తెలంగాణలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) పోస్టుల మెరిట్ జాబితాను టీఎస్‌పీఎస్సీ సెప్టెంబరు 20న ప్రకటించింది. అధికారిక వెబ్‌సైట్‌లో సబ్జెక్టుల వారీగా అభ్యర్థుల ఎంపిక జాబితాను అందుబాటులో ఉంచింది. పరీక్షలకు హాజరైనవారు మెరిట్ జాబితా చూసుకోవచ్చు.

మెరిట్ జాబితాకు ఎంపికైనవారిలొ అగ్రికల్చర్ ఇంజినీరింగ్- 857, సివిల్ ఇంజినీరింగ్ - 27,145, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్- 10,948, మెకానికల్ ఇంజినీరింగ్ - 7,726 మంది అభ్యర్థులు ఉన్నారు. మెరిట్ జాబితాకు ఎంపికైన అభ్యర్థుల్లో 1:2 నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఎంపిక చేయనుంది.

వివిధ ప్రభుత్వ ఇంజినీరింగ్ విభాగాల్లో మొత్తం 1540 ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ పోస్టులకు మే 8, 9, 21, 22 తేదీల్లో సీబీఆర్‌టీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు ఇప్పటికే తుది కీ విడుదల చేసిన కమిషన్... తాజాగా సబ్జెక్టుల వారీగా మెరిట్ జాబితాలను వెల్లడించింది. 

ASSISTANT EXECUTIVE ENGINEERS - CIVIL ENGINEERING - MERIT LIST
ASSISTANT EXECUTIVE ENGINEERS - MECHANICAL ENGINEERING - MERIT LIST
ASSISTANT EXECUTIVE ENGINEERS - ELECTRICAL AND ELECTRONICS ENGINEERING - MERIT LIST
ASSISTANT EXECUTIVE ENGINEERS - AGRICULTURAL ENGINEERING - MERIT LIST

ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1540 అసిస్టెంట్​ ఎగ్జిక్యూటివ్ ​ఇంజినీర్​(ఏఈఈ) పోస్టులను భర్తీకి గతేడాది సెప్టెంబరు 3న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మిష‌న్ భ‌గీర‌థ‌, ఇరిగేష‌న్‌, పంచాయ‌తీరాజ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్‌, మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్‌, ట్రైబ‌ల్ వెల్ఫేర్‌, అర్అండ్‌బీ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. వీటిని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానం ద్వారా భ‌ర్తీ చేయనున్నారు.

పోస్టుల వివరాలు.. 

* అసిస్టెంట్​ ఎగ్జిక్యూటివ్ ​ఇంజినీర్​(ఏఈఈ) పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 1540

 1)   ఏఈఈ(సివిల్)- పీఆర్‌ఆర్‌డీ డిపార్ట్‌మెంట్  (మిషన్ భగీరథ): 302 పోస్టులు     

2)   ఏఈఈ(సివిల్)- పీఆర్‌ఆర్‌డీ ‌డిపార్ట్‌మెంట్: 211 పోస్టులు    

3)  ఏఈఈ (సివిల్) ఎంఏ యూడీ- పీహెచ్: 147 పోస్టులు    

4)  ఏఈఈ(సివిల్) టీడబ్ల్యూ డిపార్ట్ మెంట్: 15 పోస్టులు

5)  ఏఈఈ ఐ‌సీఏడీ డిపార్ట్ మెంట్: 704 పోస్టులు    

 6)  ఏఈఈ (మెకానికల్) ఐసీఏడీ(జీడబ్ల్యూడీ): 03 పోస్టులు    

 7)  ఏఈఈ (సివిల్) టీఆర్‌బీ: 145 పోస్టులు    

 8)  ఏఈఈ (ఎలక్ట్రికల్) టీఆర్‌బీ: 13 పోస్టులు    

పోస్టుల వివరాలు, నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..

ALSO READ:

డీఎస్సీ పరీక్ష తేదీలు ఖరారు - షెడ్యూలు, సిలబస్‌ ప్రకటించిన విద్యాశాఖ
తెలంగాణలోని ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సెప్టెంబరు 7న నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిద్వారా మొత్తం 5089 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అయితే డీఎస్సీ పరీక్ష తేదీలు, సిలబస్‌, అర్హతలను విద్యాశాఖ తాజాగా ప్రకటించింది. ఆన్‌లైన్‌ పరీక్ష తేదీలను ఖరారు చేస్తూ.. సెప్టెంబరు 20న అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీనిప్రకారం నవంబర్‌ 20 నుంచి 30 వరకు సబ్జెక్టుల వారీగా డీఎస్సీ పరీక్షల తేదీలను విద్యాశాఖ ఖరారు చేసింది. ప్రతీ రోజూ రెండు విడతల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుండి 11.30 వరకు మొదటి విడత, రెండో విడతలో మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ సంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...