అబ్‌స్టేట్రిక్స్, పీడియాట్రిక్ నర్సింగ్) అనుభవం ఉండాలి.


వేతనం: రూ.38,000.


3) ట్యూటర్: 01 పోస్టు


అర్హతలు: ఎంఎస్సీ (నర్సింగ్), పీహెచ్‌డీ (నర్సింగ్) ఉండాలి. 


అనుభవం: బీఎస్సీ (నర్సింగ్) లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్‌ అర్హతతో కనీసం ఏడాది అనుభవం ఉండాలి. 


వేతనం: రూ.25,000.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: అర్హతలు, పని అనుభవం, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.


కాంట్రాక్ట్ వ్యవధి:  ఒక సంవత్సరం. అభ్యర్థుల పనితీరు ఆధారంగా కాంట్రాక్ట్ వ్యవధిని పెంచే అవకాశం ఉంది.


వాక్‌ఇన్ తేదీ: 23.01.2024.


వాక్‌ఇన్ వేదిక: TSRTC College for Nursing,
                          Tarnaka Hospital, 
                           Hyderabad.


ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్లు..


➥ అభ్యర్థులు ఒరిజనల్ సర్టిఫికేట్‌లు, ఒక జత జిరాక్స్ కాపీలు వెంట తెచ్చుకోవాలి.


➥ పదోతరగతి లేదా తత్సమాన, ఇంటర్ సర్టిఫికేట్లు తీసుకెళ్లాలి.


➥ బీఎస్సీ, డిగ్రీ, పీజీ డిగ్రీ సర్టిఫికేట్లు తీసుకెళ్లాలి.


➥ యూనివర్సిటి నుంచి స్టడీ అండ్ కండక్ట్ సర్టిఫికేట్లు తీసుకెళ్లాలి..


➥ RNRM రిజిస్ట్రేషన్, వాలిడిటి రెన్యువల్ సర్టిఫికేట్‌, అడిషనల్ సర్టిఫికేట్‌ రిజిస్ట్రేషన్, ఆల్ ‌ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్‌లు, ఆధార్‌కార్డు, NUID, పాన్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్ ఫస్ట్ పేజీ, చెక్ జిరాక్స్ కాపీ, రీసెంట్ 6 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, అడిషనల్ సర్టిఫికేట్‌ కోర్సులు, కాస్ట్ సర్టిఫికేట్ మరియి ఏదైనా స్పెషలైజేషన్ సర్టిఫికేట్‌లు.


Notification


Website




మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..