తెలంగాణ ప్రభుత్వ రవాణా విభాగంలో 113 అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) డిసెంబరు 31న నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల్లో పురుషులకు 72 పోస్టులు, మహిళలకు 41 పోస్టులు కేటాయించారు. వీటిలో మల్టీజోన్-1 పరిధిలో 54 పోస్టులు, మల్టీజోన్-2 పరిధిలో 59 పోస్టులు ఉన్నాయి. వీటిలో ఓసీ-46, ఈడబ్ల్యూఎస్-11, బీసీ-31, ఎస్సీ-16, ఎస్టీ-7, స్పోర్ట్స్ కోటా- 02 పోస్టులు కేటాయించారు. జనవరి 12 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఫిబ్రవరి 01 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్‌ 23న పరీక్ష నిర్వహించనున్నట్లు కమిషన్ తెలిపింది.

Continues below advertisement


గతంలో అసిస్టెంట్‌ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్‌సీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థులకు హెవీ లైసెన్స్ ఉండాలన్న నిబంధనపై పలు అభ్యంతరాలు రావడంతో కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా అర్హతల విషయంలోనూ పలు విజ్ఞప్తులు వచ్చాయి. 


అసలు కారణం ఇదే..
ఈ నోటిఫికేషన్ అర్హతల గురించి మహిళా అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆటోమొబైల్, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనిలో పాటు.. హెవీ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా తప్పనిసరిగా ఉండాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అయితే  ఈ పోస్టులకు లైట్ మోటార్ వెహికిల్ లైసెన్స్ అడగకుండా.. హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అడగటం ఏంటని.. అది కూడా మహిళలు ఈ లైసెన్స్ తీసుకోవడం ఎలా సాధ్యమవుతుందని అభ్యంతరాలు రావడంతో దరఖాస్తు ప్రక్రియ ఆగిపోయింది.



Also Read:


తెలంగాణ 'గ్రూప్-3' నోటిఫికేషన్ వచ్చేసింది, 1365 ఖాళీల భర్తీకి 24 నుంచి దరఖాస్తులు!
తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతూనే ఉంది. వరుసపెట్టి నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిసెంబరు 30న గ్రూప్-3 నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1365 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వివిధ విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, ఆడిటర్, సీనియర్ ఆడిటర్, అసిస్టెంట్ ఆడిటర్, అకౌంటెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రూప్-3 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ జనవరి 24 నుంచి ప్రారంభంకానుంది. పోస్టుల అర్హతలు, ఇతర వివరాలను జనవరి 24 నుంచే పూర్తి నోటిఫికేషన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఫిబ్రవరి 23 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


తెలంగాణలో 'గ్రూప్-2' నోటిఫికేషన్ విడుదల, పోస్టుల పూర్తి వివరాలు ఇలా! దరఖాస్తు తేదీలివే!
తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం కొత్త సంవత్సర కానుకగా శుభవార్త తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 783 'గ్రూప్-2' పోస్టుల భర్తీకి డిసెంబరు 29న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మున్సిపల్ కమిషనర్, ఏసీటీవో, తహసిల్దార్, సబ్-రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, మండల పంచాయతీ అధికారి, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


8039 పోస్టులకే 'గ్రూప్-4' నోటిఫికేషన్ - అర్హతలు, దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా!
తెలంగాణలో గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి డిసెంబరు 2న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి డిసెంబరు 30న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు 2023, జనవరి 30 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. రాతపరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...