తెలంగాణ ఉమెన్ డెవలప్‌మెంట్ & ఛైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (సూపర్‌వైజర్) గ్రేడ్-1 పోస్టుల భర్తీకి జనవరి 8న నిర్వహించిన రాతపరీక్ష మెరిట్ జాబితాను టీఎస్‌పీఎస్సీ మార్చి 3న విడుదల చేసింది. అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు రాతపరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా కమిషన్ ఈ మెరిట్ జాబితాను రూపొందించింది. మెరిట్ జాబితాలో మొత్తం 15,280 మంది అభ్యర్థులు చోటు సంపాదించారు. రాతపరీక్షకు మొత్తం 26,751 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వీరిలో 16,729 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్షకు హాజరైనవారిలో 15,280 మంది అభ్యర్థులను మెరిట్‌లిస్టులో చేర్చగా, పలుకారణాల వల్ల 1449 మంది అభ్యర్థులకు మెరిట్‌లిస్ట్ పరిగణనలోకి తీసుకోలేదు.


తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉమెన్ డెవలప్‌మెంట్ అండ్ ఛైల్డ్ వెల్ఫేర్ డెవలప్‌మెంట్‌లో 181 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (సూపర్‌వైజర్) పోస్టుల భర్తీకి ఆగస్టు 27న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 8 నుంచి 29 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాతపరీక్ష హాల్‌టికెట్లను జనవరి 2న విడుదల చేసింది.  హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల పరిధిలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో జనవరి 8న రాతపరీక్ష నిర్వహించింది. పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ కీని జనవరి 20న విడుదల చేసింది. ఆన్సర్ కీపై జనవరి 24 వరకు అభ్యంతరాలు స్వీకరించింది. అనంతరం ఫిబ్రవరి 22న ఫైనల్ కీని విడుదల చేసింది. తాజాగా అభ్యర్థుల మెరిట్ జాబితాను ప్రకటించింది.


అభ్యర్థుల మెరిట్ జాబితా కోసం క్లిక్ చేయండి..




పోస్టుల వివరాలు..


* ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (సూపర్‌వైజర్) గ్రేడ్-1 పోస్టులు


పోస్టుల సంఖ్య: 181 


జోన్లవారీగా ఖాళీలు: కాళేశ్వరం-26, బాసర-27, రాజన్న సిరిసిల్ల-29, భద్రాద్రి-26, యాదాద్రి-21, చార్మినార్-21, జోగుళాంబ-31.


విభాగం: ఉమెన్ డెవలప్‌మెంట్ అండ్ ఛైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్.


అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (హోంసైన్స్/ సోషల్ వర్క్/ సోషియాలజీ/ఫుడ్ సైన్స్ & న్యూట్రీషన్/ ఫుడ్ & న్యూట్రీషన్/ బోటనీ/ జువాలజీ & కెమిస్ట్రీ/బయోకెమిస్ట్రీ/ అప్లైడ్ న్యూట్రీషన్ & పబ్లిక్ హెల్త్/ క్లినికల్ న్యూట్రీషన్ & డైటేటిక్స్/ ఫుడ్ సైన్సెస్ & క్వాలిటీ కంట్రోల్/ బయోలాజికల్ కెమిస్ట్రీ/ ఫుడ్ సైన్సెస్ & మేనేజ్‌మెంట్/ ఫుడ్ టెక్నాలజీ & న్యూట్రీషన్/ ఫుడ్ టెక్నాలజీ & మేనేజ్‌మెంట్). మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.


వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు 02.07.1978 - 01.07.2004 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, NCC అభ్యర్థులు 3 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీ-బీసీ-ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


దరఖాస్తు ఫీజు: రూ.280. ఇందులో రూ.200 అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా, రూ.80 పరీక్ష ఫీజుగా చెల్లించాలి. నిరుద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది. 


ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.


నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. 


Also Read:


టీఎస్‌పీఎస్సీ పరీక్షల తేదీలు వెల్లడి, ఏ పరీక్ష ఎప్పుడంటే?
రాష్ట్రంలో ఉద్యోగ నియామక పరీక్షల తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) మార్చి 3న వెల్లడించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 15, 16 తేదీల్లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ నియామక పరీక్ష నిర్వహించనున్నారు. అలాగే ఏప్రిల్ 4న హార్టికల్చర్ ఆఫీసర్, ఏప్రిల్ 23న అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఏఎంవీఐ) నియామక పరీక్షలు నిర్వహిస్తామని కమిషన్ తెలిపింది.
పరీక్షల షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...