తెలంగాణలో గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన తుది ఆన్సర్ కీలను టీఎస్‌పీస్సీ అక్టోబరు 6న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీలను అందుబాటులో ఉంచారు. మాస్టర్ క్వశ్చన్ పేపర్లతో జవాబులను పొందుపరిచారు. ప్రాథమిక ఆన్సర్ కీపై అభ్యంతరాలు నమోదుచేసుకున్న అభ్యర్థులతోపాటు పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫైనల్ ఆన్సర్ కీలను చూసుకోవచ్చు. త్వరలోనే గ్రూప్-4 ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.


ప్రిలిమినరీ ఆన్సర్ కీలో నమోదైన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని ఫైనల్ ఆన్సర్ కీని టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. ఫైనల్ కీలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి.


➥ పేపర్-1లో 7 ప్రశ్నలకు తొలగించగా.. 8 ప్రశ్నలకు సమాధానాలను మార్చింది. అలాగే పేపర్-2లో 3 ప్రశ్నలను తొలగించగా.. 5 ప్రశ్నలకు సమాధానాలను మార్చింది.


➥ పేపర్-1లో 11, 21, 60, 73, 129, 132, 148 ప్రశ్నలకు టీఎస్‌పీఎస్సీ తొలగించింది. అలాగే పలు ప్రశ్నల సమాధానాల్లో మార్పులు చేసింది. వాటిలో ప్రశ్న-19 సమాధానాన్ని 2 నుంచి 4 కి; ప్రశ్న-31 సమాధానాన్ని 2 నుంచి 1, 2 , 3, 4కి; ప్రశ్న-40 సమాధానాన్ని 1 నుంచి 2కి; ప్రశ్న-50 సమాధానాన్ని 1 నుంచి 1, 2కి; ప్రశ్న-55 సమాధానాన్ని 2 నుంచి 2, 3కి; ప్రశ్న-64 సమాధానాన్ని 1 నుంచి 3కి; ప్రశ్న-128 సమాధానాన్ని 1 నుంచి 2కి; ప్రశ్న-139 సమాధానాన్ని 1 నుంచి 1, 4కి మార్చింది.


➥ పేపర్-2లో 25, 40, 78 ప్రశ్నలకు టీఎస్‌పీఎస్సీ తొలగించింది. అలాగే పలు ప్రశ్నల సమాధానాల్లో మార్పులు చేసింది. వాటిలో ప్రశ్న-11 సమాధానాన్ని 2 నుంచి 2, 4కి; ప్రశ్న-18 సమాధానాన్ని 1 నుంచి 4కి; ప్రశ్న-33 సమాధానాన్ని 4 నుంచి 1కి; ప్రశ్న-94 సమాధానాన్ని 2 నుంచి 3కి; ప్రశ్న-96 సమాధానాన్ని 2 నుంచి 3కి మార్పు చేసింది.


Group-IV Services - Paper-1 - Final Key of the Master Question Paper


Group-IV Services - Paper-2 - Final Key of the Master Question Paper








తెలంగాణలో రాష్ట్రంలో వివిధ విభాగాల్లో గ్రూప్‌-4 కేటగిరీలో 8,039 ఉద్యోగాల భర్తీకి గతేడాది డిసెంబర్‌ 1న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 9,51,321 మంది దరఖాస్తు చేశారు. జులై 1న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షకు మొత్తం 80 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో పేపర్‌-1కు 7,62,872 మంది, పేపర్-2కు 7,61,198 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు జనరల్ స్టడీస్ పరీక్ష, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెక్టరేరియల్ ఎబిలిటీస్ పరీక్ష నిర్వహించారు.  'గ్రూప్‌-4' ప్రిలిమినరీ పరీక్ష ఆన్సర్ 'కీ'ని టీఎస్‌పీఎస్సీ ఆగస్టు 28న విడుదల చేసింది. ఆన్సర్ కీలో అభ్యంతరాలు తెలియజేసేందుకు ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్‌ 4 అవకాశం కల్పించింది. అనంతరం అక్టోబరు 6న ఫైనల్ కీని టీఎస్‌పీఎస్సీ విడుదల చేేసింది.


ALSO READ:


తెలంగాణ జెన్‌కో‌లో 339 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు, ఎంపికైతే జీతమెంతో తెలుసా?
తెలంగాణ రాష్ట్ర పవర్ జెనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌(TSGENCO)‌లో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా 339 ఏఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ కింద 94 పోస్టులు, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద 245 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.  ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 7న ఉదయం 11 గంటల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 29న మధ్యాహ్నం 1 గంటలోపు ఫీజు చెల్లించి, రాత్రి 12 గంటల్లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


తెలంగాణ జెన్‌కో‌లో 60 కెమిస్ట్ పోస్టులు, ఎంపికైతే నెలకు రూ.1.31 లక్ష వరకు జీతం
తెలంగాణ రాష్ట్ర పవర్ జెనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌(TSGENCO)‌లో కెమిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా 60 పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రథమ శ్రేణిలో ఎంఎస్సీ (కెమిస్ట్రీ/ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్) అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 7న ఉదయం 11 గంటల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 29న మధ్యాహ్నం 1 గంటలోపు ఫీజు చెల్లించి, రాత్రి 12 గంటల్లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..