తెలంగాణ భూగర్భ జలశాఖలో వివిధ నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి రాత పరీక్ష తేదీలను టీఎస్‌పీఎస్సీ ఖరారు చేసింది. టీఎస్‌పీఎస్సీ తాజాగా చేసిన ప్రకటన ప్రకారం.. జులై 31న ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహించనుంది. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌‌టికెట్లను జులై 25న టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. 


అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష సమయానికి 45 నిమిషాల ముందు వరకు హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయి. కాగా, జీహెచ్‌ఎంసీ పరిధిలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షాల కారణంగా భూగర్భజలశాఖలో నాన్‌గెజిటెడ్‌ పోస్టుల రాత పరీక్షలు వాయిదా వేస్టున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పరీక్ష నిర్వహణకు సంబంధించిన కొత్త తేదీని టీఎస్‌పీఎస్సీ తాజాగా వెల్లడించింది. కేవలం హైదరాబాద్‌లో మాత్రమే పరీక్ష నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది.


హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 31న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి సెషన్‌లో పేపర్-1 (జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్), మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పేపర్-2 (వాటర్ రిసోర్సెస్) పరీక్షలు నిర్వహించనున్నారు. 


పరీక్ష విధానం: మొత్తం 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 300 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో పేపర్-1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 ప్రశ్నలు - 150 మార్కులు, పేపర్-2 వాటర్ రిసోర్సెస్ నుంచి 150 ప్రశ్నలు - 150 మార్కులు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 నిమిషాల సమయం కేటాయించారు. పేపర్-1 తెలుగు, ఇంగ్లిష్‌లో; పేపర్-2 కేవలం ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది.  



తెలంగాణలోని ప్రభుత్వ భూగర్భజల విభాగంలో నాన్-గెజిటెడ్ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గతేడాది నవంబరు 29న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి డిసెంబరు 7 నుంచి 28 వరకు దరఖాస్తులు స్వీకరించింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 21న పరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. వర్షాల కారణంగా పరీక్షను జులై 31కి వాయిదావేశారు. 


పోస్టుల వివరాలు..


గెజిటెడ్ పోస్టులు


ఖాళీల సంఖ్య: 25


1) టెక్నికల్ అసిస్టెంట్ - హైడ్రోజియోలజీ: 07 పోస్టులు
అర్హత: జియోలజీ/ అప్లయిడ్ జియోలజీ/హైడ్రోజియోలజీ విభాగాల్లో ఎంఎస్సీ/ఎంఎస్సీ(టెక్)/ఎంటెక్ (లేదా) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-ధన్‌బాద్ నుంచి డిప్లొమా అసోసియేట్‌షిప్ (అప్లయిడ్ జియోలజీ) ఉండాలి.
జీతం: రూ.51,320 - రూ.1,27,310.


2) టెక్నికల్ అసిస్టెంట్ - హైడ్రోలజీ: 05 పోస్టులు
అర్హత: బీఈ/బీటెక్ (సివిల్ ఇంజినీరింగ్). జియోలజీ ఒక సబ్జెక్టుగా ఉండాలి. (లేదా) ఎంఎస్సీ (హైడ్రోలజీ) రెండేళ్ల కోర్సు చేసి ఉండాలి.
జీతం: రూ.51,320 - రూ.1,27,310.


3) టెక్నికల్ అసిస్టెంట్ - జియోఫిజిక్స్: 08 పోస్టులు
అర్హత: ఎంఎస్సీ/ఎంఎస్సీ(టెక్)/ఎంటెక్ - జియోఫిజిక్స్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. 
జీతం: రూ.51,320 - రూ.1,27,310.


4) ల్యాబ్ అసిస్టెంట్: 01 పోస్టు
అర్హత: సైన్స్ డిగ్రీ. కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా ఉండాలి.
జీతం: రూ.32,810 - రూ.96,890.


5) జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్: 04 పోస్టులు
అర్హత: బీఎస్సీ (జియోలజీ/మ్యాథమెటిక్స్). 
జీతం: రూ.32,810 - రూ.96,890.


నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ALSO READ:


బ్యాంక్ నోట్ ప్రెస్‌లో 111 సూపర్‌వైజర్&జూనియర్ టెక్నీషియన్ పోస్టులు, అర్హతలివే!
దేవాస్ (ఎంపీ)లోని బ్యాంక్ నోట్ ప్రెస్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 111 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్‌, బీఎస్సీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 21 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, టైపింగ్ స్కిల్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


కాకినాడ జీజీహెచ్‌లో థియేటర్ అసిస్టెంట్, నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులు - అర్హతలివే!
కాకినాడలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాంట్రాక్ట్/ ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన థియేటర్ అసిస్టెంట్, నర్సింగ్ ఆర్డర్లీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును అనుసరించి 10వ తరగతి, డిప్లొమా, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి జులై 21న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. జులై 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎంపిక విధానం ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..


Join Us on Telegram: https://t.me/abpdesamofficial