తెలంగాణలో హార్టికల్చర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి జూన్ 17న నిర్వహించిన రాతపరీక్షకు సంబంధించిన ప్రాథమిక 'కీ'ని టీఎస్‌పీఎస్సీ జూన్ 27న విడుదల చేసింది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా కమిషన్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్లను అందుబాటులో ఉంచింది. మాస్టర్‌ ప్రశ్నపత్రాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్టు కమిషన్ తెలిపింది. జులై 26 వరకు రెస్పాన్స్‌షీట్లు ఆన్‌లైన్‌లో ఉండనున్నాయి. ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే జూన్‌ 28 నుంచి జులై 1 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా ఇంగ్లిష్‌లో మాత్రమే తమ అభ్యంతరాలు నమోదుచేయాలని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది. 


రెస్పాన్స్ షీట్ల కోసం క్లిక్ చేయండి..


మాస్టర్ క్వశ్చన్ పేపర్ల కోసం క్లిక్ చేయండి..


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హార్టికల్చర్ విభాగంలో ఖాళీల భర్తీకీ గతేడాది డిసెంబరు 22న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 22 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా పీజీ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థుల నుంచి జనవరి 3 నుంచి  24 వరకు దరఖాస్తులు స్వీకరిచింది. 


టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు తరువాత సిట్ అధికారుల సూచనలు మేరకు టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే నిర్వహించిన గ్రూప్ -1 ప్రిలిమ్స్, ఏఈఈ, డీఏవో, ఏఈ  పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఈ నెలలో జరగాల్సిన టీపీబీవో, వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల పరీక్షలను సైతం కమిషన్ వాయిదా వేసింది. వీటితోపాటు హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్షను కూడా టీఎస్‌పీస్సీ వాయిదా వేసింది.


హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష విధానం..


➥ మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు.


➥ ఇందులో పేపర్-1 (జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ): 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2 (హార్టీకల్చర్-డిగ్రీ స్థాయి): 150 ప్రశ్నలు-300 మార్కులు ఉంటాయి.


➥ పేపర్-1లో ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు, పేపర్-2లో ఒక్కో ప్రశ్నలకు 2 మార్కులు ఉంటాయి.


➥ పేపర్-1 ప్రశ్నపత్రం ఇంగ్లిష్, తెలుగులోనూ, పేపర్-2 ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది.  


నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..


ALSO READ:


ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో 239 టీచింగ్ పోస్టులు, అర్హతలివే!
తెలంగాణ రాష్ట్ర ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ(టీఎస్‌ఈఎస్‌) 2023-24 విద్యా సంత్సరానికి రాష్ట్రంలోని 23 ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీకి తాత్కాలిక ప్రాతిపదికన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. బోధనతో పాటు రెసిడెన్షియల్‌ పాఠశాల విధులకు హాజరుకావడం తప్పనిసరి. షేరింగ్‌ ప్రాతిపదికన బోర్డింగ్‌, లాడ్జింగ్‌ పాఠశాల క్యాంపస్‌లో అందుబాటులో ఉండేలా సదుపాయం ఉంటుంది. ఎంపికైన ఉపాధ్యాయులు సీబీఎస్‌ఈ సిలబస్‌ను ఆంగ్లభాషలో బోధించాల్సి ఉంటుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు జులై 02వ తేదీలోగా ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


కాకినాడ జీజీహెచ్‌లో 97 స్టాఫ్ నర్స్ పోస్టులు, వివరాలు ఇలా!
కాకినాడలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 97 పోస్టులను భర్తీ చేయనున్నారు. జీఎన్‌ఎం, బీఎస్సీ(నర్సింగ్), ఎంఎస్సీ (నర్సింగ్) ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సంబంధిత చిరునామాలో సమర్పి్ంచాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనప్పటికి జూన్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..



మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..


Join Us on Telegram: https://t.me/abpdesamofficial