తెలంగాణలో ఉమెన్ & ఛైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి జనవరి 3న పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించి అభ్యర్థుల మెరిట్ జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మొత్తం 11,125 మంది అభ్యర్థులకు మెరిట్ జాబితాలో చోటు కల్పించింది. అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను మెరిట్ జాబితాలో పొందుపరిచింది. రాతపరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ మార్కులు చూసుకోవచ్చు. 


తెలంగాణ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖలో మొత్తం 23 ఉమెన్ & ఛైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 5న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబరు 13 నుంచి అక్టోబరు 10 వరకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. జనవరి 3న రాతపరీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని 17 జిల్లాల్లో 75 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు.


జనవరి 3న సీడీపీవో పరీక్షను రాష్ట్రంలోని 17 జిల్లాల్లో 75 కేంద్రాల్లో టీఎస్‌పీఎస్సీ కంప్యూటర్‌ ఆధారిత పరీక్షను నిర్వహించింది. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్-1 (జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్), మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 (అభ్యర్థులకు సంబంధించిన సబ్జెక్టు) పరీక్ష నిర్వహించారు. మొత్తం 19,812 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా దాదాపు 14 వేల మంది అభ్యర్థులు పరీక్షకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీరిలో 11,648 వేలమంది మాత్రమే రాతపరీక్షకు హాజరయ్యారు. రాతపరీక్ష రాసినవారిలో  11,125 మంది అభ్యర్థులకు మెరిట్ జాబితాలో చోటు కల్పించారు. 523 మంది అభ్యర్థులకు పరిగణనలోకి తీసుకోలేదు. పేపర్-1, పేపర్-2 పరీక్ష రాసినవారిని మాత్రమే టీఎస్‌పీఎస్సీ మెరిట్ జాబితాలో చేర్చింది. 


Merit List Direct Link


                                           


నోటిఫికేషన్, పరీక్ష పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


Also Read:


TSPSC Exams: టీఎస్‌పీఎస్సీ పరీక్షల తేదీలు ఖరారు, షెడ్యూలు ఇలా!
రాష్ట్రంలో వివిధ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిర్వహించనున్న పరీక్షల తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 15న వెల్లడించింది. వీటిలో పశుసంవర్థక శాఖలో 185 వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులకు మార్చి 15, 16 తేదీల్లో రాతపరీక్ష నిర్వహించనున్నారు. వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,151 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలో వీరికి రాత పరీక్ష నిర్వహించనున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


టీఎస్‌పీఎస్సీకి 'పరీక్షా' సమయం, నియామక పరీక్షల తేదీలపై తర్జనభర్జన..
రాష్ట్రంలో ఇటీవలి కాలంలో వరసపెట్టి నోటిఫికేషన్లు విడుదల చేసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు పరీక్షల తేదీల రూపంలో పెద్ద చిక్కొచ్చిపడింది. ఉద్యోగ నియామక పరీక్షల తేదీలకు సంబంధించి తర్జనభర్జన పడుతోంది. టీఎస్‌పీఎస్సీకే పెద్ద పరీక్షగా మారింది. ఈ ఏడాది డిసెంబరు వరకు వివిధ పోటీ పరీక్షలు, ప్రవేశ పరీక్షలు, ఉద్యోగ పరీక్షలతో శని, ఆదివారాలు బిజీగా ఉండటంతో ఈ పరిస్థితి తలెత్తింది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...