తెలంగాణ ఉమెన్ డెవలప్‌మెంట్ అండ్ ఛైల్డ్ వెల్ఫేర్ డెవలప్‌మెంట్‌లో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (సూపర్‌వైజర్) పోస్టుల భర్తీకి సంబంధించిన రాతపరీక్ష హాల్‌టికెట్లను టీఎస్‌పీఎస్సీ జనవరి 2న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 8న రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఓఎంఆర్ విధానంలోనే పరీక్ష జరుగనుంది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉమెన్ డెవలప్‌మెంట్ అండ్ ఛైల్డ్ వెల్ఫేర్ డెవలప్‌మెంట్‌లో 181 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (సూపర్‌వైజర్) పోస్టుల భర్తీకి ఆగస్టు 27న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 8 నుంచి 29 వరకు దరఖాస్తులు స్వీకరించారు.
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
పోస్టుల వివరాలు..
* ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (సూపర్‌వైజర్) గ్రేడ్-1 పోస్టులు
పోస్టుల సంఖ్య: 181
జోన్లవారీగా ఖాళీలు: కాళేశ్వరం-26, బాసర-27, రాజన్న సిరిసిల్ల-29, భద్రాద్రి-26, యాదాద్రి-21, చార్మినార్-21, జోగుళాంబ-31.
విభాగం: ఉమెన్ డెవలప్‌మెంట్ అండ్ ఛైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (హోంసైన్స్/సోషల్ వర్క్/సోషియాలజీ/ఫుడ్ సైన్స్ & న్యూట్రీషన్/ ఫుడ్ & న్యూట్రీషన్/బోటనీ/జువాలజీ & కెమిస్ట్రీ/బయోకెమిస్ట్రీ/అప్లైడ్ న్యూట్రీషన్ & పబ్లిక్ హెల్త్/ క్లినికల్ న్యూట్రీషన్ & డైటేటిక్స్/ ఫుడ్ సైన్సెస్ & క్వాలిటీ కంట్రోల్/బయోలాజికల్ కెమిస్ట్రీ/ఫుడ్ సైన్సెస్ & మేనేజ్‌మెంట్/ఫుడ్ టెక్నాలజీ & న్యూట్రీషన్/ఫుడ్ టెక్నాలజీ & మేనేజ్‌మెంట్). మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు 02.07.1978 - 01.07.2004 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, NCC అభ్యర్థులు 3 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీ-బీసీ-ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.280. ఇందులో రూ.200 అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా, రూ.80 పరీక్ష ఫీజుగా చెల్లించాలి. నిరుద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.
పరీక్ష విధానం, సిలబస్ వివరాలు...
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
'గ్రూప్-2' అభ్యర్థులకు అలర్ట్, సిలబస్‌లో ఈ మార్పులు గమనించారా?
టీఎస్‌పీఎస్సీ 783 పోస్టులతో ఇటీవల విడుదల చేసిన గ్రూప్-2 ఉద్యోగాల సిలబస్‌లో కొన్ని మార్పులు చేసింది. ప్రస్తుత పరిస్థితులకు తగినట్టు అదనంగా పలు అంశాలను జత చేసింది. గ్రూప్-2లో మొత్తం నాలుగు పేపర్లు ఉండగా, 600 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పేపర్-2లో స్వల్ప మార్పులు చేయగా, పేపర్-3లో ఎక్కువ మార్పులు జరిగాయి. పేపర్-1, 4లో మార్పులేవీ చేయలేదు. పేపర్-2 రెండో సెక్షన్‌లోని పాలిటీలో కొత్తగా రాజ్యాంగ సవరణ విధానం, సవరణ చట్టాలను ప్రత్యేకంగా పేర్కొన్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ 'గ్రూప్-3' నోటిఫికేషన్ వచ్చేసింది, 1365 ఖాళీల భర్తీకి 24 నుంచి దరఖాస్తులు!
తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతూనే ఉంది. వరుసపెట్టి నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిసెంబరు 30న గ్రూప్-3 నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1365 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వివిధ విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, ఆడిటర్, సీనియర్ ఆడిటర్, అసిస్టెంట్ ఆడిటర్, అకౌంటెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రూప్-3 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ జనవరి 24 నుంచి ప్రారంభంకానుంది. పోస్టుల అర్హతలు, ఇతర వివరాలను జనవరి 24 నుంచే పూర్తి నోటిఫికేషన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఫిబ్రవరి 23 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణలో 'గ్రూప్-2' నోటిఫికేషన్ విడుదల, పోస్టుల పూర్తి వివరాలు ఇలా! దరఖాస్తు తేదీలివే!
తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం కొత్త సంవత్సర కానుకగా శుభవార్త తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 783 'గ్రూప్-2' పోస్టుల భర్తీకి డిసెంబరు 29న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మున్సిపల్ కమిషనర్, ఏసీటీవో, తహసిల్దార్, సబ్-రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, మండల పంచాయతీ అధికారి, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..