తెలంగాణలోని వివిధ విభాగాల్లో 833 అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్  పోస్టుల భ‌ర్తీకి మార్చి 5న రాతపరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఓఎంఆర్ విధానంలోనే రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 27న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 5న ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. వాస్తవానికి ఫిబ్రవరి 12నే రాతపరీక్ష నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. అదేరోజు గేట్ పరీక్ష ఉండటంతో పరీక్ష తేదీని టీఎస్‌పీఎస్సీ మార్చి 5కి మార్చింది.


హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ వివిధ విభాగాల్లో 833 అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్  పోస్టుల భ‌ర్తీకి గతేడాది సెప్టెంబరు 12న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 21 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఈ పోస్టుల భర్తీకి ఓఎంఆర్ విధానంలో రాతపరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే ప్రకించింది. మార్చి 5న పరీక్ష నిర్వహించనున్నారు.


పోస్టుల వివరాలు...


మొత్తం ఖాళీలు: 833


* అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్: 434 పోస్టులు 


విభాగాలవారీగా పోస్టుల వివరాలు..


1)  అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్):  62 పోస్టులు
     
 విభాగం: పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్‌మెంట్ మిషన్ భగీరథ(సివిల్)



2)  అసిస్టెంట్ ఇంజినీర్: 41 పోస్టులు


విభాగం: పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్‌మెంట్.



3) అసిస్టెంట్ ఇంజినీర్: 13 పోస్టులు


విభాగం: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్‌ హెల్త్.



4) మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్): 29 పోస్టులు


విభాగం: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్‌ హెల్త్ .



5) టెక్నికల్ ఆఫీసర్: 09 పోస్టులు


విభాగం: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్‌ హెల్త్ .



Also Read:  TSPSC: తెలంగాణ మున్సిపల్‌ శాఖలో 175 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌, వివరాలు ఇలా!


 


6)  అసిస్టెంట్ ఇంజినీర్: 03 పోస్టులు


విభాగం:  ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్.



7) అసిస్టెంట్ ఇంజినీర్: 227 పోస్టులు


విభాగం: ఇరిగేషన్ & కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్. 



8) అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్): 12 పోస్టులు


విభాగం: గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్.



9)  అసిస్టెంట్ ఇంజినీర్: 38 పోస్టులు


విభాగం: గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్



10) అసిస్టెంట్ ఇంజినీర్: 38 పోస్టులు


విభాగం: ట్రాన్స్‌పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్‌మెంట్.



అర్హత: అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్ డిప్లొమా/బీఈ/బీటెక్ ఉత్తీర్ణత ఉండాలి.


వయసు: 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి.


జీతభత్యాలు: నెలకు రూ.45960-రూ.124150 చెల్లిస్తారు.



* జూనియర్ టెక్నికల్ ఆఫీసర్: 399 పోస్టులు



1) జూనియర్ టెక్నికల్ ఆఫీసర్:  27 పోస్టులు


విభాగం: పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్‌మెంట్ మిషన్ భగీరథ.



2) జూనియర్ టెక్నికల్ ఆఫీసర్: 68 పోస్టులు


విభాగం: పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్‌మెంట్



3) జూనియర్ టెక్నికల్ ఆఫీసర్: 32 పోస్టులు


విభాగం: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్‌ హెల్త్.



4) జూనియర్ టెక్నికల్ ఆఫీసర్: 212 పోస్టులు


విభాగం: ఇరిగేషన్ & కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్. 



5) జూనియర్ టెక్నికల్ ఆఫీసర్: 60 పోస్టులు


విభాగం: ట్రాన్స్‌పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్‌మెంట్.



అర్హత: జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్ డిప్లొమా/ బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.


వయసు: 18-44 ఏళ్లు వయసు ఉండాలి.


జీతభత్యాలు: నెలకు రూ.32810-రూ.96890 చెల్లిస్తారు.



దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.


Notification


Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...