తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 1392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన రాతపరీక్షల తేదీలను టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబర్‌ 12 నుంచి రాత పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు అక్టోబర్‌ 3 వరకు కొనసాగనున్నాయి. ఈ పరీక్షలు పూర్తిగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించనున్నారు.


మొత్తం 16 సబ్జెక్టులకు 11 రోజుల పాటు ఉదయం జనరల్ స్టడీస్ పేపర్, మధ్యాహ్నం సంబంధిత సబ్జెక్టు పేపర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) పరీక్ష తేదీలను ఇప్పటికే విడుదల చేసింది. మల్టీజోన్‌-1లో 724, మల్టీజోన్‌-2లో 668 పోస్టులను భర్తీ కానున్నాయి. కమిషన్‌ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు ప్రకటన వెలువడటం ఇదే తొలిసారి. 2008లో ఉమ్మడి రాష్ట్రంలో 1100 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల కాగా, తాజాగా 1392 పోస్టులను భర్తీ చేయనున్నారు. 


సబ్జెక్టుల వారీగా పరీక్ష తేదీలు...


➥ ఇంగ్లిష్‌ - సెప్టెంబర్ 12


➥ వృక్షశాస్త్రం, ఆర్థికశాస్త్రం - సెప్టెంబర్ 13


➥ గణితం - సెప్టెంబర్ 14


➥ రసాయనశాస్త్రం - సెప్టెంబర్ 20


➥ తెలుగు - సెప్టెంబర్ 21


➥ భౌతికశాస్త్రం, జంతుశాస్త్రం  - సెప్టెంబర్ 22


➥ కామర్స్ - సెప్టెంబర్ 25


➥ సివిక్స్, అరబిక్, ఫ్రెంచ్ - సెప్టెంబర్ 26


➥ హిందీ - సెప్టెంబర్ 27


➥ చరిత్ర, సంస్కృతం - సెప్టెంబర్ 29


➥ ఉర్దూ -  అక్టోబర్‌ 3


పరీక్షవిధానం
మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్ 150 ప్రశ్నలు-150 మార్కులు (ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు), పేపర్-2 అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచి 150 ప్రశ్నలు 300 మార్కులు (ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు) ఉంటాయి. పరీక్ష సమయం ఒక్కో పేపరుకు 150 నిమిషాల సమయం కేటాయించారు. పేపర్-1 ఇంగ్లిష్, తెలుగులో; పేపర్-2 ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది.


తెలంగాణలో జూనియర్ లెక్చరర్ల భర్తీకి గతేడాది డిసెంబరులో నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టులు మల్టీ జోన్-1 పరిధిలో 724 పోస్టులు, మల్టీ జోన్-2 పరిధిలో 668 పోస్టులు ఉన్నాయి. డిసెంబరు 16 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అభ్యర్థులు జనవరి 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ లేదా జులైలో రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఖాళీల్లో అత్యధికంగా మ్యాథ్స్-154, ఇంగ్లిష్-153, జువాలజీ-128, హిందీ-117; బోటనీ,కెమిస్ట్రీ-113 పోస్టులు, ఫిజక్స్-112 పోస్టులు ఉన్నాయి. 


నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..


ALSO READ:


నాబార్డులో 150 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు, ఎంపికైతే నెలకు రూ.89,150 వరకు జీతం
ముంబయి ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న 'నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్(నాబార్డు)' దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 150 పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 2న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. సెప్టెంబరు 29 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రాతపరీక్షలు (ప్రిలిమినరీ, మెయిన్), ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఈసీఐఎల్‌లో 163 ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు- ఈ అర్హతలుండాలి
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్‌), కాంట్రాక్ట్ ప్రాతిపదికన దేశ వ్యాప్తంగా నెలకొన్న ఈసీఐఎల్‌ కేంద్రాల్లో ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 163 పోస్టులను భర్తీ చేయనున్నారు.  సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..