తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే పలు పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి లభించగా.. టీఎస్పీఎస్సీ నుంచి మరికొన్ని పోస్టులకు నోటిఫికేషన్లు కూడా విడుదల అయ్యాయి. తాజాగా మరో 529 పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో  కొత్త జిల్లాలు, డివిజన్ల ఏర్పాటు నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖలో కొత్తగా  పోస్టులను మంజూరు చేస్తూ ఆ శాఖ కమిషనర్ ఎం.హన్మంతరావు సెప్టెంబరు 9న ఆదేశాలు జారీ చేశారు. 



ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖలో జారీచేసి ఉద్యోగాల్లో జూనియర్ అసిస్టెంట్ 253, సీనియర్ అసిస్టెంట్ 173, సూపరింటెండెంట్ 103 పోస్టులు ఉన్నాయి. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలకు అవసరమైన మేర ఈ పోస్టులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఈమేరకు జడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాల వారీగా పోస్టుల వివరాలను వెల్లడించారు. జూనియర్ అసిస్టెంట్ పొస్టులను గ్రూప్ 4 కింద భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు లేదా మూడు రోజుల్లోనే గ్రూప్ 4కు సంబంధించి ఆర్థిక శాఖ అనుమతులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.



ఇప్పటికే గ్రూప్ 4 కింద నోటిఫై చేసిన 9వేల పైచిలుకు పోస్టుల్లో వీఆర్ఓల భర్తీ కారణంగా ఖాళీలు ఏర్పడినట్లు తెలుస్తోంది. వాటిస్థానాల్లో ఈ కొత్త పోస్టులను ప్రభుత్వానికి చూపించనున్నట్లు సమాచారం. రెండు లేదా మూడు రోజుల్లోనే గ్రూప్ 4కు సంబంధించి ఆర్థికశాఖ అనుమతులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఇటీవల వరుసగా ఉద్యోగ ప్రకటనలు వెలువడుతున్న విషయం తెలిసిందే.



Related Articles:


TSPSC Jobs: తెలంగాణ మున్సిపల్‌ శాఖలో 175 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌, వివరాలు ఇలా!
తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. మున్సిపల్ శాఖలో 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 20 నుంచి అక్టోబరు 13 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనున్నారు.
నోటిఫికేషన్, దరఖాస్తు, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి...


TSPSC Jobs: స్త్రీ, శిశు సంక్షేమశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్!
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మరో నోటిఫికేషన్ వెలువడింది. ఉమెన్ డెవలప్‌మెంట్ అండ్ ఛైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి మహిళా అభ్యర్థుల నుంచి టీఎస్‌పీఎస్సీ దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థుల వయసు 18 - 44 సంవత్సరాల మధ్య ఉండాలి. సెప్టెంబరు 8 నుంచి 29 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, దరఖాస్తు, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి...


TSPSC Jobs:  టీఎస్‌పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్, రూ.50 వేలకు పైగా జీతం!
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మరో నోటిఫికేషన్ వెలువడింది. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమశాఖలో ఉమెన్ & ఛైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మహిళలు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సంబంధిత విభాగాల్లో డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
నోటిఫికేషన్, దరఖాస్తు, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి...


 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...